వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2018
(వికీపీడియా:మీకు తెలుసా? భండారము/పాత విశేషాలు 11 నుండి దారిమార్పు చెందింది)
2018 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు |
01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26 |
2018 సంవత్సరం లోని వాక్యాలు
[మార్చు]01 వ వారం
[మార్చు]- ...రంగులకల 1983 లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్నదనీ!
- ...అద్దంకి గంగాధర కవి కుతుబ్ షాహీలకు తెలుగు కావ్యమును అంకితం చేసిన మొదటివాడిగా గుర్తింపు పొందాడనీ!
- ...ప్రపంచంలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాల్లో కంచట్కా అగ్నిపర్వతాలు ఒకటనీ!
- ...ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ జమ్మూ కాశ్మీర్ లో భారత సైన్యానికి అతిముఖ్యమైన వంతెనను పేల్చివేయడానికి పాకిస్థాన్ చేసిన ఒక విఫల ప్రయత్నమనీ!
- ...సామాజిక వ్యాపారవేత్త అరుణాచలం మురుగనాథమ్ ని ప్యాడ్ మాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనీ!
02 వ వారం
[మార్చు]- ...ప్రముఖ దక్షిణ భారతీయ దర్శకుడు పి. వాసు తండ్రి పీతాంబరం ఎం. జి. ఆర్, ఎన్. టి. ఆర్ లాంటి నటులకు మేకప్ మ్యాన్ గా పనిచేశాడనీ!
- ...చారిత్రక ప్రసిద్ధి గాంచిన వెల్లూర్ కోట ను 16వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారనీ!
- ...ఏడవ నిజాం పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరుతో హైదరాబాదులోని హిమాయత్‌నగర్ ఏర్పడిందనీ!
- ...శ్రావణ బెళగొళ లోని గోమటేశ్వర విగ్రహం భారతదేశంలోని ఏడు వింతల్లో ఒకటిగా ఎంపికైందనీ!
- ...సియాచిన్ హిమానీనదం ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధ క్షేత్రమనీ!
03 వ వారం
[మార్చు]- ...2008 లో ఆస్కార్ బహుమతి పొందిన జయహో పాట గాయకుల్లో విజయ్ ప్రకాష్ ఒకడనీ!
- ... చార్లెస్ విల్కిన్స్ భగవద్గీత ను ఆంగ్లం లోకి అనువదించిన మొట్టమొదటి వ్యక్తి అనీ!
- ... రత్నం పెన్ భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఫౌంటెన్ పెన్ అనీ!
- ... వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి రాసిన మహాభారత తత్త్వ కథనం అనే గ్రంథం మహాభారత విమర్శనా గ్రంథాల్లో అత్యంత ప్రామాణికంగా పరిగణించబడుతున్నదనీ!
04 వ వారం
[మార్చు]- ...కన్నడ నాటక రంగ వికాసంలో ప్రముఖుడైన జోళదరాశి దొడ్డనగౌడ తెలుగు నాటకరంగ ప్రముఖుడు బళ్ళారి రాఘవ ఒకరి నాటకాల్లో మరొకరు నటించి ప్రదర్శనలు ఇచ్చారనీ!
- ... గాయకుడు సాందీప్ ప్రేమాయనమః అనే చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడనీ!
- ... ఆంధ్ర భాషా సంజీవని తొలితరం తెలుగు పత్రికల్లో ఒకటనీ!
- ... గరికిపర్తి కోటయ్య దేవర సంగీతానికి ముగ్ధుడైన ఆంగ్ల గవర్నరు విజయవాడ బందరు రైలు మార్గం వేయించాడనీ!
- ...బెండపూడి అన్నయ మంత్రి కాకతీయుల సామ్రాజ్యంలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన ముఖ్యమైన నాయకుడనీ!
05 వ వారం
[మార్చు]- ...మా నాన్న నిర్దోషి చిత్రం తెలుగులో శ్రీదేవి కి బాల నటిగా మొదటి చిత్రమనీ!
- ...డేవిడ్ బ్రౌన్ ఆంధ్రభాషాభివృద్ధికి విశేషమైన కృషి చేసిన ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తండ్రి అనీ!
- ...అల్లూరి సీతారామరాజు సినిమా తీసి, ఆయన పాత్రలో నటిద్దామని ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు ప్రయత్నించినా చివరకి ఆ అవకాశం కృష్ణకు దక్కిందనీ!
- ...అంపశయ్య నవల వెయ్యేళ్ళలో వచ్చిన గొప్ప నవలల్లో ఒకటిగా గుర్తింపు పొందిందనీ!
- ...కె. శివన్ 2018 లో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) నూతన ఛైర్మన్ గా నియమితుడయ్యాడనీ!
06 వ వారం
[మార్చు]- ... దక్షిణాది సినిమాల్లో అనేక పాటలు పాడిన గాయకుడు టిప్పు అసలు పేరు ఏకాంబరేష్ అనీ!
- ... భారతదేశంలో మొట్టమొదటి కుష్టునివారణ హాస్పెటల్ నిర్మాణానికి డిచ్‌పల్లిలో స్థలదానం చేసింది రాజా నర్సాగౌడ్ అనీ!
- ... ఆంధ్రశిల్పి, ఆంగ్లశిల్పి పత్రికలను పిలకా గణపతిశాస్త్రితో కలిసి నడిపింది వి.ఆర్.చిత్రా అనీ!
