శామ్యూల్ బెకెట్
శామ్యూల్ బెకెట్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | Samuel Barclay Beckett 1906 ఏప్రిల్ 13 Foxrock, Dublin, Ireland |
మరణం | 1989 డిసెంబరు 22 Paris, France | (వయసు 83)
కలం పేరు | Andrew Belis[1] |
వృత్తి | Novelist, playwright, poet, theatre director, essayist, literary translator |
జాతీయత | Irish |
పూర్వవిద్యార్థి | Trinity College Dublin |
రచనా రంగం | Drama, fiction, poetry, screenplays, personal correspondence[2] |
సాహిత్య ఉద్యమం | Theatre of the Absurd |
గుర్తింపునిచ్చిన రచనలు | Murphy (1938) Molloy (1951) Malone Dies (1951) The Unnamable (1953) Waiting for Godot (1953) Watt (1953) Endgame (1957) Krapp's Last Tape (1958) How It Is (1961) |
పురస్కారాలు | Nobel Prize in Literature 1969 Croix de Guerre 1945 |
చురుకుగా పనిచేసిన సంవత్సరాలు | 1929–1989 |
జీవిత భాగస్వామి | Suzanne Dechevaux-Dumesnil (1961–1989; her death) |
సంతకం |
ఈయన సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన ఒక ఐరిష్ కవి, నాటకకర్త. బెకెట్ 1906 ఏప్రిల్ 13వ తేదీన డబ్లిన్ లో జన్మించాడు. ఈయన్ తండ్రి క్వాంటిటీ సర్వేయర్ గాపనిచేసారు.
రచనలు-జీవిత విశేషాలు
[మార్చు]బెకెట్ మొట్టమొదటి పుస్తకం """హోరోస్కోప్""" అనే కవితను 1930లో ప్రచురించారు. తరువాత పెక్కుతక్కిన పుస్తకాలు ప్రచురించారు.ఏడు సం.తరువాత ఆయన పెక్కు మేధావులను ఆకర్షించిన, మేధావుల కేంద్రమైన పారిస్ నగరానికి బస మార్చారు. అక్కడ ఆయనపై ఐరిష్ జాతి వాడయిన మరొక మహారచయిత జేంస్ జాయ్స్ ప్రభావం పడింది. ఆయన జేంస్ జాయ్స్ కు కొంతకాలం సెక్రటరీగా పనిచేశారు. జేంస్ జాయ్స్ కుమార్తె లూషియాతో బకెట్ కు వివాహం కూడా ఏర్పాటు ఏర్పాటు అయినది. కాని, వివాహం జరుగలేదు. సుప్రసిద్ధ ఫ్రెంచినవలాకారుడు రాబర్ట్ ఫ్రాస్ట్ గురుంచి బెకెట్ విమర్శనా గ్రంధము కూడా వ్రాశాడు.
1945కల్లా బెకెట్ ఫ్రెంచి భాషలో రచనలు చేయడం మొదలు పెట్టాడు.వాటిని తనే ఆంగ్లభాషలోనికి అనువదించారు. అప్పుడే జేంస్ జాయ్స్ రచనలను కూడా ఆంగ్లీకరించాడు.ఆయనను ప్రపంచ విఖ్యాతుడిని చేసిన ప్రధానమయిన రచన """వెయిటింగ్ ఫర్ గోడెట్""" అనే రూపకం. దీనిని బెకెట్ ఫ్రెంచి భాషలో ఒక్క నెలలో వ్రాశారు. 1952లో దీనిని ఆంగ్లం లోనికి అనువదించారు.20సం.కుపైగా అంతగా పేరుకురాని కవి, నవలా రచయిత అయిన బెకెట్ కు ఈ రూపకం ఒక్కసారిగా అపారమయిన కీర్తి ప్రతిష్ఠలు సంతరించిపెట్టింది. 'ఓహ్, ది గుడ్ డేస్', 'ఎండ్ గేమ్', 'ఆల్ దట్ ఫాల్', 'మెలోన్ డేస్', 'ది అన్ నేమబల్', 'వాట్ దట్ ఈజ్', 'ద లాస్ట్ ఒంస్' అనేవి ఈయన ప్రసిద్ధి రచనలలో కొన్ని.
మానవుని పతనం, కష్టాలు, ఒంటరితనం, నిరాశ బెకెట్ రచనలలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. బెకెట్ ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయంలో ఫ్రాంస్ లోనే ఉండి, అనాక్రాంతమండలంలో 1942సం. నుండి 1944 వరకు నివసించారు. జీన్-పాల్ సార్ట్రే లాగా బెకెట్ తన తర్వాత రచనలలో అల్లరిచిల్లరి దేశదిమ్మరి వారినికూడా చిత్రించారు. ఒక దిమ్మరి బెకెట్ ను పారిస్ లో కత్తితో పొడిచాడు కూడా. ఆస్ప్రత్తిలో చేరి కోలుకున్నాక బెకెట్ పొడిచినవాడిని జైలుకు వెళ్ళి పరామర్సించారు కూడా.
బెకెట్ దొరక్కుండా తప్పించుకునే వ్యక్తి. ఆయన పత్రికా విలేఖరులను, ఫోటోగ్రాఫర్లను ప్లేగులాగా భావించేవారట.వారిని దగ్గరికి రానిచ్చేవారు కారు.నోబెల్ బహుమతి ప్రకటించినప్పుడు ఆయన్ టునేషియలో వినోదకాలక్షేపం చేస్తూండేవారు.పత్రికా విలేకరులు ఆయనను కలుసుకోవడానికి ఆయన అప్పటి వరదలలో చిక్కుకున్నారని వారికి వర్తమానం అందిందట.
