ఆలయములు - ఆగమములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలయములు - ఆగమములు
కృతికర్త: కందుకూరి వేంకటసత్య బ్రహ్మాచార్య
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: కృష్ణా పుష్కరాలు - 2016 రెండవ ముద్రణ
ప్రచురణ: హిందూ దేవాలయ ప్రతిష్టాన పీఠం & శిల్ప కళాభారతి
విడుదల: 2015
పేజీలు: 224
ప్రతులకు: శిల్పకళా భారతి, శ్రీ కామాక్షి దేవి పూజా పీఠం, విద్యాధరపురం, విజయవాడ - 520012 ఫోన్: 0866-2411298 సెల్ : 9848577423


ఆలయములు - ఆగమములు ఆగమశాస్త్ర పండితులుగా పేరుగాంచిన కందుకూరి వేంకటసత్య బ్రహ్మాచార్య భారత దేశంలో ఉన్న అనేక ప్రముఖ ఆలయాల నిర్మాణాలను శాస్త్రబద్ధంగా విశ్లేషిస్తూ రాసిన పుస్తకం.[1]


పుస్తకంలోని విషయం[మార్చు]

దేవాలయం హిందూధర్మానికి హిమాలయ శిఖరం వంటిది. అటువంటి ఆలయాల విశిష్టత, ఆగమశాస్త్ర నిబంధనలను గురించి రచయిత కందుకూరి వేంకటసత్య బ్రహ్మాచార్య ‘ఆలయములు- ఆగమములు’ పేరుతో ఒక గ్రంథం రచించారు. హిందూ దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన 250కి పైగా అంశాలను ఈ గ్రంథంలో క్రోడీకరించారు. ఈ గ్రంథంలో వివిధ ఆలయాలను గురించి, వాటి నిర్మాణం గురించి, ప్రశస్తినీ వివరణాత్మకంగా చిత్రాలలో సహా వివరించారు. విగ్రహారాధన ప్రాధాన్యత, ఆవశ్యకత, విగ్రహ తత్వాలను గురించి విశదీకరించారు. ఆగమశాస్త్రం- శిల్పశాస్త్రం, ఆగమ సాంప్రదాయాలను గురించి వివరించారు.

ఒక అధ్యాయంలో వివిధ సంప్రదాయాలు గల మందిరాలను గురించి, వివిధ దేవాలయాల శిల్ప ప్రతిష్టలను గురించిన వివరాలను చిత్రాలతో సహా వివరించారు. మరో అధ్యాయంలో వివిధ ఆరాధనా పద్ధతులను గురించి సవివరంగా ప్రస్తావించారు. వివిధ దేవాలయల ఉత్సవాలను గురించి వివరించారు. ‘ప్రతి ఒక్కరూ దేవాలయాలను దర్శించాలి, దేవాలయాలు దేవునికి నిలయాలు, మానవుని మనుగడకు, చిత్తశుద్ధికి, ప్రశాంత జీవనానికి ఏకైక గమ్యస్థానం’ అంటారు రచయిత. ఆలయాల ఆలంబన లేకుండా హైందవ సంస్కృతి చుక్కాని లేని నావ వలె ఉంటుందంటారు. దేవాలయాలు ధ్వంసమైనపుడు వాటిని జీర్ణోద్ధరణ చేయకుంటే అక్కడ దుర్భిక్షం, ప్రజాపీడ, రాజపీడ జరుగుతుందని, ప్రజలు అనేక ఆపదలకు గురవుతారని ఆగమశాస్త్రం చెబుతున్నదని రచయిత పేర్కొన్నారు. ఆలయాల జీర్ణోద్ధరణ ఏ విధంగా చేయాలో రచయిత సవిరంగా తెలిపారు.