- ... తెలుగు భాష చరిత్రను తెలిపే తెలుగు సాంస్కృతిక నికేతనం విశాఖపట్నంలో ఉన్నదనీ!
- ... మాణిక్యవాచకర్ దక్షిణ భారతదేశ శైవ సాంప్రదాయంలో ముఖ్యమైన యోగుల్లో ఒకరనీ!
07 వ వారం
[మార్చు]- ... విశాఖపట్నం సమీపంలోని కైలాసగిరి ప్రాంతాన్ని ఏటా సగటున లక్షకు పైగా పర్యాటకులు సందర్శిస్తారనీ!
- ... లోకోమోటివ్ బాయిలరు ను రైలు ఇంజన్లలో వాడతారనీ!
- ... టంగుటూరి ఆదిశేషయ్య అనే కవి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడైన ప్రకాశం పంతులుకు దాయాది అనీ!
- ... ద్రావిడ కుటుంబానికి చెందిన బడగ భాష నీలగిరి కొండల్లోని ఆదిమవాసుల వ్యవహారిక భాష అనీ!
- ... భవాని దీవి భారతదేశంలోని అతిపెద్ద నదీ ద్వీపాల్లో ఒకటిగా పరిగణించబడుతుందనీ!
08 వ వారం
[మార్చు]- ... చరిత్రలోకెల్లా ధనవంతుడిగా పేరుపొందిన వ్యక్తి 14వ శతాబ్దిలో పశ్చిమ ఆఫ్రికాలోని మాలి సామ్రాజ్య పరిపాలకుడు మన్సా మూసా I అనీ!
- ... తెరచీరల పటం కథ యాదవ పురాణాన్ని చెప్పేందుకు ఏర్పాటైన జానపద కళ అనీ!
- ... తుర్లపాటి రాధాకృష్ణమూర్తి పౌరాణిక నాటకాల్లో దుర్యోధన పాత్రలకు పేరు పొందాడనీ!
- ... నదుల పరిరక్షణకు చేసిన కృషికి పరిణీతా దండేకర్ ఉద్యమకారులకు అందించే ప్రతిష్టాత్మక వసుంధర అవార్డు 2018 సంవత్సరానికి గాను పొందారని!
- ... రోగాలను కలిగించే క్రిములు పాథోజెన్ ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పాథాలజీ అంటారనీ!
09 వ వారం
[మార్చు]- ... చీమకుర్తి నాగేశ్వరరావు పౌరాణిక నాటకాల్లో సత్య హరిశ్చంద్రుడి పాత్రకు పేరుగాంచాడనీ!
- ... సరస్వతీ గ్రంథాలయం, తంజావూరు లో వివిధ భారతీయ భాషల్లో తాళపత్ర గ్రంథాలు మొదలుకొని అనేక ప్రాచీన గ్రంథాలు లభ్యమవుతున్నాయనీ!
- ...ప్రపంచంలో స్వయంభువుగా సుదర్శన చక్రంతో లక్ష్మీనృసింహస్వామి రేకుర్తిలో వెలిసినారనీ!
10 వ వారం
[మార్చు]- ... 1997 లో విడుదలైన హాలీవుడ్ చిత్రం టైటానిక్ 2 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం సాధించిందనీ!
- ... పాఠశాల, మాబడి మాసపత్రికలను నాయుని కృష్ణమూర్తి స్థాపించి, నిర్వహించారనీ!
- ... విజయేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠానికి 70 వ గురువుగా నియమితులయ్యారనీ!
- ...అంకమ్మ ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాల్లో పూజలందుకునే ఒక గ్రామ దేవత అనీ!
11 వ వారం
[మార్చు]- ... తెలుగులో మొదటిసారిగా మాజికల్ రియలిజం లో కథ రాసిన రచయిత మునిపల్లె రాజు అనీ!
- ... శాతవాహన వంశానికి చెందిన శివశ్రీ శాతకర్ణి శాసనాలు నేడు అమరావతి దగ్గర లభ్యమవుతున్నాయనీ!
- ... జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయం ముందుగా జైన దేవాలయంగా నిర్మించబడి తర్వాత హిందూ దేవాలయంగా మార్చబడిందనీ!
- ... లారా దత్తా విశ్వసుందరి గా ఎంపికైన రెండో భారతీయ యువతి అనీ!
12 వ వారం
[మార్చు]- ... ఖండోబా అనే శివ స్వరూపుడైన దేవుడిని కర్ణాటక, మరియు మహారాష్ట్ర లలో ఎక్కువగా పూజిస్తుంటారనీ!
- ... సముద్ర గుర్రం అని పిలవబడే చేపలకు వాటి తల గుర్రం ఆకారంలో ఉండటంతో ఆ పేరు వచ్చిందనీ!
- ... సీతారామాలయం, సైదాపురం లోని రాముని విగ్రహం భద్రాచలం దేవాలయంలో ఉన్న రాముని విగ్రహంకన్నా పురాతనమైందనీ!
- ... ప్రతి సంవత్సరం మార్చి 14న గణిత శాస్త్రవేత్తలు పై డే జరుపుకుంటారనీ!
- ... నాయుడు గోపి నాటక రంగంలో సుమారు ఆరు వందల సార్లు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడనీ!
13 వ వారం
[మార్చు]- ... తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణ మూర్తి ఆధ్యాత్మిక రచనల్లో పేరు గాంచారు!
- ... మహానటి సినిమా నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్నది!
- ... కల్లూరి విశాలాక్షమ్మ ప్రముఖ కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి పుత్రిక!
