ముక్తా శ్రీనివాసన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముక్తా శ్రీనివాసన్
జననం
వెంకటాచారి శ్రీనివాసన్

(1929-10-31)1929 అక్టోబరు 31
మాలపురం, తంజావూర్ జిల్లా, తమిళనాడు
మరణం2018 మే 29
జాతీయతభారతీయుడు
విద్యఎస్.ఎస్.ఎల్.సి., హిందీ విశారద
వృత్తిసినిమా నిర్మాత, దర్శకుడు
జీవిత భాగస్వామిప్రేమ
పిల్లలుఎస్.రవి, ముక్తా ఎస్.సుందర్, మాయా
తల్లిదండ్రులువెంకటాచారియర్, చెల్లమ్మాల్[1]

ముక్తా శ్రీనివాసన్ భారతీయ సినిమా నిర్మాత, దర్శకుడు.[2] ముక్తా ఫిలిమ్స్ పతాకంపై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 67కు పైగా చిత్రాలను నిర్మించాడు. అతను నిర్మించిన ‘నాయకన్’ చిత్రం భారత్ నుంచి తొలిసారి ఆస్కార్‌కు నామినేట్ అయి చరిత్ర సృష్టించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

అతను తమిళనాడు లోని మలపురంలో 1929 అక్టోబరు 31న తమిళ బ్రాహ్మణ కుటుంబంలో వెంకటాచారియర్, చెల్లమ్మ దంపతులకు జన్మించాడు. అతను జీవిత పర్యంతం బ్రాహ్మణ సంప్రదాయాలను అనుసరించాడు. అతను శాకాహారి. అతను 2018 మే 29 న చెన్నైలోని టి.నగర్ లో గల తన నివాసంలో మరణించాడు. అతనికి భార్య , పిల్లలు ఉన్నారు. బాలచందర్‌, మణిరత్నం​ వంటి ప్రముఖ దర్శకులు ఆయన వద్ద శిష్యరికం చేసినవారే కావడం విశేషం.

జీవిత విశేషాలు[మార్చు]

అతను 1947లో సినిమా పరిశ్రమలోనికి టి.ఆర్.సుందరం వద్ద సీనియర్ అసిస్టెంటుగా చేరి తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అతను నటులకు సంభాషణలపై శిక్షణ నిచ్చేవాడు. సాంకేతిక సహాయకునిగా అతను "మంత్రి కుమారి" సినిమాలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి, ఎం.జి.రామచంద్రన్ లతో పనిచేసాడు. ఆ కాలంలో ప్రధాన కళాకారులైన టి.ఆర్. మహలింగం, అంజలీదేవి, మాధురీదేవి, సుందరం బాలచందర్, ఎల్.వి.ప్రసాద్ వంటి వారితో కలసి పనిచేసాడు. అతను దర్శడుకు కె.రామనాధ్ కు సహాయకునిగా పనిచేసాడు.

అతను 1957లో "ముదాలాలి" సినిమా ద్వారా దర్శకత్వ భాద్యతలను చేపట్టాడు. ఆ సినిమా రత్న స్టుడియోస్ చే నిర్మించబడినది. సాధారణంగా ఆ కాలంలో ఒక సినిమాను ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు నిర్మిస్తున్న కాలంలో ఈ సినిమాను నాలుగు నెలల మూడు రోజులలో పూర్తిచేసాడు.[3] ఈ సినిమా విజయం సాధించింది. ఆ సినిమాకు జాతీయ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ అప్పటి ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ సమక్షంలో అందజేసారు. అతను తన అన్నయ్య ముక్తా వి.రామస్వామితో కలసి సినిమా నిర్మాణ బాద్యతను 1961లో ముక్తా ఫిలిం బ్యానర్ పై చేపట్టాడు.[4] అతను ఎల్లప్పుడూ విశ్వనాథ రామమూర్తి లేదా ఎం. ఎస్. విశ్వనాథన్ సంగీతానికి మాత్రమే ప్రాథాన్యతనిచ్చేవాడు.

అతను 1960లలో కథానాయకునిగా మొదటి ఎంపికగా జెమినీ గణేశన్ తో ఎల్లప్పుడూ చిత్రాలను నిర్మించేవాడు.పనిథిరాయి, ఇదయతిల్ ని, పూజైక్కు వందా మలార్, తెన్మంజయ్ చిత్రాలలి జెమినీ గణేశన్ దర్శకత్వం వహించాడు. శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన తిన్మజ్‌హాయ్, నింద్రవాల్, బొమ్మలట్టం, అయిరాం పోయి చిత్రాలకు తమిళ చిత్రసీమలో మైలురాయిగా నిలిచాయి. అతను జెమినీ గణేశన్, సావిత్రి ల జంటగా సంధ్యతో కలసి "పూజైక్కి వందా మలార్" చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇది బాక్స్ ఆఫీస్ హిట్ అయింది. సంధ్య కుమార్తె జె.జయలలిత నటించిన సూర్యగంధి, అంబయ్ తేడి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. "సినిమా పైథియం" సినిమాలో అతిథి పాత్రలో ఆమెచే నటింపజేసాడు. అతను దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలలో "సూర్యగంధి" విశేష చిత్రంగా గుర్తింపబడింది. ఈ చిత్రం సెప్టెంబరు 2016లో డిజిటలైజ్ చేయబడి మరలా విడుదలైంది.[5]

అతను "వాలి" (టి.ఎస్.రంగరాజన్) ను కథా రచయితగా, దేవిక, దీపికలతో పాటు మరి కొందరిని సినీపరిశ్రమకు పరిచయం చేసాడు.

