ఫ్రాన్సిస్ బేకన్
ద రైట్ ఆనరబుల్ The Viscount St Alban | |||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పాల్ వాన్ సోమర్ I చిత్రం, సుమారు 1617 | |||||||||||||||||
| లార్డ్ హై ఛాన్సిలర్ ఆఫ్ ఇంగ్లండ్ | |||||||||||||||||
| In office 7 మార్చి 1617 – 3 మే 1621 | |||||||||||||||||
| చక్రవర్తి | మొదటి జేంస్ | ||||||||||||||||
| అంతకు ముందు వారు | సర్ థామస్ ఎగర్టన్ | ||||||||||||||||
| తరువాత వారు | జాన్ విలియమ్స్ | ||||||||||||||||
| Attorney General of England and Wales | |||||||||||||||||
| In office 26 అక్టోబరు 1613 – 7 మార్చి 1617 | |||||||||||||||||
| చక్రవర్తి | మొదటి జేమ్స్ | ||||||||||||||||
| అంతకు ముందు వారు | సర్ హెన్రీ హోబార్ట్Sir Henry Hobart | ||||||||||||||||
| తరువాత వారు | సర్ హెన్రీ యెల్వర్టన్Sir Henry Yelverton | ||||||||||||||||
| వ్యక్తిగత వివరాలు | |||||||||||||||||
| జననం | ఫ్రాన్సిస్ బేకన్ 1561 జనవరి 22 ద స్ట్రాండ్, లండన్, ఇంగ్లండ్ | ||||||||||||||||
| మరణం | 1626 ఏప్రిల్ 9 (వయసు: 65) హైగేట్ మిడిల్‌సెక్స్ ఇంగ్లండ్ | ||||||||||||||||
| సమాధి స్థలం | St Michael's Church, St Albans | ||||||||||||||||
| జీవిత భాగస్వామి |
ఆలీస్ బార్నామ్ (m. 1604) | ||||||||||||||||
| తల్లి | లేడీ ఆనీ బేకన్ | ||||||||||||||||
| తండ్రి | సర్ నికోలస్ బేకన్ | ||||||||||||||||
| చదువు | ట్రినిటీ కళాశాల, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (డిగ్రీ లేదు) గ్రేస్ ఇన్ (call to bar) | ||||||||||||||||
| Notable works | Works by Francis Bacon | ||||||||||||||||
| సంతకం | |||||||||||||||||
| |||||||||||||||||
ఫ్రాన్సిస్ బేకన్ (జనవరి 22, 1561 - ఏప్రిల్ 9, 1626) ఒక ఆంగ్ల తత్వవేత్త, రాజకీయవేత్త. ఈయన ఒకటవ కింగ్ జేమ్స్ కింద అటార్నీ జనరల్ గా పనిచేశాడు. ఈయన వైజ్ఞానిక విప్లవంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ప్రాకృతిక తత్వశాస్త్రం, వైజ్ఞానిక పద్ధతుల్లో ఈయన ప్రతిపాదించిన పద్ధతులు ఇప్పటికీ వైజ్ఞానిక శాస్త్రం మీద ప్రభావం చూపిస్తున్నాయి.[1]
ఈయనను అనుభవ వాదానికి (empiricism) పితామహుడిగా భావిస్తారు.[2] ఫ్రాన్సిస్ బేకన్ విజ్ఞానశాస్త్ర విప్లవంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఈయన శాస్త్రీయ విజ్ఞానం కేవలం అంచనాలపైనే కాకుండా, ఉదాహరణానుమిత సిద్ధాంతం (ఇండక్టివ్ రీజనింగ్), నిశిత పరిశీలనపై ఆధారపడి ఉండాలని వాదించాడు. శాస్త్రవేత్తలు తమను తాము తప్పుదారి పట్టించకుండా ఉండటానికి, సందేహాత్మక, ప్రణాళికబద్ధమైన విధానాన్ని ఉపయోగించాలని విశ్వసించాడు. అతని ప్రత్యేకమైన "బేకోనియన్ పద్ధతి" దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపనప్పటికీ, సందేహాత్మక పద్ధతి ఆవశ్యకతపై అతని ప్రభావం చాలా ఉంది. ఈయన శాస్త్ర విజ్ఞానం కోసం ఒక కొత్త చట్రాన్ని (ఫ్రేమ్‌వర్క్‌ను) పరిచయం చేశాడు. అది సందేహం, ప్రయోగాలకు మద్దతు ఇచ్చింది. ఇవి ఈనాటికీ శాస్త్రీయ పద్ధతిలో ముఖ్యమైనవి. బేకన్ శాస్త్రీయ ప్రయోగాన్ని దేవుడిని మహిమను చాటిచెప్పడానికి, ఇంకా పురాణాలను సమర్ధించడానికి ఒక మార్గంగా చూశాడు.
మూలాలు
[మార్చు]- ↑ Klein, Jürgen (2012), "Francis Bacon", in Zalta, Edward N. (ed.), The Stanford Encyclopedia of Philosophy (Winter 2016 ed.), Metaphysics Research Lab, Stanford University, retrieved 17 January 2020
- ↑ "Empiricism: The influence of Francis Bacon, John Locke, and David Hume". Sweet Briar College. Archived from the original on 8 July 2013. Retrieved 21 October 2013.