అనుభవవాదం
అనుభవవాదం (Empiricism) అనేది ఒక జ్ఞానమీమాంస మార్గం. ఈ వాదం ప్రకారం నిజమైన జ్ఞానం లేదా సమర్థన అనేది ఇంద్రియ అనుభవం, అనుభావిక సాక్ష్యం నుండి మాత్రమే లేదా ప్రధానంగా వస్తుంది.[1] హేతువాదం, సంశయవాదంతో పాటు జ్ఞానశాస్త్రంలో ఒకదానితో ఒకటి పోటీపడే అనేక పద్ధతుల్లో ఇదీ ఒకటి. అనుభవవాదులు పూర్తిగా తర్కాన్ని ఉపయోగించడం కంటే వాస్తవాన్ని కనుగొనడంలో అనుభవ జ్ఞానమే మరింత నమ్మదగిన పద్ధతి అని వాదించారు. మానవులకు అభిజ్ఞా పక్షపాతాలు (Cognitive bias), పరిమితులు ఉన్నాయి కాబట్టి ఇవి తీర్పులో లోపాలకు దారితీస్తాయి.[2]
చారిత్రకంగా అనుభవవాదం, మానవ మేధ పుట్టగానే "ఖాళీ పలక" లాగా ఉంటుంది, వయసు గడిచే కొద్దీ, ఆలోచనలు, అనుభవాలు ఏర్పడతాయి అని విశ్వసిస్తుంది.[3]
వైజ్ఞానిక తత్వశాస్త్రంలో అనుభవవాదం ప్రత్యక్ష ప్రమాణాన్ని గురించి, ముఖ్యంగా ప్రయోగ ఫలితాల గురించి నొక్కి చెబుతుంది. అన్ని పరికల్పనలు, సిద్ధాంతాలు కేవలం తార్కికం, అంతర్ దృష్టి లేదా ఆవిష్కారంపై ఆధారపడి కాకుండా సహజ ప్రపంచం యొక్క పరిశీలనలతో పోల్చి పరీక్షించబడాలి అనేది శాస్త్రీయ పద్ధతి మౌలిక సూత్రం.
సహజ శాస్త్రవేత్తలు తరచుగా ఉపయోగించే అనుభవవాదం, "జ్ఞానం అనుభవంపై ఆధారపడి ఉంటుంది", "జ్ఞానం తాత్కాలికమైనది, సంభావ్యతతో కూడుకున్నది, నిరంతర పునర్విమర్శ, అసత్యీకరణకు లోబడి ఉంటుంది" అని నమ్ముతుంది.[4] ప్రయోగాలు, ధృవీకరించబడిన కొలత సాధనాలతో సహా అనుభావిక పరిశోధన శాస్త్రీయ పద్ధతికి మార్గనిర్దేశం చేస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ Psillos, Stathis; Curd, Martin (2010). The Routledge Companion to Philosophy of Science (1. publ. in paperback ed.). London: Routledge. pp. 129–38. ISBN 978-0415546133.
- ↑ "Francis Bacon and the Four Idols of the Mind".
- ↑ Scheibe, Erhard. (2001). Between rationalism and empiricism : selected papers in the philosophy of physics. Springer. ISBN 0-387-98520-4. OCLC 45888831.
- ↑ Shelley, M. (2006). Empiricism. In F. English (Ed.), Encyclopedia of educational leadership and administration. (pp. 338–39). Thousand Oaks, CA: Sage Publications, Inc.