బెకెట్ బక్క పలచగా ఉంటారు. ఆకుపచ్చరంగుకళ్ళు జీవితంలో ఎప్పుడూ ఏపత్రికా విలేకరికి తనతో ముచ్చటించడానికి అవకాశమీయలేదు. విఖ్యాత రచయితలు ఫాక్నర్, ఫోర్స్టర్, టి.స్.ఇలియట్ వంటివారిని కలసుకొని పట్టుదలతో వారి విషయాలను తెలుసుకొని """పారిస్ రివ్యూ""" అనే పత్రికలో ప్రచురించాడు. బెకెట్ ఇచ్చిన ఒకేఒక ఇంటర్వ్యూ ఒక ఫ్రెంచి పత్రికకు.
తను తత్త్వవేత్త గ్రంధాలూ చదవనని ఆయన తనతో ఇంటర్వ్యూ చేసినవారివద్ద ఒప్పేసుకున్నారు. ఎందుకంటే వారు వ్రాసేది ఏదీ తనకు అర్ధం కాదని చెప్పుకున్నారు.
తను మేధావినని ఆయన ఒప్పుకోరు. నేను చేసినదంతా అనుభూతి పొందినదవాటిని వ్రాయటం ప్రారంభిస్తాను మేధను గిలిగింతలు పెట్టే రచనలలో 20వ శతాబ్దంలో మహత్తరమయిన రచనను (వెయిటింగ్ ఫర్ గాడెట్) వ్రాసిన బెకెట్ తాన రచనలలో ఎలాంటి తత్త్వమూ లేదని!
పెగ్గీ గగ్గెన్ హీంస్ అనే మహిళ ఒక మ్యూసియం లో తన జ్ఞాపకాలలో బెకెట్ చిత్రం గీసి, ఆవిడ భర్తకు విడాకులు ఇచ్చింది; ఆ సమయంలో బెకెట్ ను ఆమె తొలిసారిగా చూడటం తటస్థించింది.ఆమే అతనిపై ప్రేమతో ఉక్కిరి బిక్కిరి అయిందట. ఆమె నివాసం లండన్ లో అక్కడ ఆమె ఒక గ్యాలరీ నిర్వహించేది. బెకెట్ ఏమో పారిస్ లో నివసించేవారు.ఆమె నిరంతరం ఆరెండు నగరాలకు రాకపోకలు సాగించేది. ఆయన ఏమికోరినా నిరాకరించేదానిని కాదు...నన్ను పెండ్లాడడేమో, నన్ను వదులుకోడమో ఆయన నిర్ణయించుకోలేక పోయేవారు అని వ్రాసుకున్నది.
వెయిటింగ్ ఫర్ గాడెట్ రూపకం మౌలిక మహాదృశ్య కావ్యం అని ప్రముఖ బ్రిటిష్ సాహిత్య విమర్శికుడు సిరిల్ కొన్నేల్ వర్ణించాడు. బెకెట్ రచనలలో ఒక్కటయిన 'వాట్ ఇట్ ఈజ్' అనే దానిలో కధగాని, ఎత్తుగడగాని, మొదలుగాని చివరిగాని లేదు. దానిలో పాత్రలు పెక్కుసార్లు పేర్లు మార్చుకొంటాయి. 177 పేజీల ఈపుస్తకంలో ఎక్కడా కామా, పుల్ స్టాప్ వంటి వాక్య విశ్రంచిహ్నాలు లేవు. ఇక పేరాగ్రాఫులా వరుసన అసంబద్దాలు.
ఎలియట్ పాత్రలలాగా బెకెట్ పాత్రలూ శాశ్వతంగా నిర్వాసితులు; విశ్వకాందిశీకులు. ఒక విమర్శకుడు అన్నట్టు 'తామెప్పుడూ సృష్టించని ప్రపంచంలో నివసిస్తూ, తమను అర్ధం చేసుకోని సంఘంలో వ్యవహరిస్తూ, తమ అభిప్రాయాలు ఎప్పుడూ నచ్చచెప్పలేని వారిని పెండ్లాడుతూ, తాము జన్మించిన సంఘంగాని, ప్రపంచంగాని అర్ధం చేసుకోనట్టి పిల్లలని కని ప్రపంచాన్ని నింపుతూ, వున్నట్టివారు'.
బెకెట్ కి నోబెల్ బహుమతి వార్త వినగానే బెకెట్ భార్య 'ప్రళయం' అని, చాలా చెడ్డపని జరిగింది అని ఆప్తమిత్రుడు, పారిస్ లో ఆయన ఏజెంట్ అయిన ఒక వ్యక్తి గట్టిగా అరిచారట!
బెకెట్ 1989 డిసెంబర్ 22వ తేదీన మరణించారు.
మూలములు
[మార్చు]- 1969 -భారతి మాస పత్రిక
మూలాలు
[మార్చు]- ↑ "Fathoms from Anywhere - A Samuel Beckett Centenary Exhibition". Archived from the original on 2015-03-27. Retrieved 2018-06-22.
- ↑ Muldoon, Paul (12 December 2014). "The Letters and Poems of Samuel Beckett". New York Times. Retrieved 13 December 2014.