బి.పి.మండల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిందేశ్వరి ప్రసాద్ మండల్
బి.పి.మండల్

బి.పి.మండల్


పదవీ కాలం
1 ఫిబ్రవరి 1968 – 2మార్చి 1968
ముందు సతిష్ ప్రసాద్ సింగ్
తరువాత భోలా పాశ్వాన్ శాస్త్రి

భారతదేశ పార్లమెంటు సభ్యుడు
మడ్నెపుర లోక్‌సభ నియోజకవర్గం
పదవీ కాలం
1967 – 1972
తరువాత రాజేంద్రప్రసాద్ యాదవ్
పదవీ కాలం
1977 – 1980
ముందు రాజేంద్రప్రసాద్ యాదవ్
తరువాత రాజేంద్రప్రసాద్ యాదవ్

వ్యక్తిగత వివరాలు

బిందేశ్వరి ప్రసాద్ మండల్ (1918–1982) భారతదేశ పార్లమెంటు సభ్యుడు, సంఘ సంస్కర్త. అతను రెండవ వెనుకబడిన తరగతుల కమీషన్ (మండల్ కమీషన్గా సుపరిచితం) కు చైర్మన్ గా వ్యవహరించాడు. అతను ఉత్తర బీహార్ లోణి సహర్సాలో అత్యంత ధనుకులైన యాదవ్ జమీందారీ (భూస్వాములు) కుటుంబంలో నన్మించాడు.[1][2] కమీషన్ భారతదేశంలోని ప్రజలలో ఒక భాగాన్ని "అదర్ బేక్ వర్డ్ క్లాసెస్" (OBCs) (ఇతర వెనుకబడిన కులాలు) గా నివేదిక ప్రకారం నివేదించింది. భారతీయ రాజకీయాల్లో తక్కువగా ఉన్న, బలహీన వర్గాల కోసం పాలసీపై తీవ్రమైన చర్చ ప్రారంభమైంది.

జీవిత విశేషాలు

[మార్చు]

బి.పి. మండల్ ( బిందేశ్వరి ప్రసాద్ మండల్ ) బీహార్ లోని బనారస్ లోని ఒక యాదవ్ కుటుంబంలో 1918 ఆగస్టు 25న జన్మించాడు.[3].[4] మాధేపురా జిల్లాలోని  మోరో  గ్రామంలో పెరిగాడు. మండేపురంలో మండల్ తన ప్రాథమిక విద్యని, దర్భాంగాలో ఉన్నత పాఠశాల విద్యని  పూర్తి చేసాడు. 1930 లలో పాట్నా కాలేజీలో  ఇంటర్మీడియేట్ పూర్తి చేసిండు. ఆ  తరువాత పై చదువులకై అతను ప్రెసిడెన్సీ కళాశాల కలకత్తాలో చేరిండు. దురదృష్టవశాత్తు, ఇంట్లో కొన్ని అనివార్యమైన పరిస్థితుల కారణంగా, అతను తన చదువుని విడిచిపెట్టవలసి వచ్చింది.

మండల్ తన 23 వయేటా జిల్లా కౌన్సిల్ కి ఎన్నికయ్యాడు. 1945-51 మధ్య కాలములో మాధేపుర డివిజన్ లో జీతం తీసుకోకుండానే జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ గా పనిచేసాడు. అతని  రాజకీయ జీవితం భారత జాతీయ కాంగ్రెస్తో మొదలైంది. 1952 లో మొదటిసారి బీహార్ అసెంబ్లీకి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అధికార పక్షములో ఉండి బీహార్ లోని బలహీనవర్గ  కుర్మీలపై అగ్రవర్ణ రాజుపుత్రులు దాడి చేయడాన్ని నిరసించాడు. 1965 లో తన నియోజకవర్గంలో భాగంగా ఉన్న గ్రామమైన పామాలో  మైనారిటీలు, దళితులపై పోలీసులు చేస్తున్న అత్యాచారాలపై మాట్లాడాలని కోరుకున్నప్పుడు అధికార పక్షములో ఉండి ఈ అంశంపై మాట్లాడకూడదని ముఖ్యమంత్రి ఆదేశిస్తే తన మనస్సాక్షిని చంపుకోలేక  తను నమ్మిన విలువల కోసం ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి సిద్దమై సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్.ఎస్.పి) లో చేరాడు. ఎస్.ఎస్.పి రాష్ట్ర పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్ గా నియమించబడ్డాడు.