- ... జింకు ఆక్సైడ్ ను ప్రస్తుతం మనం విరివిగా వాడుతున్న ఎలక్ట్రానికి పరికరాల్లో ఉపయోగించే ఎల్. ఇ. డి తయారీలో ఉపయోగిస్తారు!
- ... ఆంథోని రాజ్ భారతదేశంలో మిమిక్రీ కళపై పి. హెచ్. డి సాధించిన మొదటి కళాకారుడిగా గుర్తింపు పొందారు!
14 వ వారం
[మార్చు]- ... ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ అసలు పేరు కమ్రుద్దీన్ ఖాన్!
- ... చిప్కో ఉద్యమం అడవులను పరిరక్షించుకోవడానికి చేపట్టిన ఉద్యమము!
- ... పూరీ జగన్నాథ్ ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసింది టి. త్రివిక్రమరావు !
- ...ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి కోసం అలనాటి సినీ నిర్మాత ఎల్. వి. ప్రసాద్ హైదరాబాదులోని బంజారా హిల్స్ లో ఐదెకరాల స్థలం దానం చేశారు!
- ... నాటకరంగ ప్రముఖుడైన కృత్తివెంటి వెంకట సుబ్బారావు ప్రప్రథమ హార్మోనిస్టుగా పేరు గాంచారు!
15 వ వారం
[మార్చు]- ... ఆత్మచరిత్రము ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకులు మరియు సంఘ సంస్కర్త రాయసం వెంకట శివుడి ఆత్మకథ!
- ... తెలుగు డిటెక్టివ్ సాహిత్యంలో టెంపో ఆనే పాత్ర సృష్టికర్త వక్కంతం సూర్యనారాయణరావు అనీ!
- ... అంతరిక్ష వ్యర్ధాలు లను భూమ్మీదకు తీసుకురావడం ఖరీదైనందువల్ల వాటిని అక్కడే నాశనం చేస్తారనీ!
- ... కందిమళ్ళ సాంబశివరావు నాటకరంగ పరిశోధనకు గాను భారతదేశంలోనే తొలిసారిగా డి.లిట్ అందుకున్నాడనీ!
16 వ వారం
[మార్చు]- ...తెలంగాణాలోని పొట్లపల్లి శివాలయం కాకతీయ వంశానికి చెందిన మొదటి ప్రోలరాజు నిర్మించాడనీ!
- ... అంత్రాసైట్ అనేది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలో పేరుకుపోయిన వృక్ష శిలాజాల వల్ల ఏర్పడే ఒకరకమైన బొగ్గు అనీ!
- ... 2018 లో విడుదలైన రంగస్థలం సినిమాలో సమంత పాత్రకు గాత్రం అందించింది జ్యోతివర్మ అనీ!
- ... కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాగోడ్ బసప్ప రవీంద్రనాథ్ కు 2009 లో వీరచక్ర పురస్కారం లభించిందనీ!
- ... డబ్బింగ్ కళాకారుడు పి. రవిశంకర్ ఇప్పటి దాకా ఆరు సార్లు నంది పురస్కారం అందుకున్నాడనీ!
17 వ వారం
[మార్చు]- ...కుందన్ లాల్ సైగల్ ను బాలీవుడ్ మొదటి సూపర్ స్టార్ గా పరిగణిస్తారనీ!
- ...విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రి150 సంవత్సరాలనుంచి రోగులకు సేవలందిస్తున్నదనీ!
- ... హైడ్రోజన్ మూలకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త హెన్రీ కేవిండిష్ అనీ!
- ... శిలీంధ్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైకాలజీ అంటారనీ!
- ... శివరావు బెనెగల్ భారత స్వాతంత్ర్యం ప్రకటనను వార్తగా మలచిన ప్రముఖ పాత్రికేయుల్లో ఒకడనీ!
18 వ వారం
[మార్చు]- ... హైదరాబాదులోని మలక్ పేట లో ఉన్న రేమండ్స్ స్తూపం ఫ్రాన్స్ దేశస్థుడు రేమండ్ స్మృతి చిహ్నంగా నిర్మించబడిందనీ!
- ... వాసిరెడ్డి సీతాదేవి రచించిన మట్టి మనిషి నవల 14 భాషల్లోకీ అనువాదం అయిందనీ!
- ... చల్లా కృష్ణనారాయణరెడ్డి ని పీలేరు గాంధీ అని వ్యవరిస్తారనీ!
- ... వాడకట్టు హనుమంతరావు తెలుగువారిలో తొలి యుద్ధ విలేఖరిగా ప్రఖ్యాతి గాంచాడనీ!
- ... శ్రీ కృష్ణ లీలా తరంగిణి సుప్రసిద్ధ వాగ్గేయకారుడు నారాయణ తీర్ధులు రచించిన భక్తి కావ్యమనీ!
19 వ వారం
[మార్చు]- ... హైదరాబాదులో ఉన్న గన్‌ఫౌండ్రి లో నిజాం నవాబులు యుద్ధానికి అవసరమయ్యే ఫిరంగి మందు పౌడర్ తయారు చేసేవారనీ!
- ... భారతదేశంలో ప్రణాళికా బద్ధంగా నిర్మించబడిన చంఢీగర్ నగరానికి రూపకల్పన చేసింది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫ్రెంచి ఆర్కిటెక్టు లె కార్బుజియె అనీ!
- ... తెలంగాణా లోని సురగొండయ్య గుట్ట ఆదిమానవుల నివాస స్థావరంగా గుర్తింపబడుతోందనీ!
