గ్వాంగ్ఝౌ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్
గ్వాంగ్ఝౌ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ | |
---|---|
广州国际金融中心 | |
సాధారణ సమాచారం | |
స్థితి | పూర్తయింది |
రకం | హోటల్ ఆఫీసులు |
ప్రదేశం | 5 జుజియాంగ్ పశ్చిమ అవెన్యూ జుజియాంగ్ న్యూ టౌన్, టియాన్హే జిల్లా, గ్వాంగ్ఝౌ, చైనా |
భౌగోళికాంశాలు | 23°7′13.25″N 113°19′5.07″E / 23.1203472°N 113.3180750°E |
నిర్మాణ ప్రారంభం | December 2005 |
పూర్తి చేయబడినది | 2010 |
ప్రారంభం | 2010 |
వ్యయం | GB£280 మిలియన్లు [1] |
ఎత్తు | |
నిర్మాణం ఎత్తు | 438.6 మీ. (1,439 అ.) |
పైకప్పు | 437.5 మీ. (1,435 అ.) |
పైకప్పు నేల | 415.1 మీ. (1,362 అ.) |
పరిశీలనా కేంద్రం | 415.1 మీ. (1,362 అ.) |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | 103 4 భూగర్భంలో |
నేల వైశాల్యం | 250,095 మీ2 (2,692,000 sq ft) |
లిఫ్టులు / ఎలివేటర్లు | 71 |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | విల్కింసనైర్ |
నిర్మాణ ఇంజనీర్ | అరుప్ గ్రూప్ లిమిటెడ్ సౌత్ చైనా యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ లోని ఆర్కిటెక్చర్ డిజైన్ ఇన్స్టిట్యూట్ |
ప్రధాన కాంట్రాక్టర్ | చైనా రాష్ట్రీయ నిర్మాణ సంస్థ గ్వాంగ్ఝౌ మున్సిపల్ కన్స్ట్రక్షన్ గ్రూప్ జెవి |
ఇతర విషయములు | |
గదుల సంఖ్య | 374 |
గ్వాంగ్ఝౌ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ లేదా గ్వాంగ్ఝౌ వెస్ట్ టవర్, గ్వాంగ్ఝౌలోని టియాన్హే జిల్లాలో ఉన్నటువంటి ఒక ఆకాశహర్మ్యం. ఇది 438.6 మీటర్ల ఎత్తుతో 103 అంతస్తులను కలిగి ఉంటుంది.[2][3] గ్వాంగ్జో ట్విన్ టవరు నిర్మాణం 2010 లో పూర్తయింది, ఆ సమయంలో ఇది ప్రపంచంలోనే 17 వ ఎత్తైన భవనం. 2018 మార్చి 2018 నాటికి, ఇది 439 మీ (1,439 అడుగులు) ఎత్తున పైకప్పు పైన హెలిపాడ్ తో ఉన్నటువంటి భవనాలలో ప్రపంచంలోని ఎత్తైనది.[4] పైకప్పుపై హెలిపాడ్తో ప్రపంచంలోని రెండో ఎత్తైన భవనం కూడా 2010 లో పూర్తయింది. అది బీజింగ్ లోని చైనా వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ III, దీని పైకప్పుపై హెలిపాడ్ 330 మీ (1,083 అడుగులు) ఎత్తులో ఉంటుంది.[5] ఈ రెండు భవనాలు 1989 నుండి 2010 వరకు రికార్డును కలిగున్న యు.ఎస్. బ్యాంక్ టవరు కన్నా పొడవుగా ఉన్నాయి, దీని పైకప్పుపై టాప్ హెలిపాడ్ 310.3 మీ (1,018 అడుగుల) ఎత్తులో ఉండేది.
విల్కిన్సన్ ఎయ్రేర్ చే రూపొందించబడిన ఈ భవనం నిర్మాణం, డిసెంబరు 2005 లో మొదలై 2010 లో పూర్తయింది. ఈ భవనాన్ని కాన్ఫరెన్స్ సెంటర్, హోటల్, కార్యాలయ భవనాలకు ఉపయోగిస్తున్నారు. 1 నుండి 66 అంతస్తులలో కార్యాలయాలకు ఉపయోగించబడుతున్నాయి, యాంత్రిక పరికరాలు కోసం 67, 68 అంతస్తులను, 70 నుంచి 98 అంతస్తుల వరకు ఫోర్ సీజన్స్ హోటల్ను 70 వ అంతస్తులో ఉన్న లాబీతో ఉన్నవి, 99, 100 అంతస్తులను పరిశీలన డెక్ కోసం వినియోగిస్తున్నారు.
ఈ భవనాన్ని గతంలో గువాంగ్జు వెస్ట్ టవర్ అని పిలిచేవారు, దీనికి సంబంధించిన ప్రాజక్టు ప్రతిపాదిత గుయంజౌ ఈస్ట్ టవర్ గా ఉన్నది, అది 475 మీ (1,558 అడుగుల) ఎత్తు ఉండెది, [6] కానీ ఈ ప్రాజెక్టును కోహ్న్ పెడెర్సెన్ ఫాక్స్, 530 మీ (1,740 అడుగులు) ఎత్తుతో చౌ తాయ్ ఫూక్ సెంటర్ గా వేరొక రూపకల్పన చేశారు.[7]
ఈ భవనం రిభా 2012 లుబెట్కిన్ బహుమతి విజేత.[8]
-
లాబీ
-
ఫోర్ సీజన్స్ హోటల్ లాబీ
-
ఆఫీసు లాబీ
-
బేస్మెంట్ ఆర్కేడ్
మూలాలు
[మార్చు]- ↑ "Guangzhou Four Seasons Hotel". Wilkinson Eyre. Archived from the original on 15 అక్టోబరు 2014. Retrieved 6 May 2013.
- ↑ "Guangzhou International Finance Centre : Projects : WilkinsonEyre.Architects". Wilkinson Eyre. Archived from the original on 15 అక్టోబరు 2014. Retrieved 15 June 2010.
- ↑ "Guangzhou International Finance Center". Wilkinson Eyre. Archived from the original on 9 జనవరి 2015. Retrieved 6 May 2013.
- ↑ "Tall Buildings in Numbers: Tallest Helipads". CTBUH Journal, 2014 Issue II, page 48. The Council on Tall Buildings and Urban Habitat. Retrieved 28 March 2018.
- ↑ pinnacleadmin (21 October 2015). "The World's Highest Helipads". ThorTech.com. Retrieved 28 March 2018.
- ↑ "Guangzhou East Tower : Projects". Wilkinson Eyre. Archived from the original on 18 జూలై 2011. Retrieved 15 June 2010.
- ↑ "Chow Tai Fook Centre, Guangzhou". SkyscraperPage. Retrieved 19 June 2010.
- ↑ "Guangzhou International Finance Centre in China wins 2012 RIBA Lubetkin Prize". Architecture. Retrieved 6 November 2012.[permanent dead link]