దొంగమల్లన్న దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగమల్లన్న దేవాలయం
దొంగమల్లన్న దేవాలయం is located in Telangana
దొంగమల్లన్న దేవాలయం
దొంగమల్లన్న దేవాలయం
Location within Telangana
భౌగోళికాంశాలు :18°47′26″N 79°03′42″E / 18.790618°N 79.061623°E / 18.790618; 79.061623Coordinates: 18°47′26″N 79°03′42″E / 18.790618°N 79.061623°E / 18.790618; 79.061623
ప్రదేశం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:జగిత్యాల జిల్లా
ప్రదేశం:మల్లన్నపేట
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షిణ భారతదేశం

దొంగమల్లన్న దేవాలయం తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలం తిర్మలాపురం పక్కనవున్న మల్లన్నపేట గ్రామంలో ఉన్న దేవాలయం.[1] చాళుక్యుల కాలంలో గ్రామస్థులకెవరికి తెలియకుండా రాత్రికి రాత్రే దొంగతనంగా ఆలయాన్ని నిర్మించడం వల్ల దీనికి దొంగమల్లన్న పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

చరిత్ర[మార్చు]

చాళుక్యుల శిల్పకళా రీతులలోనున్న ఈ దేవాలయం పొలవాస రాజులచే 11, 12 శతాబ్దాలకాలంలో నిర్మించారు. ఇదొక అద్భుతమైన, అరుదైన రెండంతస్తుల దేవాలయం. ఇక్కడ లింగాకారంలో ఉన్న శివున్ని గొల్ల వారు, కురుమవారు మల్లన్నగా కొలుస్తారు. మల్లన్న గుడి ఉన్న ఈ ఊరును మల్లన్నపేట అంటారు.[2]

ఉత్సవాలు[మార్చు]

ప్రతి సంవత్సరం మార్గశిర పంచమి నుంచి 7 వారాలపాటు ప్రతి ఆది, బుధ వారాల్లో జాతర నిర్వహించబడుతుంది. కొండూరి వంశస్థుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రతీ సంవత్సరం బోనాలు తీసి తులాభారం పంచిపెట్టి పట్నాలు వేస్తారు. ఒగ్గుడోలు కళాకారులు , శివసత్తుల పూనకాలతో ప్రత్యేకపూజలు నిర్వహింస్తారు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, ప్రధాన దేవాలయాలు. "దొంగమల్లన్న దేవాలయం, మల్లన్నపేట". Archived from the original on 16 July 2018. Retrieved 11 June 2018.
  2. నవతెలంగాణ (8 November 2016). "విశిష్ట చరిత్ర గల దొంగమల్లన్న ఆలయం". Retrieved 11 June 2018.