- ... ఎ. ఓ. హ్యూమ్ ను భారతదేశపు పక్షిశాస్త్ర పితామహుడిగా వ్యవహరిస్తారనీ!
- ... అయ్యదేవర కాళేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి శాసనసభాధిపతి అనీ!
20 వ వారం
[మార్చు]- ...దీప శశింద్రన్ ప్రముఖ నటి, నాట్య గురువు అయిన మంజు భార్గవి శిష్యురాలనీ!
- ... కంప్యూటర్ గ్రాఫిక్సు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది బోయింగ్ కి చెందిన వెర్నీ హడ్సన్, విలియం ఫెటర్ అనీ!
- ... ఛాయాచిత్రకళ పరికరాలను తయారు చేసే ఈస్ట్‌మన్ కొడాక్ సంస్థ వ్యవస్థాపకుడు జార్జి ఈస్ట్‌మన్ అనీ!
21 వ వారం
[మార్చు]- ... వాయులీన విద్వాంసుడు యనమండ్ర నాగయజ్ఞ శర్మ ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ తండ్రి అనీ!
- ... చౌదరాణి మద్రాసులో తొలి తెలుగు పుస్తక విక్రయశాలను ప్రారంభించిన వ్యక్తి అనీ!
- ... గుజరాత్ రాష్ట్రంలోని లోథాల్ పురాతన సింధు నాగరికతకు సంబంధించిన ముఖ్యమైన నగరాల్లో ఒకటనీ!
- ... నోరి దత్తాత్రేయుడు క్యాన్సర్ చికిత్సలో ప్రపంచంలో ప్రముఖ వైద్యుల్లో ఒకరనీ!
- ...అంతర్జాతీయ మాతృ దినోత్సవం మొదటి సారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారనీ!
22 వ వారం
[మార్చు]- ... తాడి నాగమ్మ తొలి తెలుగు దళిత కథా రచయిత్రిగా పేరుగాంచిందనీ!
- ... నిపా వైరస్ ఒక ప్రాణాంతకమైన వైరస్ అనీ!
- ... తోటపల్లి ఆనకట్ట ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న పేరు మీదుగా నామకరణం చేయబడిందనీ!
- ... భారత రాజ్యాంగ పీఠిక పత్రాన్ని రూపొందించింది ప్రసిద్ధ చిత్రకారుడు బెవహర్ రామ్మనోహర్ సింహా అనీ!
- ... చిలుకూరు బాలాజీ అర్చకుడు సి. ఎస్. రంగరాజన్ దళిత భక్తుని భుజంమీద ఎక్కించుకుని అంతర్జాతీయ గుర్తింపు పొందాడనీ!
23 వ వారం
[మార్చు]- ... తమిళనాడులోని కూడంకుళం భారతదేశంలో అత్యధికంగా పవన విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో ఒకటనీ!
- ... రాజస్థాన్ కు చెందిన రాజేంద్ర సింగ్ ను వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనీ!
- ... సింధీ భాష మాట్లాడే ప్రాంతాలు ఎక్కువగా పాకిస్థాన్ లో ఉన్నాయనీ!
- ... విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న జంఝావతి ప్రాజెక్టు దేశంలో మొదటి సారిగా నిర్మిస్తున్న రబ్బర్ డ్యాం అనీ!
- ...ముక్తా శ్రీనివాసన్ నిర్మించిన నాయకన్ సినిమా భారతదేశం నుంచి తొలిసారి ఆస్కార్ పురస్కారానికి పోటీ పడిందనీ!
24 వ వారం
[మార్చు]- ...మణిపురి భాష ను యునెస్కో అంతరించి పోయే ప్రమాదం ఉన్న భాషల్లో ఒకటిగా గుర్తించిందనీ!
- ...హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ యూరోపియన్ జానపద కథలకు ప్రసిద్ధుడనీ!
- ..దక్షిణాసియాకు చెందిన గిరిజన భాషల పునరుర్ధరణకు కృషిచేసిన వారు అన్విత అబ్బి అనీ!
25 వ వారం
[మార్చు]- ...భారత ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి టి. ఎన్. శేషన్ అనీ!(చిత్రంలో)
- ...అత్యధిక కాలం భారతదేశానికి సేవలంచిందిన మొదటి అటార్నీ జనరల్ ఎం. సి. సేతల్వాద్ అనీ!
- ...భిన్నూరి నరసింహ శాస్త్రి ప్రారంభించిన తెలుగు మాస పత్రిక మూసీ అనీ!
- ...1949లో భారత కుటుంబ నియంత్రణ సంస్థను స్థాపించిన సమాజ సేవకురాలు అవాబాయ్ బొమన్జీ వదియా అనీ!
- ... కర్ణాటక రాష్ట్ర 18వ ముఖ్యమంత్రి హెచ్. డి. కుమారస్వామి అనీ!
26 వ వారం
[మార్చు]- భారతదేశంలో రెండవ అతిపెద్ద వంతెన మహాత్మా గాంధీ సేతువు అనీ!
- కర్నాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి భార్య ప్రముఖ కన్నడ సినీనటి రాధిక అనీ!
- 2011లో ఔట్ స్టాండింగ్ ఉమెన్ పురస్కారం గ్రహీత మానసీ ప్రధాన్ అనీ!
- గండిపేట మేధావిగా తనదైన శైలిలో ఎన్‌టి రామారావుకు ఎన్నో సలహాలు ఇచ్చిన వ్యక్తి మెంటే పద్మనాభం అనీ!
