Jump to content

పాలియెస్టర్

వికీపీడియా నుండి
పాలియెస్టర్ లను నిర్వచించే ఎస్టర్ గ్రూప్ (నీలం)

పాలియెస్టర్ పాలిమర్లలో ప్రధాన శృంఖలంలో రిపీట్ అయ్యే ప్రతి యూనిట్ లో ఎస్టర్ ఫంక్షనల్ కలిగిన ఒక వర్గం.[1] ఒక ప్రత్యేక పదార్థంగా అయితే ఇది పాలీఎథిలీన్ టెరిఫ్తలేట్ (PET) అనే పదార్థాన్ని సూచిస్తుంది. ప్రకృతిలో మొక్కలు, కీటకాలు, కృత్రిమంగా తయారయ్యే పాలీబ్యుటిరేట్ లలోని రసాయనాలు పాలియెస్టర్ల కిందికి వస్తాయి. సహజ పాలియెస్టర్లు, కొన్ని కృత్రిమమైనవి జీవవిచ్చిన్నమైనవి (biodegradable). చాలా వరకు కృత్రిమ పాలియెస్టర్లు సహజ విచ్ఛిన్నం కావు. కృత్రిమ పాలియెస్టర్లను ఎక్కువగా వస్త్రాల తయారీలో ఉపయోగిస్తారు.

పాలియెస్టర్ దారాలను సహజ దారాలతో కలిపి అల్లి, రెండు గుణాలను కలిగిన మిశ్రమ వస్త్రాన్ని తయారు చేస్తారు. పత్తి - పాలియెస్టర్ కలగలిసిన వస్త్రాలు గట్టిగానూ, ముడతలు, చీలికలు రాకుండా ఉంటాయి. పాలిస్టర్‌ను ఉపయోగించే కృత్రిమ దారాలు మొక్కల నుంచి ఉత్పన్నమయ్యే పీచులతో పోలిస్తే నీరు, గాలి, ఇంకా పర్యావరణం పట్ల అధిక నిరోధకతను కలిగి ఉంటాయి. అగ్నిని ఎక్కువగా తట్టుకోలేవు, మండించినప్పుడు సులభంగా కరిగిపోతాయి.[2]

పాలిస్టర్‌లు (ముఖ్యంగా PET) అత్యంత ఆర్థికంగా ముఖ్యమైన పాలిమర్లు. ఇదిఎక్కువ స్థాయిలో, తక్కువ ఖర్చుతో సులభంగా ఉత్పత్తి అయ్యే రోజువారీ అవసరంగా (Commodity) పరిగణించబడుతుంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 30.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది.

చరిత్ర

[మార్చు]

1926లో అమెరికాలోని డ్యూపాంట్ సంస్థ పెద్ద అణువులు మరియు కృత్రిమ నారలపై పరిశోధన ప్రారంభించింది. వాలెస్ కరోథర్స్ నేతృత్వంలోని ఈ ప్రారంభ పరిశోధన, మొదటి కృత్రిమ నారలలో ఒకటైన నైలాన్‌ ఆవిష్కరణకు కారణమైంది.[3] ఆ సమయంలో కారోథర్స్ డ్యూపాంట్‌లో పనిచేస్తున్నాడు. కారోథర్స్ పరిశోధన అసంపూర్తిగా ఆగిపోయింది. ఇథిలీన్ గ్లైకాల్, టెరెఫ్తాలిక్ ఆమ్లం కలపడం వల్ల ఏర్పడిన పాలిస్టర్‌ను పరిశోధించే స్థాయికి చేరుకోలేదు. 1928లో ఇంటర్నేషనల్ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ బ్రిటన్‌లో పాలిస్టర్ పేటెంట్ పొందింది.[4] 1941లో పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (PET) లేదా PETEపై పేటెంట్ పొందిన బ్రిటిష్ శాస్త్రవేత్తలు విన్‌ఫీల్డ్, డిక్సన్‌లచే కారోథర్స్ పరిశోధనను కొనసాగించారు. డాక్రాన్, టెరిలీన్, పాలిస్టర్ వంటి కృత్రిమ నారలకు పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ ఆధారం. 1946లో, డ్యుపాంట్ ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ (ICI) నుండి అన్ని చట్టపరమైన హక్కులను కొనుగోలు చేసింది.

మూలాలు

[మార్చు]
  1. Köpnick H, Schmidt M, Brügging W, Rüter J, Kaminsky W (June 2000). "Polyesters". Ullmann's Encyclopedia of Industrial Chemistry. Weinheim, Germany: Wiley-VCH Verlag GmbH & Co. KGaA.
  2. Mendelson C (17 May 2005). Home Comforts: The Art and Science of Keeping House. Simon and Schuster. ISBN 9780743272865.
  3. "How polyester is made - material, manufacture, making, history, used, structure, steps, product, History". www.madehow.com. Retrieved 2018-12-04.
  4. Loasby G (1951). "The Development of the Synthetic Fibres". Journal of the Textile Institute Proceedings. 42 (8): P411–P441. doi:10.1080/19447015108663852.