ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ
Established | 7 జనవరి 1935 |
---|---|
వ్యవస్థాపకులు | లూయిస్ లీ ఫెర్మోర్ |
కార్యస్థానం | |
భౌగోళికాంశాలు | 28°37′43.8″N 77°14′26.7″E / 28.628833°N 77.240750°E |
అధ్యక్షుడు | అశుతోష్ శర్మ |
భారత జాతీయ సైన్సు అకాడమీ (ఆంగ్లం: Indian National Science Academy) అనేది సైన్స్, టెక్నాలజీరంగాలకు చెందిన అన్ని శాఖలలోని భారతీయ శాస్త్రవేత్తల కోసం న్యూఢిల్లీలో ఏర్పాటయిన ఒక జాతీయ అకాడమీ.[1]
2015లో ఐఎన్ఎస్ఎ దేశంలోని యువ శాస్త్రవేత్తల కోసం ఇతర జాతీయ యువ అకాడమీలకు అనుగుణంగా ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (INYAS) పేరుతో ఒక జూనియర్ వింగ్‌ను ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలోని యువ శాస్త్రవేత్తల జాతీయ యువ అకాడమీ, కాగా గ్లోబల్ యంగ్ అకాడమీకి అనుబంధంగా పనిచేస్తుంది. 2019 నవంబరు 20న వరల్డ్ సైన్స్ ఫోరమ్, బుడాపెస్ట్‌లో ఆమోదించబడిన యంగ్ అకాడమీల డిక్లరేషన్‌పై కూడా ఇది సంతకం చేసింది.[2] దీనికి ప్రస్తుత అధ్యక్షుడు ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, కాగా పదవీకాలం 2023 నుంచి 2025 వరకు ఉంటుంది.
అవలోకనం
[మార్చు]అకాడమీలో ఫౌండేషన్ సభ్యులు, విదేశీ సభ్యులు ఉంటారు. నామినేషన్ ద్వారా మాత్రమే అకాడమీకి ఎన్నిక జరుగుతుంది.[3] అకాడమీ లక్ష్యాలు భారతదేశంలో సైన్స్‌ని ప్రోత్సహించడం, జాతీయ సంక్షేమానికి దాని అప్లికేషన్, శాస్త్రవేత్తల ప్రయోజనాలను కాపాడడం, సహకారాన్ని పెంపొందించడానికి అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలను ఏర్పరచడంతో పాటు జాతీయ సమస్యలపై అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం.
శాస్త్రీయ పరిశోధనలో శ్రేష్ఠతను ప్రోత్సహించడంలో దీని పాత్ర ఎనలేనిది. 'సైన్స్ అండ్ టెక్నాలజీ' రంగంలో శ్రేష్ఠతను ప్రోత్సహించే ఉద్దేశంతో, అకాడమీ 59 అవార్డులను ఏర్పాటు చేసింది, వీటిని 4 విభాగాలలో ఇస్తానరు, అవి అంతర్జాతీయ అవార్డులు, జనరల్ మెడల్ అండ్ లెక్చర్ అవార్డులు, సబ్జెక్ట్‌వైజ్ మెడల్స్/లెక్చర్లు, యువ శాస్త్రవేత్తలకు అవార్డులు.
ఐఎన్ఎస్ఎ పత్రికలను ప్రచురిస్తుంది, శాస్త్రీయ చర్చలను నిర్వహిస్తుంది. ఇది 2004లో సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్‌లో నాలెడ్జ్‌కు ఓపెన్ యాక్సెస్‌పై బెర్లిన్ డిక్లరేషన్‌పై సంతకం చేసింది.