- వామపక్ష పార్టీలను ఏకం చేయాలనే కార్యచరణను చేపట్టినవాడు మాదాల రవి అనీ!
27 వ వారం
[మార్చు]- 1995 సెప్టెంబరులో సంభవించింన భయంకరమైన తుఫాను ఇస్మైల్ తుఫాను అనీ!
- రెండవ వెనుకబడిన తరగతుల కమీషన్(మండల్ కమీషన్) కు చైర్మన్ గా వ్యవహరించినది బి.పి.మండల్ అనీ!
- మాదాల రంగారావు తన చిత్రాల ద్వారా వచ్చిన లాభాన్ని సీపీఎం పార్టీ కార్యాలయానికి విరాళంగా ఇచ్చేవాడనీ!
- "నల్లజాతి చైతన్య పితామహుని"గా పేరొందినవాడు స్టీవ్ బికో అనీ!
- ఆమ్ల,క్షార బలాలను తెలుసుకొనే పి.హెచ్ స్కేలును రూపొందించినవాడు ఎస్.పి.ఎల్.సోరెన్‌సన్ అనీ!
28 వ వారం
[మార్చు]- రెండవ ప్రపంచ యుద్ధసమయంలో నైతిక ధైర్యాన్ని నిలబెట్టేలా ముందుండి కృషిచేసిన వనిత మార్లిన్ డీట్రిచ్ అనీ!
- రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన సారా వ్యతిరేక ఉద్యయంలో కీలకపాత్ర పోషించిన నాయకుడు జక్కా వెంకయ్య అనీ!
- చరిత్రలోకెల్లా అత్యంత ధనికుడైన నేరస్తుడిగా పేరొందినవాడు పాబ్లో ఎస్కోబార్ అనీ!
- గుజరాత్ లోని ముధెరా లో ప్రసిద్ధ సూర్యదేవాలయం ఉన్నదనీ!
- హైదరాబాదులో మొట్టమొదటి మోడల్ రైతుబజార్‌ను ఎర్రగడ్డ ప్రాంతంలో ఏర్పాటుచేసారనీ!
29 వ వారం
[మార్చు]- జర్మన్ పునరుజ్జీవన సిద్ధాంత కర్త ఆల్బ్రెచ్ట్ డ్యూరర్ అనీ!
- విజయవాడలోని బందరు రోడ్లో ఉన్న ప్రముఖ ప్రదేశం బెంజ్ సర్కిల్ అనీ!
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు తెలుగుదేశంపార్టీ అధ్యక్షునిగా కిమిడి కళా వెంకటరావు నియమితుడయ్యాడనీ!
- షకీలాతర్వాత అంతే స్థాయిలో శృంగారం పండించిన తారల్లో బాబిలోనా ఒకరనీ!
- మానవ మనుగడ మొదలు నేటి వరకు జరిగిన యదార్థాల అధ్యయనం ప్రపంచ చరిత్ర అనీ!
30 వ వారం
[మార్చు]- తెలుగు బాలసాహిత్యంలో ఒక నూతన ఒరవడికి కృషిచేస్తున్న రచయిత ఎం. హరికిషన్ అనీ!
- విజయవాడ నగరం మధ్యలో ప్రవహిస్తున్న కాలువ రైవస్ కెనాల్ అనీ!
- భక్తులు రాత్రికి రాత్రే దొంగతనంగా నిర్మించిన శైవాలయం దొంగమల్లన్న దేవాలయం అనీ!
- రెండు సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందిన తమిళ రచయిత ఎం. ఎల్. తంగప్ప అనీ!
- సర్వేపల్లి రాసిన ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథానికి సంపాదకుడు పూల తిరుపతి రాజు అనీ!
31 వ వారం
[మార్చు]- భూవైజ్ఞానిక కాల రేఖ ను భూమి చరిత్రలో జరిగిన ఘటనల కాలాన్ని వివరించేందుకు వాడతారనీ!(చిత్రంలో)
- 300 రకాలకు పైగా దృశాశాస్త్రానికి సంబంధించిన గాజు పదార్థాలను రూపొందించిన శాస్త్రవేత్త మార్గా ఫాల్స్టిచ్ అనీ!
- చిరంతానందస్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద తత్వాలపై తెలుగులో 20కి పైగా పుస్తకాలు రాశాడనీ!
- వాసాల నరసయ్య 2017 లో కేంద్ర సాహిత్య అకాడెమీ నుంచి బాలసాహిత్య పురస్కారం అందుకున్నాడనీ!
- సుమారు 2450 కోట్ల సంవత్సరాల కిందట మహా ఆక్సిజనీకరణ ఘటన కారణంగా భూమి వాతావరణంలోకి అత్యధికంగా ఆక్సిజన్ ఉత్పత్తి జరిగిందనీ!
32 వ వారం
[మార్చు]- ...శామ్యూల్ బెకెట్ సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన ఐరిష్ కవి మరియు, నాటకకర్త అనీ!(చిత్రంలో)
- ... తెలంగాణ తొలి తెలుగు పత్రిక హితబోధిని అనీ!
- ... తెలంగాణ తొలి అనువాద పత్రిక శేద్య చంద్రిక అనీ!
- ... భూమిపై వెయ్యేళ్ళ పాటు చల్లటి పరిస్థితులు కొనసాగాయనీ టోబా మహావిపత్తు సిద్ధాంతం భావిస్తుందనీ!
- ... బాలసుధాకర్ మౌళి తన తరగతి గదిలోని విద్యార్థుల కవిత్వంతో "స్వప్న సాధకులు" అనే సంకలనం ప్రచురించాడనీ!
