Jump to content

నోరి దత్తాత్రేయుడు

వికీపీడియా నుండి
నోరి దత్తాత్రేయుడు
నోరి దత్తాత్రేయుడు
జననంనోరి దత్తాత్రేయుడు
1947 అక్టోబరు 21
కృష్ణా జిల్లా
ఆంధ్ర ప్రదేశ్
India
వృత్తిvaidhyudu
ప్రసిద్ధిసుప్రసిద్ధ భారతీయ వైద్యుడు, రేడియేషన్ ఆంకాలజిస్టు

డా. నోరి దత్తాత్రేయుడు (Dr. Dattatreyudu Nori) సుప్రసిద్ధ భారతీయ వైద్యుడు, రేడియేషన్ ఆంకాలజిస్టు.[1][2] ఇతడు అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆసుపత్రి యందు క్యాన్సర్ విభాగానికి అధికారిగా సేవచేస్తున్నాడు.[3]

తొలినాటి జీవితం

[మార్చు]

దత్తాత్రేయుడు కృష్ణా జిల్లాలో మంటాడ గ్రామంలో 1947 అక్టోబరు 21 న జన్మించాడు.తండ్రిపేరు సత్యనారాయణ. మచిలీపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి, కర్నూలు వైద్య కళాశాలలో వైద్యశాస్త్రంలో పట్టా పొంది, ఆ తర్వాత ఉస్మానియా వైద్య కళాశాలలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశాడు. ఈయన మహిళలలో వచ్చే క్యాన్సర్ వ్యాధులను నయం చేయడంలో సిద్ధహస్తులు. కొన్నేళ్ళ క్రితం దివంగత ఎన్‌.టి.ఆర్. సతీమణి క్యాన్సర్ చికిత్సకు అమెరికా వెళ్లినపుడు అతను చేసిన చిన్న విజ్ఞప్తి హైదరాబాదులో బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్ ఇస్టిట్యూట్ కి జన్మనిచ్చింది. ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉన్న డా.నోరి సంపాదించినదంతా "ఆరోగ్య సంపద"ను పెంచడానికి, అభివృద్ధి చెందడానికి వెచ్చించారు ఈ అంతర్జాజీయ ఆణిముత్యము తెలుగువాడు కావడం మన అందిరికీ గర్వకారణము .

వైద్యుడిగా

[మార్చు]

ఇతని స్వగ్రామం కృష్ణాజిల్లా లోని మంటాడ . 1947 అక్టోబరు 21 న జన్మించారు . తండ్రి సత్యనారాయణ -టీచరుగా పనిచేసాడు .తల్లి కనకదుర్గ - గృహణి . వీరిది చాల పేద కుటుంబం.ఇతని తోబుట్టువులు పది మంది . 5 గురు మగ, 5 గురు ఆడ పిల్లలు . ఇతను అందరికంటే చిన్నవాడు . తను 5 సం.లు వయసున్నప్పుడే తండ్రి చనిపోయాడు .తల్లి సంరక్షణలో 7 వ తరగతి వరకూ బందరులో చదువుకున్నాడు. పి.యు.సి, బి.యస్.సి - ఆంధ్ర జాతీయ కళాశాలలోను, 1965 - 1971 వరకు ఎంబిబిఎస్ కర్నూలు వైద్యకళాశాలలోను, 1976 లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండి. పూర్తి చేసాడు . పెద్దమ్మ జొన్నలగడ్డ సుందరమ్మ సహాయంతో అతని చదువంతా సాగింది . నెలనెలా డబ్బులు సాయం చేసేవారు .

ఫిబ్రవరి 1972 నుండి, ఫిబ్రవరి 1973 వరకూ గాంధీ ఆసుపత్రి లోపనిచేసాడు . 1973 నుండి 1976 వరకు హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న రేడియం ఇన్స్టిట్యూట్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్ లో రెసిడెంట్ గా పనిచేసాడు. అనంతరం అమెరికా వెళ్ళాడు . ఇతనికి మొదటి నుండి క్యాన్సర్ వైద్యంలో ఏదో చేయాలని తపన ఉండేది . అందుకే ఈ విభాగంలో నూతన విధానాలు కనిపెట్టడానికి కృషిచేసాడు . తన కృషిలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా లెక్కచేయకుండా విజయం కోసం తపించారు . అందుకే ఈస్థితికి చేరుకున్నాడు . క్యాన్సర్ వ్యాధికి సంబంధించి 4 పుస్తకాలు, 200 పైగా పేపర్లు రాసారు .

