చిటికెన వేలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిటికెన వేలు
మనిషి చిటికెన వేలు
వివరములు
Proper palmar digital arteries,
dorsal digital arteries
పాల్మార్ డీజిటల్ సిరలు
చేతి డోర్సల్ డిజిటల్ సిరలు
ఉల్నార్ నరపు డోర్సల్ డిజిటల్ నరాలు
Supratrochlear
Identifiers
TAA01.1.00.057
FMA24949
Anatomical terminology

చిటికెన వేలు మానవ చేతి వేళ్ళలో అన్నిటికంటే చివరిది, చిన్నది. ఇది ఉంగరపు వేలు పక్కన ఉంటుంది. ఇంగ్లీషులో దీన్ని పింకీ అని కూడా అంటారు. ఈ వేలిని డచ్చిలో పింక్ అంటారు. ఈ మాట ఇంగ్లీషులో పింకీ అని స్థిరపడింది.

నరాలు, కండరాలు

[మార్చు]

చిటికెన వేలిని నియంత్రించే కండరాలు తొమ్మిది ఉన్నాయి: హైపోథెనార్ ఎమినెన్స్‌లో మూడు, రెండు ఎక్స్‌ట్రిన్సిక్ ఫ్లెక్సర్‌లు, రెండు ఎక్స్‌ట్రిన్సిక్ ఎక్స్‌టెన్సర్‌లు, మరో రెండు అంతర్గత కండరాలు:

  • హైపోథెనార్ ఎమినెన్స్:
    • అపోనెన్స్ డిగిటీ మినిమై కండరం
    • అబ్డక్టర్ మినిమై డిజిటి కండరం (మూడవ పామర్ ఇంటర్‌రోస్సీ నుండి అడక్షన్ )
    • ఫ్లెక్సర్ డిజిటి మినిమై బ్రీవిస్ (చాలా మంది మానవులలో "లాంగస్" లేదు)
  • రెండు బాహ్య ఫ్లెక్సర్లు:
    • ఫ్లెక్సర్ డిగిటోరియమ్‌ సూపర్‌ఫిషియాలిస్
    • ఫ్లెక్సర్ డిజిటోరమ్ ప్రొఫండస్
  • రెండు బాహ్య ఎక్స్‌టెన్సర్‌లు:
    • ఎక్స్టెన్సర్ డిజిటి మినిమై కండరం
    • ఎక్స్టెన్సర్ డిజిటోరమ్
  • రెండు అంతర్గత చేతి కండరాలు:
    • నాల్గవ కటి కండరం
    • మూడవ అరచేతి ఇంటర్సోసియస్ కండరం

ఉపయోగం

[మార్చు]

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఒక చేతితో పట్టుకుని అదే చేతి బొటనవేలితో టైపించేటపుడు ఫోను కింది వైపున చిటికెన వేలును ఉంచి పట్టుకుంటారు. మూడు మధ్య వేళ్లను ఫోన్ అడుగున ఉంచి, బొటనవేలుతో టైప్ చేయడానికి ఇలా వీలు కలుగుతుంది.[1]

ఈ పద్ధతిలో ఫోన్‌ను ఎక్కువసేఫు వాడినపుడు తమ చిటికెన వేలిపై ఫోను అరాబులు ఏర్పడినట్లు, నొప్పి కలిగినట్లూ చెప్పారు. వైద్యులు దీనిని "స్మార్ట్‌ఫోన్ పింకీ" అని పేరు పెట్టారు. చర్మంపై పడిన అరాబుల వలన ఆందోళన చెందాల్సినదేమీ లేదని చెప్పారు. సెల్ ఫోన్ వాడడం మానేసిన కొద్దిసేపటి తర్వాత అవి అదృశ్యమయ్యాయి.[1][2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Schlitz, Heather (Nov 6, 2021). "People are sharing pictures of their dented 'smartphone pinky' after holding their phones, so asked doctors what the deal is". Business Insider (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-13.
  2. Chiu, Allyson (Oct 29, 2021). "How to avoid 'smartphone pinkie' and other pains and problems from being glued to your phone". Washington Post (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0190-8286. Archived from the original on Mar 6, 2023. Retrieved 2022-04-13.