మంజుల ఘట్టమనేని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మంజుల ఘట్టమనేని (జననం 1970), భారతీయ సినీ నిర్మాత, నటి. ఆమె ఎక్కువగా తెలుగు సినిమాల్లో పనిచేసింది. ప్రముఖ తెలుగు సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ కుమార్తె ఆమె. 1999లో తెలుగు సినిమా  రాజస్థాన్ లో అతిథి పాత్రతో సినిమా నటిగా కెరీర్ మొదలుపెట్టింది  మంజుల. ఆ తరువాత మలయాళంలో సమ్మర్ ఇన్ బెత్లహెం అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. 2002లో ఆమె కథానాయికగా  నటించి, నిర్మించిన షో సినిమాతో మంజుల మరింత ప్రఖ్యాతి పొందింది.  ఈ సినిమాకు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే  పురస్కారలు లభించాయి. ఆమె తల్లి పేరు మీదుగా ఇందిరా ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థ స్థాపించింది మంజుల.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఘట్టమనేని కృష్ణకు, ఇందిరా దేవికి మూడో కుమార్తె ఆమె. ఆమెకు ఇద్దరు సోదరిలు, సోదరులు. ఆమె అన్నయ్య ఘట్టమనేని రమేష్ బాబు సినీ నిర్మాత కాగా, తమ్ముడు ఘట్టమనేని మహేష్ బాబు     ప్రఖ్యా త సినీ నటుడు. మంజుల నిర్మాత, నటుడు అయిన సంజయ్  స్వరూప్ ను వివాహం చేసుకుంది.[1] వారికి ఒక కుమార్తె జాహ్నవి.[2]  మంజుల, ఆమె మరదలు నమ్రతా శిరోద్కర్ మంచి స్నేహితులు అని సినీ జనాలు చెప్పుకుంటారు.[3]

కెరీర్[మార్చు]

ఆర్.కె.సెల్వమణి దర్శకత్వం వహించిన రాజస్థాన్ అనే తెలుగు సినిమాలో టెర్రిరిస్ట్ అతిథి పాత్రతో తెరంగేట్రం చేసింది ఆమె.

మూలాలు[మార్చు]

  1. "Didn't we tell you she's returning!". Entertainment section. The Times of India. 2008-12-16. Retrieved 2009-06-23.
  2. Mahesh Babu, Namratha’s Son – Image. Mahesh Babu, Namratha’s Son – Image. Whatslatest.com. URL accessed on 2012-11-04.
  3. Metro Plus Hyderabad : Smita does the talking. The Hindu: (2009-09-12). URL accessed on 2012-11-04.