Jump to content

బ్రెడ్, సేవా సంస్థ

వికీపీడియా నుండి

బ్రెడ్, సేవా సంస్థ (సొసైటీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తుంది. పాఠశాల గ్రంథాలయాలలో పిల్లల వయస్సుకు తగినట్టుగా నైతిక విలువలు, చరిత్ర, జీవిత చరిత్రలు, ఇతిహాసాలు, సంస్కృతి, సైన్స్, భౌగోళికం, గణితం, సాధారణ విజ్ఞానం , వ్యక్తిత్వ వికాసం, పజిల్స్, క్రీడలు మొదలైన విషయాలలో రంగురంగుల బొమ్మలతో ఉన్న పుస్తకాలు ఏర్పాటు చేసారు. కొత్త పుస్తకాలు కూడా చేరుస్తుంటారు. ఈ పుస్తకాలను పిల్లలు ఇంటికి తీసుకెళ్లవచ్చు.

బ్రెడ్ పిల్లల గ్రంథాలయాలు పాఠశాల విద్యను పునరుజ్జీవింపజేయడానికి, విజ్ఞాన ఆధారిత సమాజాన్ని రూపొందించడానికి జరిగిన పరిశోధనల ఫలితముగా రూపొందించిన కార్యక్రమం. వేలాది మంది విద్యార్థులకు నిత్యం సేవలు అందిస్తోంది. పిల్లలకు అనేక రకాల అంశాలకు సంబంధించిన పుస్తకాలను ఎక్కువగా చదవడం వల్ల వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, చిన్న వయస్సులోనే మంచి పఠన అలవాట్లు అలవడతాయి. అక్షరాస్యులైన తల్లిదండ్రులు, తోబుట్టువులు కూడా ఇంటి వద్ద పుస్తకాలు చదవగలరు. ఈ సంస్థ 1810 పాఠశాలలో పిల్లల గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది. ప్రతి పాఠశాలకు 600 నుంచి 650 పుస్తకాలూ ఇస్తున్నారు. 14 లక్షలమంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు.[1] టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS), హైదరాబాద్, విప్రో అప్లైయింగ్ థాట్ ఇన్ స్కూల్స్ సౌజన్యంతో చేసిన క్షేత్ర పరిశోధన అధ్యయనంలో అనుకూల నివేదిక ఇచ్చింది.[2]

పుస్తకాలు చదివి రివ్యూలు ఎక్కువగా రాసిన వారికి బహుమతులు ఇస్తారు. పుస్తకాలు చదివితే మెదడుకి వ్యాయామం జరుగుతుందని భవిష్యత్తులో మతిమరుపు వంటి వ్యాధులు రావు. ఉపాధ్యాయులు లేనప్పుడు చదివిన పుస్తకంలోని కధాంశం చెప్పాలని ఎపి గ్రంథాలయ సంఘ కార్యదర్శి రావి శారద సూచించింది. వేసవి సెలవులలో కూడా విద్యార్థులు వచ్చి పుస్తకాలు చదవవచ్చని, చదువుకు పేదరికం అడ్డురాకూడదని ఈ పుస్తకాలు ఏర్పాటు చేశామని, విద్యార్థులు వినియోగించుకోవాలని యార్లగడ్డ సుబ్బారావు చెప్పాడు. [3]

  1. "BREAD Children's Library program". BREAD Society. Retrieved 9 March 2024.
  2. Hyderabad, Tata Institute of Social Sciences (2017). "A report on BREAD Children's Library" (PDF). BREAD Society. Retrieved 9 March 2024.
  3. "పుస్తక పఠనం తో మస్తక వికాసం". ఆంధ్ర జ్యోతి ABN. 30 October 2019.