తర్ల దలాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తర్ల దలాల్
జననం(1936-06-03)1936 జూన్ 3
పూణే, భారతదేశం
మరణం2013 నవంబరు 6(2013-11-06) (వయసు 77)
జాతీయతభారతీయురాలు
వృత్తివంట పుస్తక రచయిత్రి, టీవీ చెఫ్
క్రియాశీల సంవత్సరాలు1966-2013

తర్ల దలాల్ (1936 జూన్ 3 - 2013 నవంబరు 6) భారతీయ చెఫ్, వంటల పుస్తకాల రచయిత్రి, వంటల ప్రదర్శనల వ్యాఖ్యాత.[1] ఈమె వంటల రంగంలో పద్మశ్రీ బిరుదు పొందిన ఏకైక భారతీయ మహిళగా నిలిచింది.[2] ఆమె మొదటి వంటల పుస్తకం, ది ప్లెజర్స్ ఆఫ్ వెజిటేరియన్ కుకింగ్ 1974 లో ప్రచురితమైంది. అప్పటి నుండి, ఆమె 100 కి పైగా పుస్తకాలు వ్రాసింది, అవి 10 మిలియన్ కాపీలు కంటే ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఆమె అతిపెద్ద భారతీయ ఆహార వెబ్‌సైట్‌ను కూడా నడిపింది. ఆమె వంట షోలలో ది తర్లా దలాల్ షో, కుక్ ఇట్ అప్ విత్ తర్ల దలాల్ ఉన్నాయి. ఆమె వంటకాలు దాదాపు 25 మ్యాగజైన్‌లలో ప్రచురించబడ్డాయి, 120 మిలియన్ భారతీయ గృహాలలో వాటిని ప్రయత్నించారని అంచనా.[3] ఆమె అనేక వంటకాలు, ఆరోగ్యకరమైన వంటల గురించి వ్రాసినప్పటికీ, ఆమె భారతీయ శాఖాహార వంటకాలలో ప్రత్యేకించి గుజరాతీ వంటకాలలో నైపుణ్యం సాధించింది.[4]  ఆమెను 2007 లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది,[5]  ఈమె వంట రంగం నుండి బిరుదు పొందిన ఏకైక భారతీయ మహిళగా నిలిచింది.[6] 2005 లో ఇండియన్ మర్చంట్స్ ఛాంబర్ ద్వారా ఆమెకు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది.[7] ఆమె, 2013 నవంబరు 6 న గుండెపోటుతో మరణించింది.[8][9][10][11]

వ్యక్తిగతం

[మార్చు]

ఆమె మహారాష్ట్ర లోని పూణేలో పుట్టి పెరిగింది. 1960 లో నళిన్ దలాల్‌ను వివాహం చేసుకుంది. ఆ తరువాత బొంబాయి (ప్రస్తుతం ముంబై ) వెళ్ళి అక్కడే నివసించింది.[12] తర్ల దలాల్‌కు సంజయ్, దీపక్, రేణు అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త నళిన్ 2005 లో మరణించాడు. ఆమె దక్షిణ ముంబైలోని నేపియన్ సీ రోడ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించేది.[12]

వృత్తి

[మార్చు]

దలాల్ 1966లో తన ఇంటి నుండి వంట తరగతులను నిర్వహించడం ప్రారంభించింది. ఇది 1974 లో ఆమె మొదటి కుక్ పుస్తకం ది ప్లెజర్స్ ఆఫ్ వెజిటేరియన్ కుకింగ్ ప్రచురణకు దారితీసింది. ఈ పుస్తకం 15 లక్షల కాపీలకు పైగా అమ్ముడైంది. కాలక్రమేణా, ఆమెకు ప్రజాదరణ పెరిగింది. విదేశీ వంటకాలను ప్రజలకు పరిచయం చేసి ప్రాచుర్యం కల్పించిన ఘనత తర్లా దలాల్ కి దక్కింది. ఆమె విదేశాలకు చెందిన మాంసాహార వంటకాలకు శాఖాహార సంస్కరణలను రూపొందించింది. ఆమె భారతదేశ వంటల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఈమె భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన వంట పుస్తక రచయిత్రి.[13] ఆమె పుస్తకాలు డచ్, రష్యన్, హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీతో సహా అనేక భాషలలోకి అనువదించబడ్డాయి. ఆమె వంట పత్రికలను కూడా ప్రచురించింది. 2007లో, ఆమె తన 'టోటల్ హెల్త్ సిరీస్' కుక్‌బుక్ సిరీస్‌ను ప్రారంభించింది.[14] ఆమె రెడీ-టు-కుక్ మిక్స్‌లను, తర్లా దలాల్ మిక్స్‌లను ఇంటర్నేషనల్ బెస్ట్‌ఫుడ్స్ లిమిటెడ్ 2000 లో కొనుగోలు చేసింది.[15]

