Jump to content

కందుకూరి వేంకటసత్య బ్రహ్మాచార్య

వికీపీడియా నుండి
Kandukuri Venkatasatya Brahmacharya
కందుకూరి వేంకటసత్య బ్రహ్మాచార్య
జననంకందుకూరి వేంకటసత్య బ్రహ్మాచార్య
నివాస ప్రాంతంవిజయవాడ భారత దేశముIndia
వృత్తిశ్రీశైలప్రభ మాసపత్రిక, సహాయ సంపాదకులు.
ప్రసిద్ధిఆగమశాస్త్ర పండితులు. శ్రీశైలప్రభ మాసపత్రిక, సహాయ సంపాదకులు.
మతంహిందూ
తండ్రికందుకూరి వేంకట గోవిందేశ్వర శర్మ
తల్లికందుకూరి వేంకట నరసమ్మ

కందుకూరి వేంకటసత్య బ్రహ్మాచార్య విజయవాడకు చెందిన ఆగమశాస్త్ర పండితులు,[1] రచయిత, శ్రీశైలప్రభ మాసపత్రిక, సహాయ సంపాదకులు. .

బాల్యం, విద్యాభ్యాసంసం

[మార్చు]

కృష్ణానది పరివాహక ప్రాంతంలో దుర్గమ్మ వడిలో విశ్వబ్రాహ్మణ పండిత కుటుంబంలో కందుకూరి వేంకట గోవిందేశ్వర శర్మ, కందుకూరి వేంకట నరసమ్మలకు జన్మించాడు. విజయవాడలో జన్మించి, ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేసుకున్న సత్యబ్రహ్మచార్య బహుభాషా కోవిదుడిగా పిన్న వయసులోనే కీర్తి గడించారు. ప్రాథమిక విద్యానంతరం ఏడుకొండల వెంకటేశ్వరస్వామి సన్నిధి తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో శైవాగమ విద్యను 8 సంవత్సరాలపాటు గురుకుల పద్ధతిలో అభ్యసించి, శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయం ద్వారా ఆగమశాస్త్రంలో స్నాతకోత్తర పట్టభద్రులు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖలో శిల్పశాస్త్ర అనువాద పథకంలో ఆగమశాస్త్ర పండితుడిగా ఉద్యోగం సంపాదించి కాశ్యప శిల్పశాస్త్ర గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. కర్ణాటక శిల్పకళా అకాడమీవారి కర్ణాటక సంప్రదాయ శిల్పగురుకుల కేంద్రంలో బి.ఎఫ్.ఎ, ఎమ్.ఎఫ్.ఎ. కోర్సుల సిలబస్ కమిటీ, బోర్డు అఫ్ స్టడీస్ సభ్యుడిగా, ఆగమశాస్త్ర పండితుడిగా, విషయనిపుణుడిగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీశైలప్రభ మాసపత్రిక సహాయ సంపాదకులుగా పనిచేస్తున్నారు.

రచనల జాబితా

[మార్చు]
  • 01. కాశ్యప శిల్పశాస్త్రం (దేవాదాయశాఖ ప్రచురణ)
  • 02. సకలాధికార శిల్పశాస్త్రం
  • 03. మయమత శిల్పశాస్త్రం ప్రతిమాలక్షణం
  • 04. జీర్ణోద్ధరణదశకం
  • 05. కారణాగమం చెప్పిన నిత్యార్చన
  • 07. శిల్పవిద్యారహస్యోపనిషత్తు
  • 08. వాస్తుపురుషుడు ఒక అధ్యయనం
  • 09. ఆగమసంస్కృతి
  • 10. శైవాగమం ఒక అధ్యయనం
  • 11. ఆలయ దర్శనం
  • 12. ఆగమ దర్శనం
  • 13. శిల్పవిద్య
  • 14. వాస్తువిద్య
  • 15. ప్రతిమా లక్షణం
  • 16. ఆగమశాస్త్రములు - శిల్పశాస్త్రములు
  • 17. ఆలయములు - ఆగమములు [2]
  • 18. యజ్ఞాయుధములు
  • 19. శివలింగ లక్షణ చంద్రిక
  • 20. ఆగమదీపిక
  • 21. హిందూ దేవాలయ నిర్మాణదర్శిని
  • 22. కథాశిల్పమ్
  • 23. శివ లీలలు
  • 24. దేవాలయవాస్తు
  • 25. ఆలయవేదం
  • 26. శివాలయ ఉత్సవాలు
  • 27. ఆగమధర్మాలు
  • 28. శైవాగమ నిత్యపూజా లక్షణ సంగ్రహం

మూలాలు

[మార్చు]
  1. "ఆలయ సంస్కృతిని తెలిపే ఆలయములు-ఆగమములు". jagritiweekly.com. జాగృతి. 2017-10-17.[permanent dead link]
  2. "ఆలయాల విశ్లేషణ". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. 2015-02-05.[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]