అతను శివాజీ గణేషన్ చిత్రాలైన నిరై కుడం, అరుణోదయం, తవ పుదల్వాన్, అంబై తేడి, అండమాన్ కదలి, ఇమాయం, కీజ్ వానం సివక్కుం, ఇరు మెధైగల్ లకు దర్శకత్వం చేసాడు. శివాజీ గణేషన్ 11 చిత్రాలకు అతను దర్శకత్వం చేసాడు. కమలహాసన్ చిత్రాలు అందరంగం, శిమ్లా స్పెషల్ లకు, రజనీకాంత్ చిత్రం పొల్లదవన్ (1980 సినిమా) లకు దర్శకత్వం చేసాడు. అతను దర్శకత్వం వహించిన 45 సినిమాలలో 30 చిత్రాలు బాక్సాఫీస్ లో విజయం సాధించాయి. అతని దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలలో చోరామస్వామి,నీలు, మనోరమ నటించారు. అతను 1987లో నాయకన్ చిత్రాన్ని నిర్మించాడు. అతను నిర్మించిన 27 చిత్రాలలో 20 చిత్రాలు కమెర్షియల్ గా విజయం సాధించాయి. అతను 2018లో నిర్మించిన 28వ, ఆఖరి చిత్రం "వేదాంత దేసిగర్" అతను మరణం వరకు విడుదల కాలేదు.

అతను "అంధ నాల్" చిత్రంలో సుందరం బాలచందర్ కు సహాయం చేసాడు. ఈ చిత్రం మద్రాసులో నిర్మించబడినది. ఇది పాటలు లేని మొదటి చిత్రంగా గుర్తింపు పొందింది. విజయం సాధించింది.[6]

అతను "తమిళ సినిమా నిర్మాతల కౌన్సిల్" కు వ్యవస్థాపకుడు, అధ్యక్షుడుగా ఉన్నాడు.[7] అతను సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు అధ్యక్షునిగా తన సేవలనందించాడు.[8] తమిళనాడు ప్రభుత్వ ఫిలిం సిటీ కి చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.[9] అతను ఫిలిం అవార్డుల కమిటీలకు, ఫిలిం సెన్సార్ బోర్డు కు సభ్యునిగా ఉన్నాడు.[10]

అతని అన్నయ్య ముక్తా రామస్వామి, సోదరి రేవతి. అతను 1951లో ప్రేమను వివాహమాడాడు. వారికి ముగ్గురు పిల్లలు. వారు ఎస్.సుందర్, ముక్తా రవి, మాయ. అతను 2018 మే 29 న చెన్నైలోని టి.నగర్ లోని తన నివసంలో మరణించాడు.

పురస్కారాలు[మార్చు]

  • "ముదలాలి" చిత్రం: జాతీయ పురస్కార గ్రహీత[11]
  • తమిళనాడు ప్రభుత్వంచే 1977-78 లో ఉత్తమ చిత్రంగా "బాలపరిచయ్"
  • "అవన్-అవల్-అదు" చిత్రానికి రాష్ట్ర ఉత్తమ చిత్రం.
  • "కేజ్ వనం శివక్కుమ్" కు 1981-82 సంవత్సర రాష్ట్ర ఉత్తమ చిత్రం .
  • 1982-83 : "పరిచ్చయిక్కు నెరెమ్మచు" చిత్రానికి తమిళనాడు ఉత్తమ దర్శకుని పురస్కారం.

మూలాలు[మార్చు]

  1. http://cinema.maalaimalar.com/2013/11/10213205/muktha-srinivasan-cinema-histo.html
  2. "Tamil Nadu / Chennai News : A celebrated veteran of the south Indian film industry. He expired on 29/05/2018". Chennai, India: The Hindu. 2007-04-15. Archived from the original on 2007-04-17. Retrieved 2012-11-14.
  3. [1][dead link]
  4. http://www.kalyanamalaimagazine.com/Content/Thiraichuvai/Nov10_1_15/Potpourri_of_titbits_about_Tamil_cinema_Mukta_Srinivasan_page1.html
  5. http://www.newindianexpress.com/entertainment/tamil/2016/aug/17/Suriyagandhi-An-old-classic-gets-new-life-1509952.html
  6. "Cinema Plus / Columns : Andha Naal 1954". Chennai, India: The Hindu. 2008-12-12. Archived from the original on 2008-12-18. Retrieved 2012-11-14.
  7. "A celebrated veteran of the south Indian film industry". The Hindu. Chennai, India. 15 April 2007. Archived from the original on 17 ఏప్రిల్ 2007. Retrieved 30 మే 2018.
  8. "ఆర్కైవ్ నకలు". The Hindu. Chennai, India. 22 July 2001. Archived from the original on 11 నవంబరు 2013. Retrieved 30 మే 2018.
  9. http://expressindia.indianexpress.com/ie/weekly/19961230/MAY/mad08may.htm#Film
  10. "Front Page : Censor Board reconstituted". Chennai, India: The Hindu. 9 February 2005. Archived from the original on 2005-02-11. Retrieved 2012-11-14.
  11. <http://iffi.nic.in/Dff2011/Frm5thNFAAward.aspx?PdfName=5NFA.pdf/ Archived 2016-03-04 at the Wayback Machine>

బయటి లంకెలు[మార్చు]