సినిమా

[మార్చు]

తర్ల దలాల్‌ బయోపిక్ అయిన తర్ల, 2023 జూలై 7 న జీ5 లో విడుదలైంది. ఇందులో హుమా ఖురేషి నటించినది. దీనిని రోనీ స్క్రూవాలా, అశ్వినీ అయ్యర్ తివారీ, నితేష్ తివారీలు నిర్మించారు.[16]

పుస్తకాలు

[మార్చు]
  • ది కంప్లీట్ గుజరాతీ కుక్ బుక్. సంజయ్ అండ్ కో, 1999. ఐఎస్బీఎన్ (ISBN) 81-86469-45-1.
  • నో యువర్ ఫ్లోర్స్. సంజయ్ అండ్ కో. ఐఎస్బీఎన్ (ISBN) 81-89491-89-X.
  • ఇటాలియన్ కుక్ బుక్. సంజయ్ అండ్ కో, 2000. ఐఎస్బీఎన్ (ISBN) 81-86469-52-4.
  • హెల్తీ బ్రేక్ ఫాస్ట్. సంజయ్ అండ్ కో, 2003. ఐఎస్బీఎన్ (ISBN) 81-86469-81-8.
  • శాండ్ విచెస్. సంజయ్ అండ్ కో, 2004. ఐఎస్బీఎన్ (ISBN) 81-86469-95-8.
  • కర్రీస్ అండ్ కడీస్. సంజయ్ అండ్ కో, 2005. ఐఎస్బీఎన్ (ISBN) 81-89491-11-3.
  • చిప్స్ & డిప్స్. తర్లా దాలాల్, 2006. ఐఎస్బీఎన్ (ISBN) 81-89491-35-0.
  • బేక్డ్ డిషెస్. తర్లా దలాల్, 2006. ఐఎస్బీఎన్ (ISBN) 81-89491-39-3.
  • పంజాబీ ఖానా. సంజయ్ అండ్ కో, 2007. ఐఎస్బీఎన్ (ISBN) 81-89491-54-7.
  • డెలిషియస్ డయాబెటిక్ రెసిపీస్: లో కేలరీ కుకింగ్: టోటల్ హెల్త్ సిరీస్. సంజయ్ అండ్ కో, 2002. ఐఎస్బీఎన్ (ISBN) 81-86469-69-9.
  • జైన్ ఫుడ్: కంపాషనేట్ అండ్ హెల్దీ ఈటింగ్, విత్ మనోజ్ జైన్ అండ్ లక్ష్మీ జైన్, ఎంజైన్.నెట్, 2005. ఐఎస్బీఎన్ (ISBN) 0977317803

మూలాలు

[మార్చు]
  1. "Rendezvous with Tarla Dalal". Sify. Archived from the original on 17 March 2012.
  2. "Man's empowerment... in the kitchen!". Deccan Herald.
  3. "The Queen of Cabbages". India Today. 30 April 1994.
  4. "Tarla Dalal shares a few Gujarati recipes". MiD DAY. 27 April 2004.
  5. "Padma Awards Directory (1954-2009)" (PDF). Ministry of Home Affairs (India). Archived from the original (PDF) on 10 మే 2013.
  6. India, Uppercrust. "Home Page - uppercrustindia". www.uppercrustindia.com. Archived from the original on 14 June 2016. Retrieved 2016-06-25.
  7. "The Biography of Celebrated Indian Chef Tarla Dalal". Biharprabha News. Retrieved 6 November 2013.
  8. "Noted cookbook author Tarla Dalal dead". The Times of India. Nov 7, 2013. Archived from the original on November 11, 2013. Retrieved 2013-11-08.
  9. Abhinav Bhatt (6 November 2013). "Celebrity chef Tarla Dalal dies at 77". Retrieved 10 August 2016 – via NDTV.
  10. Mithila Phadke (7 November 2013). "Noted cookbook author Tarla Dalal dead". Times of India. Retrieved 10 August 2016.
  11. "Celebrity Indian cook Tarla Dalal passes away". 7 November 2013. Retrieved 10 August 2016 – via The Express Tribune.
  12. 12.0 12.1 Food Dalal : Tarla Dalal Archived 26 మార్చి 2012 at the Wayback Machine, Harmony Magazine, December 2005
  13. "Tarla Dalal: Indian Vegetarian Cook and Friend of JAINA". HuffPost. 2013-11-11. Retrieved 2023-06-21.
  14. "An empire called Tarla Dalal". The Hindu. May 14, 2007.
  15. "Best foot forward". Business Line. April 27, 2000.
  16. "Huma Qureshi to play Tarla Dalal in celebrity chef's biopic". The Hindu. 19 April 2022. Retrieved 29 May 2023.