దీక్షభూమి కొత్తపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తపల్లి దీక్ష భూమి
సంత్ సేవాలాల్ దీక్ష భూమి కొత్తపల్లి హెచ్
సంత్ సేవాలాల్ దీక్ష భూమి కొత్తపల్లి హెచ్
పేరు
ఇతర పేర్లు:సేవాలాల్ కొత్తపల్లి దీక్ష భూమి
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్
ప్రదేశం:నార్నూర్, కొత్తపల్లి హెచ్.
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:1.జగదాంబ దేవి,

2.సంత్ రామారావ్ మహారాజ్,

3.దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్
ముఖ్య_ఉత్సవాలు:గురుమిలన్ దివస్ (గురుకృప దినోత్సవం)
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూమతము, బంజారా సమాజం

సేవాలాల్ దీక్షభూమి తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండలం లోని కొత్తపల్లి హెచ్ గ్రామంలో ఉంది.[1] ఇది తెలంగాణ రాష్ట్రం లోని బంజారా , లంబాడీ గిరిజనుల ముఖ్య పుణ్య క్షేత్రాలలో ఒకటి.

చరిత్ర[మార్చు]

దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం లో  ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండలంలోని దీక్ష భూమి కొత్తపల్లి (హెచ్) బంజారాల అత్యంత ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటి [2]. దీక్షభూమి పీఠాధిపతి అయిన సంత్ దీక్షగురు శ్రీ ప్రేమ్ సింగ్ మహారాజ్ జగత్ జనని జగదాంబ దేవి భక్తుడు.ఇతని గురువు నిర్గుణ నిరంకారి బాల బ్రహ్మచారి, రాజయోగి, రాష్ట్రీయ సంత్, మహాన్ తపస్వి , రామారావు మహారాజ్ 1978లో ప్రేమ్ సింగ్ మహారాజ్ శంకర్ లొద్ది అనే స్థలంలో దీక్షకు పూనుకున్నారు 1979లో ఒక అద్భుతమైన ఘటన జరగడం విశేషం. ప్రేమ్ సింగ్ మహారాజ్ శంకర్ లొద్ది అనే పవిత్రమైన స్థలంలో సంవత్సరం కాలం పాటు భగవాన్ శంకరుని అనుగ్రహముతో తపస్సు చేసాడు. శంకర్ లొద్దిలో శివపురాణం ఆధారంతో భక్తి మార్గంలో నిమగ్నమైన మహారాజ్, గురువు సంత్ రామారావు జగదాంబ దేవి పేరుతో ధూపదీపం పెట్టి అన్నపానీయాలు విడిచి రావి చెట్టు నీడలో దట్టమైన అరణ్యంలో నది ఒడ్డున సంవత్సరం కాలం పాటు ఆధ్యాత్మికంగా  తపస్సు చేసి దైవ సౌక్షాత్కారాన్ని పొందారు. మాత జగదాంబ దేవి రాజగురువు శ్రీ రామారావు మహారాజ్ కలలో ప్రత్యక్షమై ప్రేమ్ సింగ్ మహారాజ్ చేస్తున్న తపస్సు గురించి చెప్పడంతో 1979జనవరి 11న పౌరాఘడ్ పీఠాధిపతి అయిన సంత్ రామారావు మహారాష్ట్ర లోని వాసీం జిల్లా పౌరాదేవి ఆలయం నుండి తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా, కెరమెరి మండలంలోని అనార్ పల్లి మీదుగా భక్తులతో శంకర్ లొద్ధికి చేరుకున్నారు. అచ్చట ప్రేంసింగ్ మహారాజ్ ని కలిసి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని తపస్సు నుండి నిష్ర్కమించాలని చెప్పడంతో ఆ అంతర్యామీ తపస్సు ద్వారా రామారావు ఆజ్ఞతో వరాలను పొందాడు. తపస్సు, ఆజ్ఞ వలన రామారావుకు దివ్యమైన తేజస్సు ఉత్పన్నమైందని భక్తులు అంటారు. అప్పటి నుండి జనవరి 11న ప్రతి సంవత్సరం గురుకృప దినోత్సవం (గురుమిలన్ దివస్) దీక్షభూమి కొత్తపల్లి (హెచ్) లో భక్తులు అంగరంగ వైభవంగా  జరుపుకుంటారు.[3]

భోగ్ భండార్ కార్యక్రమం[మార్చు]

గురు మిలన్ దివస్[4] రోజున మహాభోగ్ భండార్ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ సంత్ సేవాలాల్ దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ చేతుల మీదుగా జగదాంబ దేవి సంత్ రామారావు మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భోగ్ భండార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.[5] అనంతరం భక్తులను ఉద్దేశించి దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ప్రసంగించిన అనంతరం అతిథులు అధికారుల ప్రసంగాలు ఉంటాయి.