33 వ వారం
[మార్చు]- ... జమ్మూ కాశ్మీర్ రాజ్యానికి తొలి మహారాజు గులాబ్ సింగ్ అనీ!(చిత్రంలో)
- ... అమరావతిలో ప్రపంచ ప్రసిద్ధ దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాత లింగమనేని రమేశ్ అనీ!
- ... టు వర్డ్స్ మ్యాన్ కైండ్ (ఇంగ్లీషు), యువ పోరాటం (హిందీ) పత్రికలను కేశవరావు జాదవ్ నడిపాడనీ!
- ... గోడు గిరిజన స్త్రీల అవస్థలను తెలియజేసే నవల రాగో రచయిత మల్లోజుల వేణుగోపాల్ అనీ!
- ... తమిళనాడుకు చెందిన జ్యోతి రామలింగస్వామి ఎవరికీ కనిపించకుండా అదృశ్యమైనాడనీ!
34 వ వారం
[మార్చు]- ...దశావతారాలతో కూడిన వేంకటేశ్వరుని విగ్రహం గల ఆలయం దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయం అనీ!
- ... దుగ్గిరాల బలరామకృష్ణయ్య ను బౌద్ధ వాఙ్మయ బ్రహ్మ అని పిలుస్తారనీ!
- ... అనుశీలన్ సమితి భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఒక విప్లవ సంస్థ అనీ!
- ... మిరియాల నూనె ఎక్కువగా సింగపూర్, భారతదేశం మరియు మలేషియాలో ఉత్పత్తి అవుతున్నదనీ!
- ... ఐకియా ప్రపంచంలో అతిపెద్ద రీటెయిల్ ఫర్నీచర్ సంస్థల్లో ఒకటనీ!
35 వ వారం
[మార్చు]- ... 18 వ శతాబ్దంలోనే ఈస్టిండియా పరిపాలనకు వ్యతిరేకంగా ఫకీర్లు, సన్యాసుల తిరుగుబాటు చేశారనీ!
- ... గదబ మధ్య ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాష అనీ!
- ... నిజాం ప్రభువు నిజాం ఆలీఖాన్ భార్య హమ్డా బేగం పేరు మీదుగా బేగంబజార్ కు ఆ పేరు వచ్చిందనీ!
- ... ప్రబంధ కల్పవల్లి 1870-1882 మధ్యకాలంలో తూర్పు గోదావరి జిల్లానుంచి ప్రచురించబడిన సాహిత్య మాసపత్రిక అనీ!
- ... హెర్ట్జ్ అనేది పౌనఃపున్యాన్ని కొలవడానికి ఉపయోగించే అంతర్జాతీయ ప్రమాణమనీ!
36 వ వారం
[మార్చు]- ... గదర్ పార్టీ భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో పంజాబీలు స్థాపించిన భారతీయ విప్లవ సంస్థ అనీ!
- ... కుందూరి ఈశ్వరదత్తు (1910-1979) చారిత్రక, సాహిత్య పరిశోధనలలో శ్లాఘనీయమైన కృషి చేసిన వ్యక్తి అనీ!
- ... శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు తెలంగాణలో గోదావరి నదిపై నాల్గవ అతిపెద్ద ప్రాజెక్టు అనీ!
- ... బేరి పండులో 83 శాతం దాకా నీరు ఉంటుందనీ!
- ... నిట్టల శ్రీరామమూర్తి 2014లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ నటుడిగా కీర్తి పురస్కారం అందుకున్నాడనీ!
37 వ వారం
[మార్చు]- ... తారారాణి శ్రీవాస్తవ బీహారుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య ఉద్యమకారిణి అనీ!
- ... ఇంద్రోడా రాక్షసబల్లి మరియు శిలాజ ఉద్యానవనము భారతదేశపు జురాసిక్ పార్కు గా వ్యవహరించబడుతుందనీ!
- ... ఆంధ్రప్రదేశ్ కు చెందిన జి.సతీష్ రెడ్డి ఇటీవలే డి. ఆర్. డి. ఓ ఛైర్మన్ గా ఎన్నికయ్యాడనీ!
- ... డిండి నది కృష్ణానదికి గల ఉపనదుల్లో ఒకటనీ!
- ... జాజికాయ నూనె కీళ్ళవాత నొప్పుల నివారణకు ఉపయోగిస్తారనీ!
38 వ వారం
[మార్చు]- ... స్వప్న బర్మన్ 2018 ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్ లో బంగారు పతకం గెలుచుకుందనీ!
- ... మధ్యయుగ వెచ్చని కాలం తరువాత ఏర్పడిన చల్లని కాలాన్ని చిరు మంచుయుగం అంటారనీ!
- ... ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా ఆంగ్ల భాషలో సంగీత రంగంలో ప్లాటినం పొందిన మొట్టమొదటి భారతీయ స్త్రీ అనీ!
- ... పూర్ణ స్వరాజ్ 1929 డిసెంబరు 19న బ్రిటిష్ వారితో తెగతెంపులు చేసుకునేందుకు భారత జాతీయ కాంగ్రెస్ నిర్ణయించుకున్న రోజనీ!
- ... జాతీయ డిజిటల్ లైబ్రరీ ఐఐటీ ఖరగ్ పూర్ నిర్వహిస్తున్న ఆన్ లైన్ గ్రంథాలయమనీ!
39 వ వారం
[మార్చు]- ... లావెండరు నూనె ను ఆరబెట్టిన పూల నుండి తయారు చేస్తారనీ!
