Jump to content

పోహ్రాదేవి తీర్థ క్షేత్రం

అక్షాంశ రేఖాంశాలు: 20°19′43″N 77°54′47″E / 20.32861°N 77.91306°E / 20.32861; 77.91306
వికీపీడియా నుండి
పోహ్రాదేవి దేవాలయం వాషిమ్
బంజారా కాశీ గా ప్రసిద్ధి
బంజారా కాశీ గా ప్రసిద్ధి
పోహ్రాదేవి దేవాలయం వాషిమ్ is located in Maharashtra
పోహ్రాదేవి దేవాలయం వాషిమ్
పోహ్రాదేవి దేవాలయం వాషిమ్
మహారాష్ట్ర రాష్ట్రంలొ ఉనికి
భౌగోళికాంశాలు :20°19′43″N 77°54′47″E / 20.32861°N 77.91306°E / 20.32861; 77.91306
పేరు
ఇతర పేర్లు:బంజారా కాశీగా ప్రసిద్ధి
ప్రధాన పేరు :పోహ్రాదేవి దేవాలయం
దేవనాగరి :पोहरादेवी
సంస్కృతం:పోహ్రాదేవి
మరాఠీ:पोहरादेवी
ప్రదేశం
దేశం: భారతదేశం
రాష్ట్రం:మహారాష్ట్ర
జిల్లా:వాషిమ్ మనోరా తాలుకా
స్థానికం:పోహ్రాదేవి / పౌరాగడ్
ఆలయ వివరాలు
ముఖ్య_ఉత్సవాలు:శ్రీ రామనవమి పోహ్రాదేవి జాతర
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షిణ భారత
కట్టడాల సంఖ్య:పది
ఇతిహాసం
నిర్మాణ తేదీ:18 వ. శతాబ్ధము

పోహ్రాదేవి (हिन्दी: पोहरा देवी, Pohra Devi) బంజారా సమాజ తీర్థ క్షేత్రం. బంజారా కాశీ గా ప్రసిద్ధి.[1]ఇది మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా, మనోరా తాలుకాలోని ఉంది. ఇచ్చట బంజారా సమాజ ప్రజల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామారావు మహారాజ్ సమాధి, జగదాంబ మాతా పురాతన ఆలయం ఉంది.[2][3][4][5]

జాతర ప్రారంభం

[మార్చు]

పోహ్రాదేవి జాతర ప్రతి సంవత్సరము చైత్ర మాసంలో శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీ రామనవమి సందర్భంగా జాతర నిర్వహిస్తారు. జాతర వారం రోజులు పాటు ఉంటుంది.ఈ జాతర దేశంలోనే గొప్ప జాతరలలో ఒకటి. ఇచట మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,కర్నాటక, తమిళనాడు ,గోవా, ఛత్తీస్ గడ్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా,పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఒరిస్సా, ఉత్తరాఖండ్ మొదలగు రాష్ట్రల నుండి కాక మన పొరుగు దేశం పాకిస్తాన్ నుండి కూడా బంజారా సమాజానికి చెందిన కోట్ల మంది భక్తులు, ఇతర సమాజపు భక్తులు హాజరై సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, అమ్మ జగదాంబ దేవి, నిర్గుణ నిరంకారి బాల బ్రహ్మచారి సంత్ రామారావు మహారాజ్ దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకుంటారు‌.

ప్రత్యేకతలు

[మార్చు]

బంజారా సమాజ ప్రజలు తమ జీవితంలో కనీసం ఒక్క సారియైన తప్పకుండా ఈ జాతరను సందర్శించుకుంటారు.వీరితో పాటు కుల మత భేద భావం లేకుండా ఇతర సమాజ ప్రజలు కూడా దర్శించు కుంటారు.ఇచట తమ కుల దైవాలు సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబదేవి, సంత్ రామారావు మహారాజ్ ఆలయాలను దర్శనం చేసుకొని మొక్క తీర్చుకుంటారు. సంతానం లేని వారు, అనేక సమస్యలతో బాధ పడేవారు, సేవాలాల్ దీక్ష తీసుకున్నవారు,ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకులు మనసులో మొక్కుకున్న కోర్కెలు తీరాలని మొక్కుకుంటారు. ఆ కోర్కెలు సఫలం అయిన తర్వాత ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కులు అక్కడికే వెళ్ళి తీర్చుకుంటారు.ఆనంతరం ఉచిత అన్నదాన వసతి గృహాలలో నిత్యం జరిగే అన్నదాన కార్యక్రమాల్లో పాల్గోంటారు. దేవుని దర్శనంతరం తమ సంస్కృతి సాంప్రదాయాలకు సంబందించిన అనేక అభరణాలు, వస్త్రాలు,భజన సామాగ్రిలు వస్తువులను జాతర లో కోనుకుంటారు.