క్రమ సంఖ్య | అధ్యక్షుడు | పదవీ కాలం | |
1 | లూయిస్ లీ ఫెర్మోర్ | 1935 | 1936 |
2 | మేఘనాద్ సాహా | 1937 | 1938 |
3 | రామ్ నాథ్ చోప్రా | 1939 | 1940 |
4 | బైని ప్రసాద్ | 1941 | 1942 |
5 | జ్ఞాన చంద్ర ఘోష్ | 1943 | 1944 |
6 | దరాషా నోషెర్వాన్ వాడియా | 1945 | 1946 |
7 | శాంతి స్వరూప్ భట్నాగర్ | 1947 | 1948 |
8 | సత్యేంద్ర నాథ్ బోస్ | 1949 | 1950 |
9 | సుందర్ లాల్ హోరా | 1951 | 1952 |
10 | కరియమాణికం శ్రీనివాస కృష్ణన్ | 1953 | 1954 |
11 | అమూల్య చంద్ర ఉకిల్ | 1955 | 1956 |
12 | ప్రశాంత చంద్ర మహాలనోబిస్ | 1957 | 1958 |
13 | సిసిర్ కుమార్ మిత్ర | 1959 | 1960 |
14 | అజుధియా నాథ్ ఖోస్లా | 1961 | 1962 |
15 | హోమీ జహంగీర్ భాభా | 1963 | 1964 |
16 | వసంత్ రామ్‌జీ ఖనోల్కర్ | 1965 | 1966 |
17 | తిరువేంగడం రాజేంద్రం శేషాద్రి | 1967 | 1968 |
18 | ఆత్మ రామ్ | 1969 | 1970 |
19 | బాగేపల్లి రామచంద్రాచార్ శేషాచార్ | 1971 | 1972 |
20 | దౌలత్ సింగ్ కొఠారీ | 1973 | 1974 |
21 | బెంజమిన్ పియరీ పాల్ | 1975 | 1976 |
22 | రాజా రామన్న | 1977 | 1978 |
23 | వులిమిరి రామలింగస్వామి | 1979 | 1980 |
24 | మంబిల్లికలత్తిల్ గోవింద్ కుమార్ మీనన్ | 1981 | 1982 |
25 | అరుణ్ కుమార్ శర్మ | 1983 | 1984 |
26 | చింతామణి నాగేశ రామచంద్రరావు | 1985 | 1986 |
27 | ఔటర్ సింగ్ పెంటల్ | 1987 | 1988 |
28 | మన్ మోహన్ శర్మ | 1989 | 1990 |
29 | ప్రకాష్ నారాయణ్ టాండన్ | 1991 | 1992 |
30 | శ్రీ కృష్ణ జోషి | 1993 | 1995 |
31 | శ్రీనివాసన్ వరదరాజన్ | 1996 | 1998 |
32 | గోవర్ధన్ మెహతా | 1999 | 2001 |
33 | మార్తాండ వర్మ శంకరన్ వలియాథన్ | 2002 | 2004 |
34 | రఘునాథ్ అనంత్ మషేల్కర్ | 2005 | 2007 |
35 | మామన్నమన విజయన్ | 2008 | 2010 |
36 | క్రిషన్ లాల్ | 2011 | 2013 |
37 | రాఘవేంద్ర గడగ్కర్ | 2014 | 2016 |
38 | అజయ్ కె. సూద్ | 2017 | 2019 |
39 | చంద్రిమా షాహా | 2020 | 2022 |
40 | అశుతోష్ శర్మ | 2023 | 2025 |
మూలాలు
[మార్చు]- ↑ "Indian National Science Academy, New Delhi". Department of Science and Technology, India. 2016. Retrieved 17 October 2016.
- ↑ "Launch of the Declaration on the Core Values of Young Academies". World Science Forum. World Science Forum. Archived from the original on 21 April 2021. Retrieved 24 February 2020.
- ↑ "About INSA". Indian National Science Academy. 2016. Archived from the original on 6 June 2017. Retrieved 17 October 2016.
- ↑ "Past Presidents". Indian National Science Academy. 2016. Archived from the original on 12 October 2016. Retrieved 17 October 2016.