ఆలయాలు, ఆగమాలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ గ్రంథం తెలియజేసింది. ప్రతి ఆలయంలోనూ, ఆయా ఆగమములు, వాటి విధానాలు, అవి సూచించిన మార్గంలోనే ఆలయనిర్వహణ జరగాలని రచయిత విన్నవించారు. ఆలయ అభివృద్ధిని ఆగమ క్రియలతో పరిపుష్టం చేయాలని, అందుకోసం ఆలయ సంస్కృతిని, ఆగమ ఆదేశాలను విధిగా పాటించాలని రచయిత పేర్కొన్నారు. దేవాలయాల విశిష్టతను తెలుసుకునేందుకు ఈ గ్రంథం ఉపకరిస్తుంది. [2]

పుస్తకంలోని విషయాలు[మార్చు]

 • 01. ఆలయాలు
 • 02. విగ్రహారాధన
 • 03. ఆగమములు
 • 04. ఆలయ నిర్మాణం
 • 05. కుంభాభిషేకం (ప్రతిష్ట)
 • 06. ఆరాధన
 • 07. ఉత్సవములు
 • 08. దేవాలయ దర్శనము
 • 09. జీర్ణోద్ధరణ
 • 10 ఆలయ నియమములు

పుస్తకంపై సమీక్షలు[మార్చు]

 • దేవాలయ నిర్మాణ తీరు తెన్నులపై ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా చదవాలిన పుస్తకం ఇది. - ఆంధ్రజ్యోతి దినపత్రిక
 • అనేక పరిశోధనలు చేసి వెలువరించిన గ్రంథం. ఆలయములు ఆగమములకు సంబంధించిన ఎన్నో అమూల్యమైన , ఆసక్తికరమైన విషయాలున్నాయి. - సాక్షి (దినపత్రిక)
 • ప్రతి దేవాలయంలో ప్రతి అర్చకుని ఇంట్లో ఆధ్యాత్మిక వాది చేతిలో విధిగా ఉండాల్సిన గ్రంథం - జనత దినపత్రిక
 • ప్రాచీన నవీన విజ్ఞనాన్ని సమ్మిళితం చేసి, రచయిత మధురమైన భగవత్సేవామృతాన్ని పాఠకులకు పంచిపెట్టాడు. ఆలయాలకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా ప్రామాణికంగా వివరించి , ఎన్నో విశిష్టలతో రూపొందిన ఈ పుస్తకం అందరు చదవాల్సిన అపూర్వ రచన. - సప్తగిరి (పత్రిక)
 • గతంలో ఆలయ దర్శనం, ఆగమ దర్శనం, శిల్పవిద్య, వాస్తువిద్య తదితర గ్రంథాలను రచించిన ప్రతిభావంతుడైన యువరచయిత ఈ గ్రంథంలో అనేక ఆగమ శాస్త్ర విషయాలు అందరికి అర్ధమయ్యే రీతిలో సచిత్రంగా అందినచారు. ఆరాధన మాసపత్రిక.
 • ఆలయాన్ని దర్శించవచ్చే భక్తులతోపాటు నూతనంగా ఆలయాన్ని నిర్మించదలచుకున్న వారికి కూడా కరదీపికలా ఉపయోగించేపుస్తకం ఆలయములు - ఆగమములు పుస్తకం. - భక్తి మాసపత్రిక
 • ఆగమాలకు సంబంధించిన ప్రసక్తానుప్రసక్తంగా ఎన్నో విషయాలను అలవోకగా పాఠకులకు అందించిన అపురూప గ్రంథం. - ఋషిపీఠం మాసపత్రిక
 • ఇటువంటి గ్రంథాలను రాయడానికి పాండిత్యంతోపాటు సునిశితమైన ప్రతిభ, మొక్కవోని పట్టుదల, అనంతమైన సాహసం అన్నీ అవసరమవుతాయి. - శ్రీశైలప్రభ మాసపత్రిక
 • దేవాలయ దర్శనములోని రహస్యాలు, ఆలయ నియమాల వంటివి సర్వులకు ఎంతో ఉపయోగపడుతాయనడంలో సందేహం లేదు. - కనకదుర్గప్రభ మాసపత్రిక
 • ఆలయాలను గురించి, ఆలయ నిర్మాణం గురించి , ముఖ్యంగా ఆలయ వాస్తుశాస్త్రమైన ఆగమశాస్త్రం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఇది తరగని నిధి వంటిది. తిరుపతి లడ్డు వంటిది. శివుని పాదోదకం వంటిది . ఇటువంటి పుస్తకం ప్రతి ఇంటా ఉండదగ్గది . - ఓం సన్నిధానం పత్రిక

మూలాలు[మార్చు]

 1. "ఆలయాల విశ్లేషణ". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. 2015-02-05.
 2. "ఆలయ సంస్కృతిని తెలిపే ఆలయములు-ఆగమములు". jagritiweekly.com. జాగృతి. 2017-10-17.[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]