జాతర విశేషాలు[మార్చు]

వేలాది మంది భక్తజన సందోహం మధ్య అంగరంగా వైభవంగా ఐదు రోజులు పాటు దీక్షభూమి కొత్తపల్లి హెచ్ యందు జాతర నిర్వహిస్తారు.జాతర యందు ఆటల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. లంబాడీ భజన గాయకులచే బంజారా భక్తి భజన కార్యక్రమాలు,బంజారా కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జాతర యందు బంజారా సంస్కృతి [6] సాంప్రదాయాలకు సంబందించిన దుస్తులు అలంకరణ వస్తువులు లభించును.

భక్తుల తాకిడి[మార్చు]

ఈ గురుకృప దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని వివిధ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదలగు రాష్ట్రల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కు తీర్చుకొని మహారాజ్ ఆశీర్వాదం తీసుకుంటారు.

సేవాలాల్ దీక్షలు[మార్చు]

భక్తులు సేవాలాల్ దీక్షలు [7]41 రోజులు పాటు సేవాలాల్ దీక్షలో ఉంటారు. సేవాలాల్ దీక్ష గురు సంత్ ప్రేమ్ సింగ్ మహారాజ్ మొట్ట మొదటి సారిగా సేవాలాల్ దీక్షను దీక్షభూమి కొత్తపల్లి నుండి 1992‌లో ప్రారంభించారు. దీక్షభూమి కొత్తపల్లి నుండి పౌరాగడ్ కు "సేవాదళ్" పేరుతో సుమారు యాభైవేల పైగా భక్తులను కాలినడకన ప్రేమ్ సింగ్ మహారాజ్ పౌరాదేవికి తీసుకొని వెళ్ళటం గొప్ప విషయం.అప్పటి నుండి ప్రతి సంవత్సరం భక్తులు దీక్ష భూమిలో దీక్ష తీసుకొని పౌరాదేవి వెళ్తుతుంటారు. శ్రీరామనవమి వరకు ఎటు చూసినా సేవాలాల్ దీక్షలు వీనులవిందు చేసే జై సేవాలాల్ నామస్మరణలు చల్లటి నీటితో చన్నీటి స్నానం,నేలమీద శయనం, నిరాడంబర జీవనం,గులాబీ వస్త్రాలతో శాంతస్వరూపంతో సేవాలాల్ భక్తులు.బంజారాల కాశీ మహారాష్ట్ర లోని పౌరాఘడ్ లో కొలువైవున్న బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి, ఇతర దేశాల నుంచి గోర్ బంజారా భక్తులు తరలి వెళ్తారు.

దీక్ష నియమాలు[మార్చు]

సేవాలాల్ దీక్ష సమయంలో భక్తులు మాదకద్రవ్యాలు సేవించడం గాని అబద్ధాలు మాట్లాడడం గాని,అపకారాలు తలపెట్టే విధంగా కుట్రలు పన్నడం,దూషించడం, చెడు ఆలోచనలు పెట్టుకోవడం గాని ‌చేయరు.భక్తులు స్వయంగా తయారు చేసిన వంటకాలు మాత్రమే భుజిస్తారు. అంటు ముట్టు ఐనా పానియాలు సేవించరు.ఈ కార్యక్రమం మహాశివరాత్రిపర్వదినాన మొదలుకోని శ్రీరామనవమి వరకు కొనసాగుతుంది.భక్తులు పౌరదేవికి వేళ్ళి శ్రీ రామనవమి రోజున మాతకు భక్తులు కానుకలు సమర్పించి మొక్కు చెల్లించి సేవాలాల్ దీక్షలు విరమిస్తారు.ఈ విధంగా మహారాజ్ ప్రజలు జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం గమనార్హం.సేవాలాల్ భక్తులు స్త్రీ, పురుషులు 41రోజులు దీక్షలో ఉంటారు. దీక్ష ప్రారంభించెటప్పుడు తెల్లని ధోవతిలు, లుంగీలు,ప్యాంటులు తొడిగి గులాబీ రంగు చొక్కలు, కమీజులు ధరించి నియమ నిష్ఠలతో నలభై ఒక్క రోజులు కఠిన దీక్షకు పూనుకుంటారు. చన్నీటిస్నానం పాదరక్షలు వదిలేయడం,బ్రహ్మచర్యం లాంటి నియమాలతో ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది. తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయటంవలన మనోచైతన్యం కలుగుతుంది. మంచి మార్గానికి మళ్లించే జీవనం మొదలై ప్రశాంతత, ఏకాగ్రత కలుగుతాయి. చెడు వ్యసనాలకు దూరమై రెండు పూటలా స్నానం చేసి దుస్తులు మార్చడం ద్వారా పరిశుభ్రత అలవడుతుంది.సాముహికంగా పూజలు భక్తి శ్రద్ధలతో భజన,కీర్తనలు చేసి ఉదయం,సాయంత్రం హారతి పాడుతారు.