- ... ఒక యోగి ఆత్మకథ, ఆపిల్ వ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ లో స్ఫూర్తి నింపిన పుస్తకమనీ!
- ... జస్టిస్ పార్టీ స్థాపన ద్రవిడ ఉద్యమానికి ప్రారంభంగా భావిస్తారనీ!
- ... హైదరాబాదుకు వచ్చే తాగునీరు మంజీరా నదిపై నిర్మించిన సింగూర్ డ్యాం నుంచి సరఫరా అవుతుందనీ!
- ... స్వెమా ఒకప్పటి ప్రముఖ ఫోటో ఫిలిం ఉత్పత్తిదారు అనీ!
40 వ వారం
[మార్చు]- ... ఆడెపు లక్ష్మీపతి 2018 లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడనీ!
- ... సదర్మాట్ ఆనకట్ట గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్ట అనీ!
- ... ఊపిరితిత్తుల కాన్సర్ సుమారు 85 శాతం వరకూ, చాలాకాలంగా పొగాకు సేవించేవారిలో కనిపిస్తుందనీ!
- ... మద్దూరి వెంకటేశ్వర యాజులు వందలకొద్దీ యాగాలు నిర్వహించిన వేదపండితుడనీ!
- ... మకరంద పండు (పీచ్) పండ్లు మొదటి సారిగా చైనా దేశంలో సాగుచేశారనీ!
41 వ వారం
[మార్చు]- ... రోహిత పక్షి (ఫ్లెమింగో) ఒంటి కాలుపై నిలబడి రెండవ కాలును శరీరంలో కనబడకుండా దాచివేస్తుందనీ!
- ... నార్వే ఐరోపా ఖండంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన దేశాల్లో ఒకటనీ!
- ... కోరిందపండు (రాస్ప్ బెర్రీ) చెట్లు సంవత్సరం పొడవునా ఫలాలను అందిస్తాయనీ!
- ... మూసీ నదిలో 1908నాటి హైదరాబాదు వరదలు కారణంగా సుమారు 15 వేలమంది ప్రాణాలు కోల్పోయారనీ!
- ... వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం లో సంవత్సరంలో 12 రోజుల్లో మాత్రమే నిజరూప దర్శనం లభిస్తుందనీ!
42 వ వారం
[మార్చు]- ... అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 28న జరుపుకుంటారనీ!
- ... ప్రపంచంలో అతిపెద్ద నేత్ర వైద్య సంస్థయైన అరవింద్ ఐ హాస్పిటల్స్ అధినేత గోవిందప్ప వెంకటస్వామి అనీ!
- ... 2011 లో విడుదలైన రాజన్న చిత్రం ఆరు నంది పురస్కారాలు అందుకున్నదనీ!
- ... మేజర్ సోమ్‌నాథ్ శర్మ పరమవీర చక్ర పురస్కారం పొందిన మొట్టమెదటి భారతీయుడనీ!
- ... పాటిబండ్ల చంద్రశేఖరరావుకు న్యాయశాఖలో చేసిన సేవలకు గాను 2012 లో పద్మభూషణ్ పురస్కారం లభించిందనీ!
43 వ వారం
[మార్చు]- ... నటుడు కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని నటించిన షో అనే చిత్రం రెండు జాతీయ పురస్కారాలు లభించాయనీ!
- ... జి. డి. అగర్వాల్ గంగానది ప్రక్షాళనకు విశేష కృషి చేశాడనీ!
- ... నిజజీవిత కథ ఆధారంగా రూపొందించిన ది పియానిస్ట్ సినిమా పలు ఆస్కార్ పురస్కారాలు అందుకున్నదనీ!
- ... ఐ కేర్ ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా కంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి వైద్య సహాయం అందిస్తుందనీ!
- ... నెల్లూరు జిల్లాకు చెందిన గూడూరు శేషారెడ్డి స్వాతంత్ర్య సమరంలో పాల్గొని పలు మార్లు జైలుకు వెళ్ళాడనీ!
44 వ వారం
[మార్చు]- ... పృథ్వీ షా భారత్ తరపున ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే శతకం సాధించిన ఆటగాడుగా రికార్డుల్లోకి ఎక్కాడనీ!
- ... నాడీ గ్రంథాలు భారతదేశంలో అత్యంత పురాతనమైన జ్యోతిష శాస్త్ర గ్రంథాలనీ!
- ... బద్ధకానికి పేరుగాంచిన అలసకోతి (స్లోత్) ఎక్కువ సమయం చెట్లపై తలకిందులుగా వేళ్ళాడుతూ ఉంటుందనీ!
- ... వస వేరు నూనెను భారతదేశంలో అనాదిగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారనీ!
- ... అన్నా రాజం మల్హోత్రా భారతదేశ స్వాతంత్ర్యానంతరం మొట్టమొదటి మహిళా ఐఎఎస్ అధికారి అనీ!
45 వ వారం
[మార్చు]- ... డౌన్ సిండ్రోమ్ బాధితుల్లో తెలివితేటలు తక్కువగా ఉంటాయనీ!
- ... హాంకాంగ్-జుహయి వంతెన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన అనీ!
- ... తెలుగు వాడైన మన్నెం నాగేశ్వరరావు సి. బి. ఐ డైరెక్టర్ గా ఇటీవలే ఎన్నికయ్యాడనీ!
- ... విషవత్తు లేదా ఈక్వినాక్స్ అంటే పగలు రాత్రి సమానంగా ఉండే రోజులనీ!