ఆలయ అభివృద్ధి

[మార్చు]

పోహ్రాదేవి ఆలయ ప్రాంత అభివృద్ధికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం రూ.593 కోట్లు మంజూరు చేసి ఆలయ ప్రాంత అభివృద్ధి శిలాఫలకానికి భూమి పూజ చేశారు.[6] ప్రభుత్వం నుండి ఆలయానికి ఒకటి నర్ర ఎకరాల భూమిని కేటాయించారు.నగారా (నంగారా) ఆకారంలో నంగారా భవన్ దివ్య, భవ్య మందిరం నిర్మాణం అందులో,మహారాజ్ విగ్రహం, జెండా నిర్మించారు. మ్యూజీయం పనులు, ప్రహారీ గోడ పనులు అందమైన రాజస్థాన్ గులాబి శిలాఫలకాలు ఉపయోగించి పనులు చక చక కొనసాగుతున్నాయి.ఉమ్రిలో సామ్కీమాత, జేతాలాల్ మహారాజ్ మందిర పునర్నిర్మాణం జరుగుతుంది.[7]

విగ్రహ ఆవిష్కరణ

[మార్చు]

పోహ్రాదేవిలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ గుర్రం పై స్వారి చేస్తూ కుడి చేతితో ఆశీర్వాదం ఇస్తూ మనకు కన్పించే నూతనంగా బ్రాస్ ధాతుతో తయారు చేసిన ఈ విగ్రహాన్ని నంగారా భవన్ లో తేది:12 ఫిబ్రవరి 2023 లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్,ఆహారం, ఔషధ నిర్వహణ మంత్రి సంజయ్ భావు రాథోడ్ తో కలసి ముఖ్యమంత్రి ఏక్నాథ షిండే మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని మహారాష్ట్రలోని ఎవత్మాల్ జిల్లాకు చెందిన ప్రముఖ శిల్పకారుడు రాము చౌహాణ్ తయారు చేశారు.11 ఫీట్లు ఎత్తులో 11 ఫీట్లు వెడల్పు ఉన్న ఈ విగ్రహం దాదాపు 15 క్వీంటళ్ళు బరువు ఉంది. ఇందులో 60 శాతం కాపర్ మెటల్, 30 శాతం జింక్,10 శాతం ఇతర లోహాలు, అల్యూమినియం ఉపయోగించి అపురూపంగా తిర్చిదిద్దారు. ఇచటనే 134 అడుగుల స్వేత వర్ణం జెండా (ధోళో జండా)ను కూడా ఆవిష్కరించారు.

స్థానం

[మార్చు]

పోహ్రాదేవి దేవాలయం విదర్భ ప్రాంతంలోని వాషిమ్ జిల్లాల్లో ఉన్న తీర్థ క్షేత్రం, ప్రముఖ పర్యాటక ప్రదేశము. ఇది కరంజా రైల్వే స్టేషన్ కు 35 కి.మీ దగ్గరలో, అమరావతి రైల్వే స్టేషన్ కు 87 కి.మీ దూరంలో ఉంది. అకోలా విమానాశ్రయానికి 80 కి.మీ దూరంలో ఉంది.డిగ్రేష్ పట్టణానికి సమీపంలో ఉంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. author/lokmat-news-network (2018-11-19). "पोहरादेवी तिर्थस्थळाचा होतोय कायापालट". Lokmat (in మరాఠీ). Retrieved 2024-05-07. {{cite web}}: |last= has generic name (help)
  2. Marathi, TV9 (2021-08-27). "Special Story | 81 टक्के साक्षर लोक, बंजारा समाजाची काशी पोहरादेवी मंदिर, जाणून घ्या वाशिम जिल्ह्याची संपूर्ण माहिती". TV9 Marathi (in మరాఠీ). Retrieved 2024-05-07.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Pohradevi Yatra | पोहरादेवी यात्रा की पूर्व तैयारी हेतु जिलाधिकारी की समीक्षा बैठक | Navabharat (नवभारत)". www.enavabharat.com. Retrieved 2024-05-07.
  4. "पोहरादेवी मंदिर | District Washim | India" (in మరాఠీ). Retrieved 2024-05-07.
  5. "No Ram Navami at Pohradevi in Washim this year". The Times of India. ISSN 0971-8257. Retrieved 2024-05-07.
  6. "Maha CM announces Rs 593 cr for Poharadevi temple area development". The Week (in ఇంగ్లీష్). Retrieved 2024-05-08.
  7. Singh, Tejinder (2023-06-26). "वाशिम के पोहरादेवी तीर्थक्षेत्र का काम मार्च 2024 तक पूरा करें- मुख्यमंत्री". www.bhaskarhindi.com (in హిందీ). Retrieved 2024-05-08.