మండల్ కమీషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండల్ కమీషన్ కు నేత్రత్వం వహించినబిందేశ్వరి ప్రసాద్ మండల్, (భారత పార్లమెంటేరియన్)

మండల్ కమీషన్ భారతదేశంలో 1979లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం[1] సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించమన్న ఆదేశంతో ఏర్పాటుచేసింది.[2] దానికి భారత పార్లమెంటేరియన్ బి.పి.మండల్ కుల వివక్షను తగ్గించేందుకు   సీట్ రిజర్వేషన్లు, కోటాలు ఏర్పరిచడమనే లక్ష్యాన్ని, సాంఘిక, ఆర్థిక, విద్యాపరమైన 11 సూచికలు ఆధారంగా వెనుకబాటు తనాన్ని మదించే పనిచేసిన ఈ కమిటీకి నేతృత్వం వహించారు. మండల్ కమీషన్ కులం, ఆర్థిక, సామాజిక పారామితులను ఆధారం చేసుకుని 1980 నాటికి భారతదేశ జనాభాలో 52 శాతం ప్రజలను ఓబీసీ ("ఇతర వెనుకబడ్డ కులాలు")లుగా గుర్తించింది. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లోనూ 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమీషన్ సిఫారసు చేసింది. ఈ సిఫారసు ప్రకారం ఈ 27 శాతం కలుపుకుని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీల రిజర్వేషన్లు మొత్తం 49 శాతానికి చేరతాయి.[3][1]

1980 డిసెంబరు 31 నాటికి మండల్ కమీషన్ తమ నివేదిక సమర్పించారు. అప్పటికే నివేదికకు ఆదేశించిన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూలిపోయింది, ఎన్నికల్లో ఇందిరా గాంధీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందిరా గాంధీ, ఆ తర్వాత ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు ఈ నివేదికను ఆమోదించకుండా పక్కనపెట్టారు. 1990 ఆగస్టులో వి.పి.సింగ్ ప్రభుత్వం నివేదికను అమలుచేయడానికి నిర్ణయించుకున్నట్టు ప్రకటించాకా విస్తృతంగా విద్యార్థుల ఆందోళన ప్రారంభమైంది.[4] భారత జనాభాలో 55 శాతం మంది ప్రజలు ఆర్థికంగానూ, సామాజిక నేపథ్యం పరంగానూ వెనుకబడి ఉన్నారని చెప్పిన ఈ నివేదిక మొత్తం పబ్లిక్ సెక్టార్లో ఉన్న 5 శాతం ఉద్యోగాలకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తింపజేస్తోందన్న విషయం భారతీయులకు పెద్ద ఎత్తున తెలిసిరాలేదు.[5] కాంగ్రెస్, బీజేపీ సహా వివిధ ప్రతిపక్ష పార్టీల యువజన విభాగాలు కూడా వ్యతిరేకించి ఆందోళనలు చేసిన పక్షాల్లో ఉన్నాయి. పలువురు విద్యార్థులు ఆందోళనలో భాగంగా ఆత్మహత్యలు చేసుకున్నారు.[6]

సుప్రీంకోర్టు తాత్కాలికంగా నివేదిక అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. 1992లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ నియామకాల్లో ఈ సిఫార్సులు అమలుచేయడంతో వీటి అమలు ప్రారంభమైంది.[7] మండల్ కమీషన్ నివేదిక, దాని అమలు జరగడానికన్నా ముందే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఓబీసీ (అదర్ బాక్ వర్డ్ క్లాసెస్) పేరిట అత్యధిక స్థాయిలో రిజర్వేషన్లు అమలుచేయడం అన్నది జరిగింది. ఉదాహరణకు 1980లో కర్ణాటక రాష్ట్రంలో ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కలిపి) 48 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి, దీనికి తోడు మరో 18 శాతం ఇతర బలహీన వర్గాలకు రిజర్వ్ చేశారు.[8]

మూలాలు[మార్చు]

  1. http://indianexpress.com/article/india/india-others/sunday-story-mandal-commission-report-25-years-later/
  2. Bhattacharya, Amit.
  3. "Mandal commission report - salient features and summary" (PDF). simplydecoded.com. Archived from the original (PDF) on 18 ఫిబ్రవరి 2018. Retrieved 7 February 2018.
  4. "Sunday Story: Mandal Commission report, 25 years later". The Indian Express. Retrieved 18 January 2019.
  5. Mandal commission - original reports (parts 1 and 2) - report of the backward classes commission. New Delhi: National Commission for Backward Classes, Government of India. 1 November 1980. Archived from the original on 27 మార్చి 2019. Retrieved 26 March 2019.
  6. "Mandal commission, 25 years later". The Indian Express. Retrieved 26 March 2019.
  7. "Sunday Story: Mandal Commission report, 25 years later". The India Express. 1 September 2015. Retrieved 26 March 2019.
  8. Part 1 volume 1 of Mandal commission report. Government of India. p. iii.