హారతి[మార్చు]

1).

సద్గురు హమారో పామణో రేవాళో !

అజెరో దాడో సోనే సరికో మళో !

కరతాణి వాసనా శుద్ద మనేరి !

ఒవాళు ఆరతి గురు ప్రేమ్ సింగేరి!!

2).

పాణి లాతాణీ టాంగే ధోరోచు !

శుద్ధ వస్ర్తేతి పద్మ లురోచు!

హమారే మాతేప పగ పడేద తారి !

ఒవాళు ఆరతి గురు ప్రేమ్ సింగేరి!!

3).

పూర్ణ భావేతి లగావు గంధ !

మన శాంతి రకాడే వాళో ఆనంద !

జనా గురు ఆత్మా శాంతి వియతారి !

ఒవాళు ఆరతి గురు ప్రేమ్! సింగేరి!!

4).

సత్యా భావేతి బలాయో ఘర !

బ్రహ్మ రూప కిదో కృపా గురు దేవేరి!

సంసారేమ ప్రకాశ్ పాడో సూర్యారి!

ఒవాళు ఆరతి గురు ప్రేమ్ సింగేరి !!

5).

బస్మ లగాయో గురు భక్తి  మార్గేమా !

దహే అర్పణ శ్రీ గురుర పగేమా!

సదా శాంతి రకాడ ప్రార్థన భక్తురి!

ఒవాళు ఆరతి గురు ప్రేమ్ సింగేరి!!

6).

ఘాలు గళహర శుబుద్ధీ ఫూలేర!

వజాళో పడో జసో సూర్యారో!

దేకు కేన లాగ మూర్తి గురు దేవేరి!

ఒవాళు ఆరతి గురు ప్రేమ్ సింగేరి!!

7).

కామ క్రోద దివో బాళు ఆరతి !

తేజ జ్ఞాని దికాయో గురు కృపాతి!

పదార్థ దుగురున శుద్ధ భోజనేరి !

ఒవాళు ఆరతి గురు ప్రేమ్ సింగేరి!!

8).

హత జోడ వినంతీ గురు దేవేన !

సదా తారి హమేపర రేదేశ ధ్యాన !

బార బార వినంతీ సేవా దళేరి!

ఒవాళు ఆరతి గురు ప్రేమ్ సింగేరి!!

గాయక్ ,మానిక్ రావ్ మహారాజ్ సిర్పల్లి తాండా కుబీర్

సద్గురు హమారో పామణో రెయెవాళో..! అజెరో దాడో సోనె సరికో మళో..! కరతాణీ వాసనా శుద్ద మనేరి..! ఓవాళు అరతి గురు ప్రేమ్ సింగేరి..! అని పాడుతారు.

శాస్త్రీయత[మార్చు]

దీక్ష వెనుక దాగి ఉన్న శాస్త్రీయత ఏడాదికి సుమారుగా 360 రోజులు దానిని తొమ్మిదితో భాగించగా వచ్చేది నలభై ఆ నలభై రోజులు కఠిన నియమాలను అవలంభిస్తే, అది మిగిలిన జీవితానికి ఆదర్శ వంతంగా నిలుస్తుంది. నియంత్రణ, విగ్రహాలు అలవడతాయి. నిరాడంబర జీవితం ప్రారంభమవుతుంది. సకల జీవుల్లో దేవుడున్నాడనే భావనతో ఆధ్యాత్మిక చింతనే శాశ్వతమన్న నమ్మకంతో...భక్తులు అందరిలో దైవాన్నే చూస్తారు.ఆధ్యాత్మికతను పెంచి ఆరోగ్యాన్ని సంరక్షించే నియమాలను అవలంభించాక, ఇంకా ఆ సద్భావనలను జీవన పర్యంతం ఆచరించాలి.

