దీప శశింద్రన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దీప శశింద్రన్
Deepa Sashindran kuchipudi.jpg
జననం దీప నారాయణన్ నాయర్
03 జులై, 1974
బెంగళూరు
నివాసం బెంగళూరు
జాతీయత భారతదేశం
జాతి కేరళ
పౌరసత్వం భారతీయురాలు
చదువు బి.ఎ.ఎల్, ఎల్.ఎల్.బి, పిజిడి-ఐ.ఆర్.పి.ఎం
విద్యాసంస్థలు బెంగళూరు విశ్వవిద్యాలయం
వృత్తి నృత్య కళాకారిణి, నృత్య దర్శకురాలు
క్రియాశీలక సంవత్సరాలు 3 దశాబ్దాలు
ప్రసిద్ధులు కూచిపూడి నృత్య కళాకారిణి
మతం హిందూ
జీవిత భాగస్వామి శశింద్రన్
పిల్లలు 2 (కొడుకు, కూతురు)
తల్లిదండ్రులు నారాయణన్ నాయర్
శ్రీదేవి
వెబ్ సైటు www.deepasashindran.com

దీప శశింద్రన్ (జననం 3 జులై 1974) భారతదేశానికి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, నృత్య దర్శకురాలు. ఆమె ప్రముఖ కూచిపూడి గురువు మంజు భార్గవికి శిష్యురాలు. దీప కూచిపూడి గురువు, కళా ప్రేరకురాలు మాత్రమే కాదు, ఆమె ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త.[1][2][3][4][5][6]

ఐదవ ఏట నుండీ కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్న దీప, 1994లో అరంగేట్రం చేసింది.[7] ఉత్తమ కూచిపూడి ఆర్టిస్ట్ యువ రంగ [8], నృత్య శిరోమణి జాతీయ పురస్కారం[9], సత్యభామ ఎక్సెలెన్స్ పురస్కారం[10], నృత్య విలాసిని [11] వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకుంది.

తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం[మార్చు]

దీప, తన ఐదవ ఏటనే భరతనాట్యం అభ్యాసం మొదలుపెట్టింది. కళామండలం ఉష దత్తార్, డాక్టర్ సావిత్రి రామయ్య వంటి ప్రముఖ గురువుల వద్ద నాట్యం నేర్చుకుంది. ఆమె, ఎనిమిదవ ఏట ప్రముఖ కూచిపూడి కళాకారిణి, గురువు మంజు భార్గవి దగ్గర నాట్యాభ్యాసం మొదలు పెట్టింది. ఆమె వద్ద దాదాపు 30 ఏళ్ళ పాటు శిక్షణ తీసుకుంది దీప. ప్రస్తుతం వెంపటి రవిశంకర్ వద్ద అభ్యాసం చేస్తోంది.[12][13]

కెరీర్[మార్చు]

దీప, భారతదేశంలోనూ, విదేశాల్లోనూ ఎన్నో సోలో ప్రదర్శనలు ఇచ్చింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన వేదికలపై, ఉత్సవాలలో, సందర్భాలలో ఆమె ఇచ్చిన ప్రదర్శనలకు ప్రశంసలు కూడా లభించాయి. సోలో ప్రదర్శనలే కాక, నృత్య రూపకాల్లో ప్రధాన పాత్రలు కూడా పోషించింది. ఆమె, తన గురువు కలసి వేలకొలది ప్రదర్శనలిచ్చి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు.[14] దీప నృత్య భంగిమ ఫోటోలను తమ రాష్ట్ర కూచిపూడి పాఠ్యగ్రంధంలో ప్రచురించింది కర్ణాటక కూచిపూడి పాఠ్యగ్రంధ కమిటీ.[15][16] సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో ఉత్తర అమెరికాలో, హోస్టన్-టెక్సాస్ లో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమావేశానికి ఆమెకు ప్రత్యేక ఆహ్వానం లభించింది. అంతేకాక, ఆ వేదికపై ఆమె పేపర్ ప్రజంటేషన్, సోలో ప్రదర్శనలు కూడా ఇచ్చింది.[17][18][19]

దీప కూచిపూడి పరంపర ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి, బెంగళూరులో కూచిపూడి నాట్యంలో శిక్షణ, ప్రచారం, వ్యాప్తి విషయంలో విశేష కృషి చేస్తోంది. ఈ సంస్థకు సలహాదారులతో ఒక ప్రత్యేక కమిటీ ఉండటం విశేషం. కొత్తగా ఈ సంస్థ కోళికోడ్ లోని స్వాతి తిరునాల్ అకాడమీలో శ్రీ కైత్పురం దామోదరన్ నంబూద్రి గురువుగా మాస్టర్ క్లాసులు నిర్వహించడం ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా దీప, బెంగళూరులోని నృత్య కళాకారులకు ఎన్నదగిన సేవలు చేస్తోంది.[20] వినూత్న నృత్య ఉత్సవాలు, వర్క్ షాప్ లు, నృత్య రీతులను ప్రోత్సహించడంలో దీప కృషి చెప్పుకోతగ్గది. ప్రస్తుతం బెంగుళూరులో ఇలాంటి వినూత్న కార్యక్రమాలకు ఆదరణ బాగా పెరుగుతోంది.[21][22][23][24][25][26]

ఆమెను యువరంగ సంస్థ వారు కర్ణాటక ఉత్తమ కూచిపూడి కళాకారిణి పురస్కారంతో సత్కరించారు. అలాగే కటక్ లో నృత్య శిరోమణి జాతీయ పురస్కారం అందుకుంది. విశాఖపట్టణంలో ప్రముఖ కూచిపూడి కళాకారిణి శోభానాయుడు దీపకు సత్యభామ పురస్కారం ఇచ్చి గౌరవించింది. 1995లో ఆమె దూరదర్శన్ లో కళాకారిణిగా పనిచేసింది.[27][28][29]

దీప నృత్య కళాకారిణి మాత్రమే కాదు, ఆమె న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసింది. పారిశ్రామిక సంబంధాలు, వ్యక్తిగత నిర్వహణలో ఆమె పిజిడి చేసింది. అంతేకాక, దీప సాఫ్ట్ వేర్ రంగంలో మానవ వనరుల నిపుణురాలు. ఆమె మానవ పెట్టుబడి నిర్వహణ సేవలో యువ పారిశ్రామికవేత్త కూడా. ప్రస్తుతం దీప కర్మ క్రియేటర్స్(Karma Kreators) అనే కంపెనీని నడుపుతోంది.[30][31][32]

మూలాలు[మార్చు]

 1. News The Hindu - 22 August 2014
 2. Website Narthaki
 3. Website Thiraseela
 4. Official Website
 5. Government of India - CCRTIndia - Profile
 6. Website High Beam
 7. Official Website Events
 8. Official Website Awards
 9. Official Website Awards
 10. Official Website Awards
 11. Official Website Awards
 12. News The Hindu - 22 August 2014
 13. Official Website
 14. Official Website
 15. Website Thiraseela
 16. Official Website
 17. Website Thiraseela
 18. Official Website
 19. Government of India - CCRTIndia - Profile
 20. Official Website
 21. Government of India - CCRTIndia - Profile
 22. News Deccan Herald - 17 May 2012
 23. Website Thiraseela
 24. Official Website
 25. Website Celebrity Portal
 26. This Week Bangalore News
 27. Government of India - CCRTIndia - Profile
 28. Website Thiraseela
 29. Official Website
 30. Website Thiraseela
 31. Official Website
 32. Government of India - CCRTIndia - Profile