- ... జాంబవతీ కళ్యాణము శ్రీకృష్ణదేవరాయలు రచించిన సంస్కృత నాటకమనీ!
46 వ వారం
[మార్చు]- ... పుణెలో ఉన్న భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో అనేక పురాతన తాళపత్ర గ్రంథాలు భద్రపరచారనీ!
- ... బలిజేపల్లి లక్ష్మీకాంతం రచించిన నాటకాల్లో సత్య హరిశ్చంద్ర నాటకం చాలా పేరు పొందిందనీ!
- ... నారింజ నూనె ను అరోమా థెరపీలో ఉపయోగిస్తారనీ!
- ... ఇటలీ లోని మిలన్ లో ఉన్న 11 అంతస్థుల భవనం బాస్కో వెర్టికాలె లో సుమారు 900 చెట్లు ఉన్నాయనీ!
- ... తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి మొదటి డాక్టరేటు అందుకున్నది కపిలవాయి లింగమూర్తి అనీ!
47 వ వారం
[మార్చు]- ... ఏనుగ శ్రీనివాసులురెడ్డి ఐక్యరాజ్య సమితిలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడాడనీ!
- ... గ్వాంగ్ఝౌ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ ప్రపంచంలో 17వ ఎత్తైన భవనం అనీ!
- ... పాకిస్థాన్ లోని ప్రహ్లాదపురి ఆలయాన్ని బాబ్రీ మసీదు విధ్వంసానికి వ్యతిరేకంగా ధ్వంసం చేశారనీ!
- ... అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ విజయవాడ, విశాఖపట్నం లో మెట్రో నిర్వహణ కోసం ఏర్పడ్డ సంస్థ అనీ!
- ... తెలంగాణా పోరాట యోధుడు ఎర్రబోతు రాంరెడ్డి చిన్నతనంలో ఉరిశిక్ష నుంచి బయటపడ్డాడనీ!
48 వ వారం
[మార్చు]- ... శ్రీరాముని కుమారుల్లో ఒకడైన లవుడు పేరు మీదుగా పాకిస్థాన్ లోని లాహోర్ లో లవ మందిరం ఉందనీ!
- ... ఎలిజీ అంటే శోకభరితమైన కవిత అనీ!
- ... అభినవ ప్రసాదరాయ అని పేరు గాంచినవాడు సింగరాజు నాగభూషణరావు అనీ!
- ... మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ ను స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అంటారనీ!
- ...మెల్లకన్ను వలన చూపు మందగించడం, లేదా కోల్పోవడం జరిగే ప్రమాదం ఉందనీ!
49 వ వారం
[మార్చు]- ... రైతు వాల్మీకి అని బిరుదు పొందినవాడు వానమామలై జగన్నాథాచార్యులు అనీ!
- ... పింగళి సూరన రచించిన రాఘవ పాండవీయం తొలి తెలుగు ద్వ్యర్థి కావ్యం అనీ!
- ... రాజేంద్ర చోళుడు ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడనీ!
- ... వెంకటగిరి సంస్థానం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సంస్థానాల్లో ఒకటిగా ఉండేదనీ!
- ... ప్రాచీన భారతీయ ఆలయ శిల్పకళ గురించి ఆలయములు - ఆగమములు అనే పుస్తకం రాసినవారు కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య అనీ!
50 వ వారం
[మార్చు]- ... భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరమని అభిప్రాయపడింది గోపాలకృష్ణ గోఖలే అనీ!
- ... నటుడు తొట్టెంపూడి గోపీచంద్ ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ తనయుడనీ!
- ... ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల చూర్ణం అంటారనీ!
- ... తెలుగు వాగ్గేయకారిణిగా ప్రసిద్ధి చెందినవారిలో కాకటూరి పద్మావతి ఒకరనీ!
- ... తొలి చైనా చక్రవర్తి మంగోల్ సంచార జాతుల దాడుల నుంచి రక్షణ కోసం ఒక మహాకుడ్యాన్ని నిర్మించాలనుకోవడంతో చైనా గోడ చరిత్ర ప్రారంభమైందనీ!
51 వ వారం
[మార్చు]- ... ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ నటుడిగా తొలిచిత్రం శుభసంకల్పం అనీ!
- ... అరకులో పర్యాటకులను ఆకర్షించే పూల తోటలను వలిసె పంట అంటారనీ!
- ...హైసిస్ ఇస్రో ప్రయోగించిన అతి తక్కువ బరువు గల ఉపగ్రహాల్లో ఒకటనీ!
- ... ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలవడానికి కాంతి సంవత్సరం అనే కొలమానాన్ని ఉపయోగిస్తారనీ!
- ... మరియా ఒక్త్యాబ్రస్కయా రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీకి వ్యతిరేకంగా పోరాడిన సోవియట్ ట్రక్ డ్రైవర్ అనీ!
52 వ వారం
[మార్చు]- ... ప్రముఖ బాలీవుడ్ నటుడు అశోక్ కుమార్ ను ముద్దుగా దాదామొని అని పిలుస్తారనీ!
- ... సూర్యునికి అతి దగ్గర్లో ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ అనీ!
- ... ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శి దేవులపల్లి రామానుజరావు అనీ!
- ... మహం బేగం మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ భార్య అనీ!
- ... డక్కలి బాలమ్మ తెలంగాణాలో అరుదైన 12 మెట్ల కిన్నెరగానం లో ప్రసిద్ధురాలనీ!