దీక్షగురు ప్రెంసింగ్ మహారాజ్[మార్చు]

సంత్ సేవాలాల్ దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ స్వర్గీయ శ్రీ/శ్రీమతి ఘమాబాయి లచ్మా భంగీ దంపతులకు 1944 లో జన్మించారు.దేశంలోని వివిధ రాష్ట్రాల తాండల్లో ప్రయాణిస్తు ప్రజలను చైతన్య వంతులు చేస్తు సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవి ఆలయం భూమిపూజ, మందిర నిర్మాణానికి కృషి చేస్తున్నారు. విగ్రహ ప్రతిష్టాపన,భోగ్ భండారో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ,తన యొక్క మధురవాణితో ప్రజలను చైతన్య పరుస్తూ మత మార్పిడులను నిరోధిస్తున్నారు. హిందూ ధర్మాన్ని,బంజారా ,సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ హైందవ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుతున్నారు.

రవాణా వ్యవస్థ[మార్చు]

ఆసిఫాబాద్ జిల్లా నుండి వచ్చే భక్తులు కెరామెరి,అనార్ పల్లి మీదుగా నేరుగా దీక్షభూమి కొత్తపల్లి చేరుకోవచ్చు నిర్మల్,ఆదిలాబాద్ జిల్లాల నుండి వచ్చే సేవాలాల్ భక్తులు గుడిహత్నూర్ మీదుగా బస్సులో లేదా ఇతర ప్రయివేటు వాహనాల్లో ఎక్స్ రోడు చేరుకోవాలి.మంచిర్యాల్ జిల్లా నుండి వచ్చే భక్తులు ఉట్నూరు,ఎక్స్ రోడ్ చేరుకోని అచట నుండి నార్నూర్ వెళ్ళే మార్గంలో తాడిహడప్నూర్, నార్నూర్ చేరుకోవాలి.నార్నూర్ నుండి సేవాలాల్ దీక్షభూమి కొత్తపల్లి హెచ్ దేవాలయం ఐదు కిలోమిటర్లు ఉంటుంది.

వసతి సౌకర్యాలు[మార్చు]

దూర ప్రాంతాలనుండి దైవ దర్శనం కోసం తరలి వచ్చే భక్తుల కొరకు సౌకర్యార్థం ఆలయ కమిటి, దాతలు,గ్రామస్తుల సహాయ సాహాకారంతో భక్తులకు సురక్షీత మంచి నీటి సౌకర్యాలు,ఉచిత భోజన సౌకర్యాలు ఉంటాయి.భక్తులు తమ వెంట తెచ్చుకున్న వస్తువులను భధ్రపర్చడానికి,రాత్రిపూట నిద్రించ డానికి ఆలయంలో పది రూములు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ సాహకారంతో రోగులకు కొరకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగ కుండా నార్నూర్ పోలిష్ స్టేషన్ ఎస్ ఐ ఆధ్వర్యంలో బందోబస్థు నిర్వహిస్తారు.

జరిగే ఇతర కార్యక్రమాలు[మార్చు]

దీక్ష భూమి కొత్తపల్లి దేవాలయంలో గురు కృప దినోత్సవంతో పాటు జరిగే ఇతర కార్యక్రమాలు1.మహా శివరాత్రి రోజున సేవాలాల్ దీక్షలు ప్రారంభం.2.పిబ్రవరి పదిహేను న సేవాలాల్ జయంతి.3.శ్రీ రామ నవమి రోజున సేవాలాల్ దీక్ష విరమణ కార్యక్రమం.4.గురు పౌర్ణమి రోజున రాష్ట్రీయ సంత్ శ్రీ రాంరావు మహారాజ్ జయంతి వేడుకలు.5. రాఖి పౌర్ణమి రోజున శ్రీ సంత్ దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి జన్మ దినోత్సవం కార్యక్రమాలు మొదలగునవి ఉంటాయి.

మూలాలు[మార్చు]

  1. "Namasthe Telangana e Paper | e Paper ntnews". epaper.ntnews.com. Retrieved 2024-03-10.
  2. "బంజారాల పుణ్యక్షేత్రం.. కొత్తపల్లి దీక్షభూమి". EENADU. Retrieved 2024-03-10.
  3. "దీక్షభూమి కొత్తపల్లిలో 45,వ. గురు కృప దినోత్సవం...రాథోడ్ శ్రావణ్". 2024-01-11. Retrieved 2024-03-10.
  4. telugu, NT News (2024-01-10). "దీక్షభూమికి ఆధ్యాత్మిక శోభ". www.ntnews.com. Retrieved 2024-03-10.
  5. "భక్తి శ్రద్ధలతో భోగ్‌భండారో". Sakshi. 2024-01-12. Retrieved 2024-03-10.
  6. "లంబడాల సంస్కృతికి అద్దంపట్టిన గురు కృప దినోత్సవం!". News18 తెలుగు. 2024-01-13. Retrieved 2024-03-10.
  7. epaper, Eenadu. "Clip from Eenadu epaper". Eenadu Epaper (in ఇంగ్లీష్). Retrieved 2024-03-10.