బంజారా భవన్
సేవాలాల్ బంజారా భవన్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని బంజారా లంబాడీ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది.ఇది హైదరాబాదు లోని బంజారా హీల్స్ లో రోడ్ నెంబర్ 10 లో ఉంది.ఇందులో బంజారా ప్రజల సాంస్కృతిక కార్యక్రమాలు,సామాజిక సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాటు చేశారు[1].
సేవాలాల్ బంజారా భవన్ | |
---|---|
సాధారణ సమాచారం | |
చిరునామా | రోడ్డు నె 10, బంజారా హిల్స్ హైదరాబాదు 500 034 తెలంగాణ, భారతదేశం |
ప్రస్తుత వినియోగదారులు | గిరిజన సంక్షేమ శాఖ హైదరాబాద్ |
నిర్మాణ ప్రారంభం | మార్చి 2016 |
పూర్తి చేయబడినది | 17 సెప్టెంబరు 2022 |
వ్యయం | 24.43 కోట్ల రూపాయలు |
క్లయింట్ | తెలంగాణ ప్రభుత్వం |
సాంకేతిక విషయములు | |
పరిమాణం | ఒక ఎకరం (00 హెక్టార్లు) |
నేల వైశాల్యం | 61.544 sq ft (5.7176 మీ2) |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | కాంట్రాక్టర్ |
చరిత్ర
[మార్చు]తెలంగాణ రాష్ట్ర ప్రభు ఉండే లోత్వం ఏర్పాటు అయ్యాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిజాం ప్రభుత్వ హయాంలో బంజారా ప్రజల [2]స్థితిగతులకు సంబంధించిన పుస్తకాలు పరిశీలించి బంజారాహిల్స్ లో బంజారా ప్రజల ఆనవాల్లు లేకపోవడంతో 2016-2017 సంవత్సర కాలంలో బంజారా ప్రజల కోసం వారి ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ పేరుతో ఒక బంజారా భవన్ నిర్మించి బంజారా ప్రజలకు న్యాయం చేయాలనే గొప్ప ఆలోచనతో కేసిఆర్ ప్రభుత్వం ప్రయత్నం ప్రారంభించారు.
నిధులు
[మార్చు]బంజారా భవన్ నిర్మాణానికి అప్పటి కెసిఆర్ ప్రభుత్వం దాని నిర్మాణానికి సంబంధించిన మొత్తం నిధులు ₹= 24.43 కోట్లు మంజూరు చేసింది.
భవన ప్రారంభం
[మార్చు]ఈ బంజారా భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ శుభ హస్తాలతో 2022 లో సెప్టెంబర్ 17 న శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతో ఈ బంజారా భవనాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర బంజారాలకు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి [3][4]వేడుకల సందర్భంగా ప్రభుత్వ పరంగా ప్రతి జిల్లాకు నిధులు మంజూరు చేస్తూ అధికారికంగా జయంతిని రాష్ట్రంలో నిర్వహించింది. తొలి సారిగా 2023 లో ఫిబ్రవరి 15 న హైదరాబాదు లోని బంజారా హిల్స్ లోని బంజారా భవనంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతికి రాష్ట్ర మత్స్య పాడి పరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు.
సౌకర్యాలు
[మార్చు]తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖ హైదరాబాదు వారి అధ్వర్యంలో ఉంది. ఇచట బంజారా సమాజికానికి సంబంధించిన వారి సంస్కృతి సంప్రదాయాలు ,జీవన విధానం తెలిపే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు.
బంజారా కమ్యూనిటీ కి సంబందించిన సమావేశాలు నిర్వహించడం జరుగును. భవనంలో వెయ్యి మంది కూర్చునేలా ఆడిటోరియం, రెండు వందల యాబై మందికి సరిపోయే డైనింగ్ రూములు, వీఐపీ ల కోసం లాడ్జీలు మొదలగు సౌకర్యాలతో అందుబాటులో ఉంది.
భవనంలో బంజారా లంబాడీ లకు సంబందించిన పురాతన వస్తువులు వేషధారణ ఛాయా చిత్రాలు, కళాకృతులు,పెయింటింగ్స్ మొదలగునవి ఏర్పాటు చేశారు.
మూలాలు
[మార్చు]- ↑ Correspondent, Special (2022-09-17). "Telangana CM inaugurates Adivasi, Banjara Bhavans". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-03-10.
- ↑ "banjara bhavan - Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on banjara bhavan". Sakshi. Archived from the original on 2024-03-10. Retrieved 2024-03-10.
- ↑ "Santh Sevalal Maharaj Jayanthi Celebrations at Banjara Bhavan – Chief Minister". cm.telangana.gov.in. Retrieved 2024-03-10.
- ↑ "Santh Sevalal Maharaj Jayanthi Celebrations at Banjara Bhavan – Chief Minister". cm.telangana.gov.in. Retrieved 2024-03-10.