ముష్కో లోయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముష్కో లోయ
—  హిల్ స్టేషన్  —
ముష్కో లోయ is located in Ladakh
ముష్కో లోయ
ముష్కో లోయ
లడఖ్‌ పటంలో ముష్కో లోయ స్థానం
దేశం  India
కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్
జిల్లా కార్గిల్
Time zone IST (UTC+5:30)
PIN 194102

ముష్కో లోయ, లడఖ్ లోని ద్రాస్‌లో ఉన్న లోయ. అడవి తులిప్స్ లోయ అని కూడా దీన్ని పిలుస్తారు. పర్యాటకులకు ఈ పూలు ప్రధాన ఆకర్షణ. ఇది భారత కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఉంది. హిమనదీయ ప్రాంతమైన ఈ లోయ మానవ నివాసానికి అనుకూలమైనది కాదని భావిస్తారు. ఈ ప్రాంతం 1999 లో కార్గిల్ యుద్ధ సమయంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. పాకిస్తాన్ దళాలు ఈ ప్రాంతంలోనే నియంత్రణ రేఖను దాటి శిఖరాలో స్థావరాలను ఆక్రమించాయి.[1] ముష్కో లోయ లడఖ్‌కు పశ్చిమ అంచున ఉంది. దీనికి పశ్చిమాన కాశ్మీర్ లోయ ఉత్తర ప్రాంతాలు ఉన్నాయి.

ఈ లోయ ప్రపంచంలోకెల్లా అత్యంత చల్లని నివాస ప్రదేశాలలో రెండవ స్థానంలో ఉన్న ద్రాస్‌లో ఉంది.[2] శ్రీనగర్ నుండి సుమారు 141 కిలోమీటర్ల (88 మైళ్ళు) దూరంలో ఉన్న ద్రాస్‌ను 'లడఖ్ ముఖ ద్వారం' అని కూడా అంటారు.[3]

ముష్కో లోయ సముద్ర మట్టం నుండి సుమారు 3,400 మీటర్లు (11,000 అ.) ఎత్తున ఉంది. ద్రాస్‌లోని ప్రధాన మార్కెట్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.[4] ఇది చుట్టూ పర్వతాలు, గడ్డి మైదానాలతో ఉన్న ఒక గ్రామం ఉంది. గ్రామంలో ప్రకృతి దృశ్యం అలరిస్తుంది. లోయ గుండా ద్రాస్ నది ప్రవహిస్తుంది. ముష్కో నుండి, గురేజ్ (బందీపూర్) లోని తిలైల్‌కి ట్రెక్కింగ్ చేయవచ్చు. ఈ దారి అనేక పచ్చికభూముల గుండా వెళుతుంది. పచ్చికభూములు వివిధ రకాల పూలతో నిండి ఉంటాయి. ముష్కో లోయలోని పర్వత సానువులు పూలతో నిండి, గ్రామానికి కళ్ళు చెదిరే అందాన్నిస్తాయి. గ్రామస్తుల వృత్తి వ్యవసాయం, గొర్రెల పెంపకం.[5]

మూలాలు

[మార్చు]
  1. "What happened in Mushkoh Valley during Kargil war of 1999?". jkyouth.com. JKYouth Newspaper. 3 January 2023. Archived from the original on 4 అక్టోబరు 2023. Retrieved January 3, 2023.
  2. "This Indian region is world's second-coldest inhabited place. Watch how people live here". Hindustan Times (in ఇంగ్లీష్). Hindustan Times. 5 November 2022.
  3. "Drass: A Scenic Gateway to Ladakh". India.com (in ఇంగ్లీష్). Charu Chowdhary. 8 July 2019.
  4. "Mushkoh Valley · CMQ8+2CV, Dras, 194102". Mushkoh Valley, Google Maps (in ఇంగ్లీష్).
  5. Schuh, Dieter (2014). "Drass". Tibet-Encyclopaedia.