గౌరవాలు - పురస్కారాలు

[మార్చు]
  • 1962 లో ప్రీ-యూనివర్సిటీలో చదివేటపుడు, 1965 లో బి.యస్ .సి చదివేటపుడు, ఉస్మానియాలో ఎం.డి. చేసినపుడు అత్యధిక మార్కులు రావడంతో మెరిట్ స్కాలర్ షిప్ ఇచ్చారు .
  • 1984 లో అమెరికన్‌ క్యాన్సర్ సొసైటీవారు క్లినికల్ పెలోషిప్ ఫ్యాకల్టీ అవార్డ్ ఇచ్చారు . 1990 లో అమెరికన్‌ కాలేజీ ఆఫ్ రేడియేషన్‌ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు . 1994 లో అలుమిని సొసైటీ, మెమోరియల్ స్లాన్‌-కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ డిస్టింగ్విష్డ్ అలునినస్ అవార్డ్ అందుకున్నాడు .
  • 2000 లో ఇప్పటి వరకు కాస్టల్ అండ్ కానల్లే పబ్లికేషన్ వారి అమెరికా బెస్ట్ డాక్టర్, లేడీస్ హోం జర్నల్ నిర్వహించే సర్వేలో మహిళల క్యాన్సర్ నివారణలో ఉత్తమ డాక్టర్ గా ఎంపికయ్యాడు.
  • 1995 లో ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ గోల్డ్ మెడల్ అందుకున్నాడు .
  • 2003 లో అమెరికన్‌ కాలేజి ఆఫ్ రేడియేషన్‌ అంకాలజీ ఫెలోషిప్ అందుకున్నాడు .
  • బసవతారక క్యాన్స్ ర్ ఇనిస్టిట్యూట్ నిర్మాణము అప్పటి ముఖ్యమంత్రి యన్‌.టి.రామారావు గారి సహాయ సహకారాలతో జరిగింది . ఎన్‌టీ రామారావు భార్య బసవ తారకానికి క్యాన్సర్ సోకడంతో ఆమెను అమెరికాలో ఉన్న దత్తాత్రేయుడు దగ్గరకు తీసుకువెళ్లారు. చికిత్స జరిగి బాగు అయిన కొన్నాళ్ళు బ్రతికింది. అంతకు ముందే దత్తాత్రేయుడికి ఆంధ్రప్రదేశ్ లో ఒక క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించాలనే ఉద్దేశం ఉండడం ... దానికి తోడు ముఖ్యమంత్రిని అడగడం జరిగిన పిమ్మట ప్రభుత్వం 7 ఎకరాల భూమిని హైదరాబాద్ లో ఇవ్వడం, కొంతమంది అమెరికా తెలుగు వారి చందాలతోను, ప్రభుత్వ ఆర్థిక సాయంతో 200 పడకల ఆసుపత్రితో అన్ని నూతన వైద్య పరికరాలతో " బసవతారకం ఇండో-అమెరికన్‌ కాన్సర్ ఇన్స్టిట్యూట్ " నిర్మాణం జరిగి ఫెలోషిప్ కోర్సులను కూడా ప్రారంభించడం జరిగింది.
  • గత 50 సంవత్సరాలలో అమెరికాలోని క్యాన్సర్ వ్యాధులకు అందిస్తున్న ఉన్నత సేవలకు గాను అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఇతనికి "ట్రిబ్యూట్ టు లైఫ్" అనే గౌరవాన్ని బహూకరించింది.
  • భారత ప్రభుత్వం ఇతడు అందించిన వైద్యసేవలకు పద్మశ్రీ పురస్కారం 2015 లో ప్రదానం చేసింది.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

భార్య: సుభద్ర .. ఈమె కూడా డాక్టర్ కావడం వల్ల అన్నివిధాలా సహకారం అందేదని అంటారు . వీరికి ఇద్దరు పిల్లలు .అబ్బాయి - సంతోష్ న్యాయవాది, అమ్మాయి డాక్టర్ .

వైద్యసేవలో

[మార్చు]

డా. నోరి ప్రపంచం లోనే బ్రాకీథిరపీ (brachytherapy) అనే వైద్యప్రక్రియలో అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఇతడు ఈ ప్రక్రియను 1979 నుండి ఉపయోగిస్తూ, వైద్యపరిశోధన మీద దృష్టి యుంచి దీనిని అభివృద్ధిచేసి, ఎందరో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు నయం చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. http://timesofindia.indiatimes.com/india/Sonia-goes-abroad-for-surgery-Rahul-steps-up/articleshow/9483496.cms
  2. http://www.telegraphindia.com/1110805/jsp/frontpage/story_14337290.jsp
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-06. Retrieved 2013-05-08.
  4. "Padma Awards 2015". Press Information Bureau. Archived from the original on 26 జనవరి 2015. Retrieved 25 January 2015.

బయటి లింకులు

[మార్చు]