Jump to content

గుర్రపు పందెం

వికీపీడియా నుండి
అడిలైడ్ లో ఒక గుర్రపు పందెం

గుర్రపు పందెం అనేది ఒక గుర్రపు స్వారీ ఆట. ఇందులో రెండు లేదా అంతకంటే ఎక్కువ గుర్రాలు రౌతులు స్వారీ చేస్తూ ఉండగా (కొన్ని సందర్భాల్లో రౌతు పైన కూర్చోకుండా కూడా) ఒక నిర్దేశిత దూరాన్ని చేరుకోవడంలో పోటీ పడతాయి. ఇది ప్రపంచంలోని అతి పురాతనమైన క్రీడల్లో ఒకటి. ఈ పోటీ ప్రధాన లక్ష్యం రెండు లేదా అంతకంటే ఎక్కువ గుర్రాల్లో నిర్దేశిత లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో చేరుకునే వాటిని గుర్తించడం. ఇది చాలాకాలంగా వస్తున్న సాంప్రదాయం.

గుర్రపు పందేలు వివిధ రకాలుగా జరుగుతున్నాయి. చాలా దేశాలు వారికి తగినట్లుగా ఈ క్రీడను అభివృద్ధి చేశారు. కేవలం కొన్ని జాతి గుర్రాలను మాత్రమే పోటీకి పరిమితం చేయడం, గుర్రాలను దారికి అడ్డంగా ఉన్న వాటిమీద దూకించడం, వివిధ రకాల దూరాలు పరిగెత్తించడం, రక రకాల దారుల్లో పరిగెత్తించడం మొదలైనవి పోటీల్లో రకాలు. గుర్రాలు కొన్నిసార్లు పూర్తిగా క్రీడల కోసమే పరిగెత్తినా, గుర్రపు పందేలతో ముడిపడిన జూదం వల్ల దాని పట్ల ఆసక్తి, ఆర్థిక ప్రాముఖ్యత ఎక్కువ.[1] ఈ కార్యకలాపాలు 2019లో ప్రపంచవ్యాప్తంగా US$115 బిలియన్ల విలువైన మార్కెట్‌ను సృష్టించింది.[2]

చరిత్ర

[మార్చు]

గుర్రపు పందేలు సుదీర్ఘమైన, విశిష్టమైన చరిత్రను కలిగి ఉన్నాయి. పురాతన కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాగరికతలలో వీటిని నిర్వహించేవారు. పురాతన గ్రీస్, ప్రాచీన రోమ్, బాబిలోన్, సిరియా, అరేబియా, ఈజిప్టులలో గుర్రపు పందెం జరిగినట్లు పురావస్తు రికార్డులు సూచిస్తున్నాయి.[3] పురాతన గ్రీస్, రోమ్, బైజాంటైన్ సామ్రాజ్యలలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో రథ పందెం ఒకటి. సా.శ.పూ 648 నాటికి, రథం, గుర్రంపై స్వారీ చేసే పోటీలు రెండూ పురాతన గ్రీకు ఒలింపిక్స్‌లో భాగంగా ఉన్నాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. Campbell, National Gambling Impact Study Commission Final Report, p. 111
  2. "Annual Report 2019" (PDF). International Federation of Horseracing Authorities. 2019. Archived (PDF) from the original on 2022-02-09. Retrieved 2022-05-11.
  3. prashanth. "Earliest record of horse racing". Libraryindex.com. Archived from the original on 2013-10-04. Retrieved 2013-10-01.
  4. "Ancient Greek Olympic Horse Racing". Hellenism.com. Archived from the original on 2016-04-25. Retrieved 2013-10-01.

ఆధార గ్రంథాలు

[మార్చు]