అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం
స్వరూపం
అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం | |
---|---|
అధికారిక పేరు | అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం |
జరుపుకొనేవారు | యునెస్కో |
ప్రారంభం | 2015 |
జరుపుకొనే రోజు | సెప్టెంబరు 28 |
ఉత్సవాలు | యునెస్కో |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదే రోజు |
అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం సెప్టెంబరు 28న నిర్వహించాలని యునెస్కో ద్వారా నిర్ణయించబడింది. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచడంకోసం ఈ ఉద్యమం ప్రారంభించబడింది. సమాచార హక్కు చట్టం ప్రభుత్వ విధానాల్లో, ప్రభుత్వ సంస్ధలు పనిచేస్తున్న పద్ధతుల్లో పారదర్శకతను పెంచడానికి ఉద్దేశించినది. భారతదేశంలో 2005లో సమాచార హక్కు చట్టం ఏర్పడింది.[1]
ప్రారంభం
[మార్చు]2015 నవంబరులో ప్రారంభించబడిన ఈ దినోత్సవం 2016, సెప్టెంబరు 28న మొదటిసారిగా నిర్వహించడం జరిగింది. 2002 సెప్టెంబరులో బల్గేరియా రాజధాని సోఫియాలో అంతర్జాతీయ హక్కు దినోత్సవంగా గుర్తింపు పొంది, అంతర్జాతీయ పౌర సమాజ న్యాయవాదులచే 2012లో మొదలయింది.[2]
కార్యక్రమాలు
[మార్చు]సెప్టెంబరు 28వ తేదీన అంతర్జాతీయంగా ఈ దినోత్సవాన్ని జరుపుతూ, ప్రభుత్వ ఆశయాన్ని గురించి ప్రచారం చేయడం జరుగుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ ప్రజాశక్తి, నెల్లూరు (27 September 2018). "ధైర్యంగా ప్రశ్నించండి". Archived from the original on 28 September 2018. Retrieved 28 September 2018.
- ↑ "UNESCO Names Sept. 28 Access to Information Day". freedominfo.org. 17 November 2015. Archived from the original on 14 ఏప్రిల్ 2020. Retrieved 28 September 2018.