భారత కేంద్ర బడ్జెట్ 2024
Submitted by | భారత ఆర్థిక మంత్రి |
---|---|
Parliament | 17వ లోక్‌సభ |
Party | భారతీయ జనతా పార్టీ |
Finance minister | నిర్మలా సీతారామన్ |
‹ 2023 2025 › |
భారత కేంద్ర బడ్జెట్ 2024, అనేది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్.[1][2] దీంతో ఆమె వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టయింది. ఇది భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కావడంతో దీన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని కాని, మధ్యంతర బడ్జెట్ (interim Budget) అని కాని వ్యవహరిస్తారు. ఈ బడ్జెట్ కేవలం రాబోయే మూడునెలల సమయానికి మాత్రమే ఉంటుంది. 2024 సాధారణ ఎన్నికల అనంతరం కొలువుతీరే కొత్త ప్రభుత్వం జులై మాసంలో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతుంది.
పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు వ్యయం అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని మధ్యంతర బడ్జెట్ లో పొందుపరుస్తారు. ఇందులో ఎన్నికల వరకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే పథకాలను ఇందులో పెట్టేందుకు వీలు లేదు.
మధ్యంతర బడ్జెట్ 2024
[మార్చు]2024 యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా 2024–25 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రాబడి, ప్రభుత్వ వ్యయానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది, ఇది 2024 ఏప్రిల్ 1న ప్రారంభమై 2025 మార్చి 31న ముగుస్తుంది.[3][4]
భారత రాష్ట్రపతి నుండి అవసరమైన ఆమోదం పొందిన తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించింది.[1]
అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. ఇది లోక్‌సభతో పాటు రాజ్యసభ నుంచి ఆమోదం పొందిన తర్వాత, అంతిమ ఆమోద ముద్ర కోసం రాష్ట్రపతికి పంపబడుతుంది.
ముఖ్యాంశాలు
[మార్చు]- రాబడి మరియు వ్యయ అంచనాలు (2024-25):
- మొత్తం రసీదులు: రుణాలు మినహాయించి రూ. 30.80 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. వీటిలో పన్ను వసూళ్లు: రూ. 26.02 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. పన్నుయేతర ఆదాయం రూ. 3.99 లక్షల కోట్లు
- మొత్తం వ్యయం: రూ. 47.66 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది.వీటిలో మూలధన వ్యయం రూ.11,11,111 కోట్లు. ఇది GDPలో 3.4%గా ఉంది.2024-2025లో మూలధన వ్యయం వ్యయంలో 11.1% పెరుగుదల ప్రకటించబడింది.
- పన్ను:
- కొత్త పన్ను విధానం ఎంచుకున్న ఉద్యోగులకు ఏడాదికి రూ.7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటించారు. అలాగే, స్టాండర్డ్ డిడక్షన్ ప్రస్తుతం ఉన్న రూ.50 వేలను రూ.75 వేలకు పెంచారు. అయితే, ఆదాయపు పన్ను శ్లాబులలో మాత్రం ఎలాంటి మార్పులేదు.
- పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవు.
- ఈ బడ్జెట్ పాత పన్ను బకాయిలను రద్దు చేసింది. 2009-10 కి ముందున్న పన్ను బకాయిలు గరిష్టంగా రూ.25,000, అలాగే 2014-15కి ముందున్న పన్ను బకాయిలు గరిష్టంగా రూ.10,000 వరకూ రద్దు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించింది.
- స్టార్టప్‌లు మరియు పెట్టుబడులకు నిర్దిష్ట పన్ను ప్రయోజనాలు మార్చి 31, 2025 వరకు ఒక సంవత్సరం పొడిగించబడ్డాయి.
- ఆర్థిక వృద్ధి అంచనాలు:
- 2023-24 ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధి 7.3%గా అంచనా వేయబడింది, ఇది RBI యొక్క సవరించిన GDP వృద్ధి అంచనాకు అనుగుణంగా ఉంది.
- అంతర్జాతీయ ద్రవ్య నిధి 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను 6.3%కి అప్‌గ్రేడ్ చేసింది. 2027లో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కూడా అంచనా వేస్తోంది.
- ద్రవ్య లోటు(Fiscal Deficit) మరియు మార్కెట్ రుణాలు:
- 2024-25లో ద్రవ్య లోటు GDPలో 5.1%గా అంచనా వేయబడింది, 2025-26 నాటికి దానిని 4.5% కంటే తక్కువకు తగ్గించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
- ప్రాధాన్యతలు:
- PM-SVANIdhi కింద 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణ సహాయం అందించడం.
- మహిళా పారిశ్రామికవేత్తలకు 30 కోట్ల ముద్రా యోజన రుణాల పంపిణీ.
- PM-KISAN కింద 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించడం.
- ఫసల్ బీమా యోజన ద్వారా 4 కోట్ల మంది రైతులకు పంటల బీమా వర్తింపు.
- మౌలిక సదుపాయాలు:
- రైల్వేలు: మూడు ప్రధాన ఆర్థిక రైల్వే కారిడార్ కార్యక్రమాలు అమలు చేయడం.
- రూఫ్‌టాప్ సోలారైజేషన్: 1 కోటి గృహాలు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందేందుకు వీలు కల్పించడం.[5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Budget 2024 Live Updates: బడ్జెట్- 2024 ముఖ్యాంశాలు | union budget 2024 live updates". web.archive.org. 2024-02-01. Archived from the original on 2024-02-01. Retrieved 2024-02-01.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Budget 2024: రేపే మధ్యంతర బడ్జెట్ | Nirmala Sitharaman to present Budget 2024 on feb 1 - Sakshi". web.archive.org. 2024-01-31. Archived from the original on 2024-01-31. Retrieved 2024-01-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Union Budget 2024: A beginner's guide to understanding it". Moneycontrol (in ఇంగ్లీష్). 15 January 2024. Retrieved 17 January 2024.
- ↑ Upadhyay, Deepak (16 January 2024). "Budget 2024: How the Union Budget is prepared? A quick guide". mint (in ఇంగ్లీష్). Retrieved 17 January 2024.
- ↑ "భారతదేశ బడ్జెట్ 2024-25" (PDF). భారతదేశ బడ్జెట్. ఆర్థిక మంత్రిత్వ శాఖ. Archived from the original on 23 డిసెంబరు 2023. Retrieved 16 March 2024.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)