వాషిమ్
వాశిమ్ వత్సగుల్మ |
|
---|---|
— పట్టణం — | |
దేశం | India |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | వాశిమ్ |
Founder | సర్వసేన |
Area rank | మహారాష్ట్రలో 42 వ స్థానం |
జనాభా (2011)[1] | |
- మొత్తం | 1,07,979 |
భాషలు | |
- అధికారిక | మరాఠీ |
Time zone | IST (UTC+5:30) |
Vehicle registration | MH-37 |
వాశిమ్ మహారాష్ట్ర, వాశిమ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.
వ్యుత్పత్తి
[మార్చు]వాశిమ్‌ను పూర్వం వత్సగుల్మ అని పిలిచేవారు. ఇది వాకాటక రాజ్యానికి రాజధానిగా ఉండేది. మొదటి ప్రవరసేనుడి రెండవ కుమారుడు సర్వసేన వత్సగుల్మ స్థాపకుడు. అతని నాల్గవ తరం, హరిసేన అజంతా గుహల పోషకుడు. ఈ అజంతా గుహలు నేడు ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటి. వాకాటకుల చివరి తరాల రాజులు బౌద్ధమతాన్ని పోషించారు.
మధ్యయుగ చరిత్ర
[మార్చు]18వ శతాబ్దపు మధ్యకాలంలో, బాలాపూర్‌తో పాటు వాశిమ్ వస్త్ర ఉత్పత్తికి ప్రసిద్ధ కేంద్రంగా ఉండేది. 1769లో ఇద్దరి మధ్య జానోజీ భోంస్లే, పీష్వా మాధవరావు I మధ్య జరిగిన యుద్ధం తరువాత కుదిరిన కనక్‌పూర్ సంధి ద్వారా ఇది స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం, భోంస్లేలు ఏటా వాషిం, బాలాపూర్ లలో తయారైన రూ. 5,000 విలువైన వస్త్రాన్ని పీష్గ్వాకు పంపించాలి. వాశిమ్‌లో మింట్ కూడా ఉండేది. ఈ పట్టణాన్ని 1809లో బెరార్ ప్రాంతంలోని కొన్ని ఇతర ప్రాంతాలతో పాటు పిండారీలు దోచుకున్నారు.
1768-69లో, పీష్వా భోంస్లేపై దాడి చేసినప్పుడు, అతని సైన్యం ఔరంగాబాద్ నుండి కనుమ ద్వారా వాశిమ్‌కు వచ్చింది. తరువాత, పీష్వా మాధవరావు, జానోజీ భోంస్లే వాశిమ్‌లో సమావేశమై, అక్కడ ఒప్పందపు నిబంధనలను ఖరారు చేసిఉకున్నారు. కనక్‌పూర్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. వాశిమ్‌లోని బాలాజీ ఆలయాన్ని, సబాజీ భోంస్లే వద్ద దివాన్‌గా ఉన్న భవానీ కాలూ నిర్మించాడు.
జనాభా వివరాలు
[మార్చు]2011 జనగణన ప్రకారం, వాశిమ్ జనాభా 78,387. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత 70%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషులలో అక్షరాస్యత 76% కాగా, స్త్రీలలో ఇది 62%. వాశిమ్ జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.
రవాణా
[మార్చు]రోడ్డు
[మార్చు]వాషిం నుండి మహారాష్ట్రలోని అన్ని ముఖ్యమైన నగరాలకు రాష్ట్ర రహదారుల సౌకర్యం ఉంది. వాషిం- మంగ్రుల్ పీర్ - కరంజా-నేర్- యావత్మాల్, వాషిం- కరంజా - అమరావతి - నాగ్‌పూర్, వాషిం-మాలేగావ్- అకోలా, వాషిం- రిసోడ్ - లోనార్ -సింధ్‌ఖేడ్ రాజా- జల్నా - ఔరంగాబాద్ - అహ్మద్‌నగర్ - పూణేర్- ముంబై కె.యన్. నాకా- హింగోలి - నాందేడ్, వాశిమ్- అన్సింగ్ - పుసాద్ లు పట్టణం గుండా వెళ్ళే ముఖ్యమైన రోడ్లు.
రైలుమార్గం
[మార్చు]వాషిం దక్షిణ మధ్య రైల్వే (SCR)లోని పూర్ణ - ఖాండ్వా సెక్షన్‌లో ఉన్న రైల్వే స్టేషన్. ఇది దక్షిణ మధ్య రైల్వేకు చెందిన హైదరాబాద్ డివిజన్‌లో ఉండేది. హైదరాబాద్ డివిజన్ విభజన తర్వాత ఇది నాందేడ్ డివిజన్‌లో చేరింది. 2008లో పూర్ణా నుండి అకోలా వరకు ట్రాక్‌లను విస్తరించినప్పుడు వాశిమ్ బ్రాడ్ గేజ్ రైల్వే నెట్‌వర్కులో భాగమైంది.
మూలాలు
[మార్చు]- ↑ "Census of India: Search Details". Archived from the original on 24 September 2015.