Jump to content

శివ్ ఖేరా

వికీపీడియా నుండి
శివ్ ఖేరా
2016లో శివ్ ఖేరా
జననం (1949-11-13) 1949 నవంబరు 13 (వయసు 75)
జాతీయతభారతీయుడు
వృత్తిరచయిత, మోటివేషనల్ స్పీకర్

శివ్ ఖేరా (జననం 1949 నవంబరు 13) ఒక భారతీయ రచయిత, సామాజిక కార్యకర్త, ప్రేరణాత్మక వక్త, అతని పుస్తకం యు కెన్ విన్ (You Can Win)తో ఆయన ప్రసిద్ధి చెందాడు.[1][2][3] ఆయన భారతదేశంలో కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించాడు, కంట్రీ ఫస్ట్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించాడు.[4][5][6]

2024 భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన సుప్రీంకోర్టులో, ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వచ్చిన నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి తిరిగి పోలింగ్‌ నిర్వహించాలని, అలాగే, నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ వచ్చిన అభ్యర్థులను తదుపరి ఎన్నికలకు పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు ఉండాలని పిటిషన్‌ దాఖలు చేసాడు. దీనిని పరిశీలించిన ధర్మాసనం, 2024 ఏప్రిల్ 26న భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.[7]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆయన కార్ వాషర్‌గా, జీవిత బీమా ఏజెంట్‌గా, ఫ్రాంచైజ్ ఆపరేటర్‌గా కెరీర్ ప్రారంభంలో చేసాడు. టొరంటోలో ఆయన పనిచేస్తున్నప్పుడు, నార్మన్ విన్సెంట్ పీలే ఉపన్యాసం ద్వారా ప్రేరణ పొందాడు. ఆ తరువాత, ఆయన పీలే ప్రేరణాత్మక బోధనలను అనుసరించి, మోటివేషనల్ స్పీకర్‌గా మారాడు. ఆయన ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ అనే పుస్తకం ప్రచురించాడు.[8]

సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త

[మార్చు]

శివ్ ఖేరా కంట్రీ ఫస్ట్ ఫౌండేషన్‌ను స్థాపించాడు, ఇది ఒక సామాజిక చైతన్య సంస్థ.[9] 2004లో, ఆయన భారత సార్వత్రిక ఎన్నికలలో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. 2008లో భారతీయ రాష్ట్రవాది సమానతా పార్టీని స్థాపించాడు. భారతదేశంలో 2014 ఎన్నికల సమయంలో, ఆయన భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చాడు.[10] ఆ పార్టీ సీనియర్ సభ్యుడు లాల్ కృష్ణ అద్వానీ కోసం ప్రచారం చేశాడు.[11] ఆయన భారత సర్వోన్నత న్యాయస్థానంలో అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేసాడు. 2009 భారత సార్వత్రిక ఎన్నికల్లో అవినీతి వ్యతిరేక వేదికపై పోటీ చేసి విఫలమయ్యాడు.[12][13][14]

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం డల్లాస్‌లో 10 - 14 డిసెంబరు 2021న నిర్వహించిన గీతా జయంతి సందర్భంగా భగవద్గీత శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న స్వామి ముకుందానంద, డాక్టర్ మేనాస్ కఫాటోస్ (Menas Kafatos), కిరణ్ బేడీ, బ్రహ్మచారిణి గ్లోరియా అరీరా (Gloria Arieira) వంటి ప్రముఖ వక్తలలో శివ్ ఖేరా ఒకడు.[15][16]

మూలాలు

[మార్చు]
  1. "You Can Win". www.goodreads.com. Retrieved 2021-09-22.
  2. Gupta, Soumyabrata (2018-08-17). "Achievers achieve in spite of problems not in absence of them: Author Shiv Khera". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-09-22.
  3. "Shiv Khera – Business & Leadership Coach" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-22.
  4. "Blame courts for corruption: Shiv Khera | Coimbatore News - Times of India". The Times of India.
  5. Shah, Shalini (24 April 2010). "No 'guru' this". The Hindu. Retrieved 13 December 2016.
  6. "Shiv Khera to file PIL against former CJIs". Deccan Herald. 1 October 2012. Retrieved 15 January 2016.
  7. "NOTA: 'నోటా'కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు | pil-to-cancel-election-if-nota-gets-majority-votes-supreme-court-notice-to-poll-body". web.archive.org. 2024-04-26. Archived from the original on 2024-04-26. Retrieved 2024-04-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. Sheela Reddy (26 July 2004). "You Can Steal & Win". Outlook. Retrieved 11 February 2011.
  9. Shah, Shalini (24 April 2010). "No 'guru' this". The Hindu. Retrieved 13 December 2016.
  10. "Shiv Khera launches Bhartiya Rashtravadi Samanta Party", Oneindia, 14 July 2008, archived from the original on 15 జూలై 2014, retrieved 26 ఏప్రిల్ 2024
  11. Piyush Mishra (28 April 2014), "Motivational speaker Shiv Khera campaigns for Advani", The Times of India
  12. "Blame courts for corruption: Shiv Khera | Coimbatore News - Times of India". The Times of India.
  13. Shah, Shalini (24 April 2010). "No 'guru' this". The Hindu. Retrieved 13 December 2016.
  14. "Shiv Khera to file PIL against former CJIs". Deccan Herald. 1 October 2012. Retrieved 15 January 2016.
  15. "JKYog Bhagavad Gita Summit | RKTemple". adhakrishnatemple.net. Radha Krishna Temple. Archived from the original on 2022-05-19. Retrieved 2024-04-26.
  16. "Renowned speakers from all over world to attend JKYog Bhagavad Gita Summit". www.business-standard.com.
"https://te.wikipedia.org/w/index.php?title=శివ్_ఖేరా&oldid=4216849" నుండి వెలికితీశారు