1967 లో జరిగిన ఎన్నికలలో ఎస్.ఎస్.పి అభ్యర్థుల ఎంపికపై ఆయన చేసిన కృషి, ఆయన ప్రచారం వల్ల 1962 లో కేవలం 7 సీట్లు కల ఆ పార్టీకి 1967 లో  69 సీట్లు వచ్చాయి. బీహార్లో మొట్టమొదటి కాంగ్రెస్ యేతర ప్రభుత్వం ఏర్పడింది. అతను పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ మంత్రివర్గంలో చేర్చారు. ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసాడు. కానీ పార్టీలో, ప్రభుత్వములో కొన్ని విభేదాలు రావడముతో  కాంగ్రెస్ పార్టీ బయటి నుండి మద్దతు ఇవ్వడంతో 1968 ఫిబ్రవరి 1 న అతను బీహార్ రాష్ట్ర రెండవ బీసీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[5]  కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంటూనే రాజీ పడకుండా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అవినీతిపై అయ్యర్ కమీషన్ వేసి విచారణ చేయించాడు. ఆ కమీషన్ నివేదికను బయలుపరచకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధి స్వయంగా ఒత్తిడి తీసుకవచ్చింది. ప్రధానితో అతను మాట్లాడడానికి నిరాకరించడముతో ప్రభుత్వముపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గడంతో 30 రోజులకే మండల్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అతను తరచూ తన మంత్రులకు, "ఓట్లను సంపాదించడానికి కులపరమైన విజ్ఞప్తి సహించవచ్చు  కానీ ప్రభుత్వాల నిర్ణయాలల్లో  ఏ కులతత్వాన్ని సహించవద్దు" అని చెప్పే మండల్ తన ప్రభుత్వములో పరిపాలనలో ఎక్కడ కులతత్వాన్ని ప్రదర్శించకుండా పాలించాడు.

1967 మార్చి 5న అతను సోషిత్ దళ్ (అణగారిన ప్రజల పార్టీ ) ని స్థాపించాడు. 1967 నుండి 1970 వరకు లోక్‌సభ సభ్యునిగా ఉన్నాడు. 1972 లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు. 1972 లో అప్పటి బీహార్ ముఖ్య మంత్రి పాండే మిథిలా యూనివర్సిటీ పేరుతో అందులో  కింది ఉద్యోగి  నుండి వైస్ ఛాన్సలర్ వరకు ఒకే కులం వారితో నింపాలనే ప్రయత్నాలని వ్యతిరేకించాడు. ఆ తర్వాత 1974 లో శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి జయప్రకాష్ నారాయణ నేతృత్వములో నడుస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమములో పాల్గొన్నాడు. 1977 లో జనతా పార్టీ తరపున లోక్ సభకి ఎన్నికై 1979 వరకు కొనసాగాడు. ఎమర్జెన్సీ తర్వాత ఏర్పాటైన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీని డిబార్ చేయాలని అధికార పార్టీ సభ్యులు తెచ్చిన తీర్మానాన్ని మండల్ వ్యతిరేకించాడు. మండల్  తన రాజకీయ జీవితంలో సోషలిస్ట్ రాజకీయాల ఆలోచనపరుడిగా పనిచేసాడు.

మండల్ కమీషన్

[మార్చు]

1978 డిసెంబరులో మొరార్జీ దేశాయ్ ఐదుగురు సభ్యులు గల పౌర హక్కుల కమీషన్ వేసాడు దీనిని మండల్ చర్మన్ గా వ్యవహరించాడు. అతని కమిషన్ నివేదిక 1980 డిసెంబరు 31 లో పూర్తయింది. అన్ని ప్రభుత్వ, విద్యా సంస్థలలో ఇతర వెనుకబడిన తరగతుల (ఒ.బి.సి) అభ్యర్థులకు రిజర్వు సీట్లను ఒక నిష్పత్తి ప్రకారం కేటాయించాలని సిపారసు చేసాడు. కమిషన్ నివేదిక ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పరిశీలనలోకి వచ్చింది. కానీ అమలు జరగలేదు. ఒక దశాబ్దం తరువాత ప్రధానమంత్రి విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ఈ సిఫార్సులను ఆమోదించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అతను 1982 ఏప్రిల్ 13 న మరణించాడు. అతని భార్య సీతా మండల్. వారికి ఐదుగురు కుమారులు ఉన్నారు. వారు రవీంద్రనాథ్ యాదవ్, సఛీంద్రనాథ్ యాదవ్, మణీందర్ కుమార్ మండల్, గిరీంద్రనాథ్ మండల్, జ్యోతీంద్రనాథ్ యాదవ్. అతనికి రేనూ సింగ్, వీణా మండల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

భారత ప్రభుత్వం 2001లో అతని గౌరవార్థం ఒక పోస్టల్ స్టాంపును విడుదలచేసింది. 2007లో స్థాపించబడిన ఒక కళాశాలలు "బి.పి.మండల్ ఇంజనీరింగ్ కళాశాల" అని నామకరణం చేసారు.

మూలాలు

[మార్చు]
  1. Jaffrelot, Christophe (2010-01-01). Religion, Caste, and Politics in India (in ఇంగ్లీష్). Primus Books. ISBN 9789380607047.
  2. Religion, Caste, and Politics in India By Christophe Jaffrelot page 475
  3. Witsoe, Jeffrey (2013). Democracy against Development: Lower-Caste Politics and Political Modernity in Postcolonial India. University of Chicago Press. p. 57. ISBN 9780226063508.
  4. "The Mandals belong to the Yadav caste. But in north-eastern Bihar, Yadavs are not poor farmers or cowherds (as Lalu Yadav's family was, and millions still are) but wealthy zamindars".
  5. Witsoe, Jeffrey (2013). Democracy against Development: Lower-Caste Politics and Political Modernity in Postcolonial India. University of Chicago Press. p. 46. ISBN 9780226063508.

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.