త్రిపుర సుందరి ఆలయం (ఉదయ్‌పూర్‌)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిపుర సుందరి ఆలయం
ত্রিপুরেশ্বরী মন্দির
మతం
అనుబంధంహిందూత్వం
జిల్లాగోమతి జిల్లా
దైవంత్రిపుర సుందరి
పండుగలుమాఘ పూర్ణిమ,
లలితా పంచమి,
నవరాత్రులలో లలితా జయంతి
ప్రదేశం
ప్రదేశంమాతాబరి, ఉదయపూర్
రాష్ట్రంత్రిపుర
దేశంభారతదేశం
వాస్తుశాస్త్రం.
శైలిబెంగాల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ (రత్న శైలి)
స్థాపకుడుమహారాజు ధన్య మాణిక్య
స్థాపించబడిన తేదీ1501 CE

త్రిపురేశ్వరి ఆలయం, త్రిపుర రాష్ట్రంలోని గోమతి జిల్లా ఉదయపూర్ నగరం నుండి అగర్తల-సబ్రూమ్ రహదారిలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.[1]

ఈ ఆలయం 15వ శతాబ్దం చివరి సంవత్సరాల్లో త్రిపురను పాలించిన రాజు ధన్య మాణిక్య చేత నిర్మించబడింది. బెంగాలీ ఏక్ రత్న శైలిలో నిర్మాణం ఉంటుంది. ఇది భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటి.

స్థానికంగా త్రిపురేశ్వరిగా కొలిచే త్రిపుర సుందరి అమ్మవారి ఈ ఆలయం 75 అడుగుల ఎత్తులో 24 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక చిన్న క్యూబికల్ భవనంగా నిర్మించబడి ఉంది. ఇది తాబేలు ఆకారంలో ఉంటుంది, దీనికి కూర్మ పీఠం అని పేరు. ఇక్కడ అమ్మవారి నైవేద్యం దూద్ పెడా, కాగా ఎరుపు మందార పువ్వులు అలంకరణకు వినియోగిస్తారు.

దేవాలయంలో జంతు బలి ఆచారం కొనసాగుతోంది. అయితే, అక్టోబరు 2019లో నిషేధించబడింది,[2] అయినా, 57 రోజుల నిషేధం తర్వాత డిసెంబరు 2019 నుండి పునఃప్రారంభించబడింది.[3]

ప్రాశస్త్యం[మార్చు]

శ్రీత్రిపురేశ్వరి దేవి

భారతదేశంలోని మహిమాన్విత హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నమ్మే ఈ దేవాలయం త్రిపుర సుందరి దేవతకు అంకితమైనది. అసోంలోని కామాఖ్య దేవాలయం తర్వాత ఈశాన్య భారతదేశంలో ఈ ఆలయానికి అత్యధిక సంఖ్యలో భక్తుల తాకిడి ఉంటుంది. ఇక్కడ స్థానికంగా అమ్మవారిని దేవి త్రిపురేశ్వరి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం త్రిపురలోని అగర్తల నుండి 55 కిమీల దూరంలో ఉన్న పురాతన నగరం ఉదయపూర్‌లో నెలకొని ఉంది. త్రిపుర రాష్ట్రానికి ఈ ఆలయం పేరు పెట్టారు.

మాతాబరి అని ప్రసిద్ధి చెందిన ఈ మందిరం తాబేలు (కూర్మ)ను పోలి ఉండే చిన్న కొండపై నెలకొని ఉంది.[4] కూర్మపృష్టాకృతి అని పిలువబడే ఈ ఆకారం శక్తి ఆలయానికి అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది, అందుకే కూర్మ పీఠం అనే పేరు కూడా వచ్చింది. సంప్రదాయ బ్రాహ్మణ పూజారులు అమ్మవారిని సేవిస్తారు.

ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సతీదేవి ఎడమ కాలు చిటికెన వేలు ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ, శక్తి త్రిపురసుందరీగా పూజించబడుతోంది.

ఆలయ గర్భగుడిలో రెండు వేర్వేరు పరిమాణాల నల్లరాతి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. ఇందులో 5 అడుగుల ఎత్తు ఉన్న పెద్ద విగ్రహం త్రిపుర సుందరి దేవి. కాగా, 2 అడుగుల చిన్నది, ఛోటో మా. అంటే, చిన్న తల్లి అని పిలుస్తారు,[5]

ఈ చిన్న విగ్రహాన్ని త్రిపుర రాజులు యుద్ధభూమికి అలాగే యాత్రలకు తీసుకెళ్ళేవారని నమ్మకం. ప్రతి సంవత్సరం దీపావళి పర్వదినం సందర్భంగా మేళా జరుగుతుంది.[6]

ఎలా చేరుకోవాలి[మార్చు]

అగర్తల నుండి రైలు, రోడ్డు మార్గంలో ఉదయ్‌పూర్‌ లోని త్రిపుర సుందరి ఆలయం చేరుకోవచ్చు.

మూలాలు[మార్చు]

  1. "Tripura Sundari Temple gets a Deepavali makeover as govt slams Left front for neglecting shrines". The Indian Express. 2018-11-07.
  2. "After 500 years, animal sacrifice stops at Tripurasundari Temple in Tripura: What devotees, head priest feel". The Indian Express (in ఇంగ్లీష్). 2019-10-07. Retrieved 2020-11-26.
  3. "Tripura: Animal sacrifice in temples resumed with SC interim nod". The Indian Express (in ఇంగ్లీష్). 2019-12-04. Retrieved 2020-11-26.
  4. "Tripura Sundari Temple gets a Deepavali makeover as govt slams Left front for neglecting shrines". The Indian Express. 2018-11-07.
  5. "Tourists paradise". Frontline, The Hindu. 2009-09-11.
  6. "Tripura: Lakhs flock to Matabari Temple on Diwali". Asian News International. 2018-11-08.