అవాబాయ్ బొమన్జీ వదియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అవాబాయ్ బొమన్జీ వదియా
జననం18 సెప్టెంబరు 1913
మరణం11 జులై 2005
భారతదేశం
వృత్తిసామాజిక కార్యకర్త, రచయిత్రి
క్రియాశీల సంవత్సరాలు1932-2005
సుపరిచితుడు/
సుపరిచితురాలు
లైంగిక ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ అడ్వకసీ
జీవిత భాగస్వామిబొమన్జీ ఖుర్షెద్జీ వదియా
తల్లిదండ్రులుదొరబ్జీ మంచెర్జీ
పిరోజ్ బాయ్ అర్సివాలా మెహతా
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం
ఫామిలీ ప్లానింగ్ ఆసోసియేషన్

అవాబాయ్ బొమన్జీ వదియా (జననం 1913 సెప్టెంబరు 18) భారతదేశ సామాజిక కార్యాకర్త, రచయిత్రి. ఆమె శ్రీలంకలో పుట్టినా, భారత్ నే తన కార్యక్షేత్రంగా మార్చుకుని, ఇక్కడ ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో కృషి చేసింది.[1][2] అంతర్జాతీయ ప్లాన్డ్ పేరెంట్ హుడ్ ఫెడరేషన్, భారతీయ కుటుంబ నియంత్రణ సంస్థలను స్థాపించింది. ఆమె ఈ రెండు లాభాపేక్ష రహిత, ప్రభుత్వేతర సంక్షేమ సంస్థల ద్వారా భారతదేశంలో లైంగిక ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ గురించి ప్రచారం చేసింది.[3][4] ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1971లో, ఆమెకు భారతదేశ నాలుగవ అతిపెద్ద పౌర పురస్కారమైన పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.[5]

జీవిత సంగ్రహం

[మార్చు]
పద్మశ్రీ పురస్కారం

తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం

[మార్చు]

అవాబాయ్ 1913 సెప్టెంబరు 18న, శ్రీలంకలో అప్పటి బ్రిటీష్ సిలోన్లోని కొలంబోలో జన్మించింది. ఆమెది భారతదేశంలోని గుజరాత్కు చెందిన పార్సీ కుటుంబం. ఆమె కుటుంబం అప్పట్లోనే అత్యంత ధనిక, పాశ్చాత్య పోకడలు ఎక్కువగా ఉన్న పార్సీ కుటుంబం.[6] ఆమె తండ్రి, దొరబ్జీ మంచెర్జీ, షిప్పింగ్ అధికారి.[3] ఆమె తల్లి, పిరోజ్ బాయ్ అర్సివాలా మెహతా, గృహిణి. కొలంబోలో ప్రాథమిక విద్య పూర్తి అయిన తరువాత, అవాబాయ్ తన 15వ ఏట 1928లో ఇంగ్లాండ్కు వెళ్ళింది. లండన్ లోని బ్రాండ్స్ బరీ అండ్ కిల్ బర్న్ ఉన్నత పాఠశాలలో చదివింది. [3]

న్యాయవాదిగా కెరీర్ ను ఎంచుకున్న అవాబాయ్, 1932లో ఇన్స్ ఆఫ్ కోర్టులో చేరి, 1934లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుంది. బార్ పరీక్షల్లో పాసయిన మొట్టమొదటి శ్రీలంక మహిళగా చరిత్ర సృష్టించింది.[3] ఆమె ఆనర్స్ విభాగంలో చదువుకుంది.[6] 1936 నుంచి 1937 వరకూ లండన్ లోని హైకోర్టులో ప్రాక్టీసు చేసింది.[6] కానీ న్యాయవాదిగా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. మహిళగా ఆమెపై వివక్షత ఉండటమే ఆమె న్యాయవాదిగా కొనసాగకపోవడానికి కారణమని ఆమె నమ్మకం[3] అయితే, దీనితో పాటు, ఆమె విద్యార్థిగానూ, న్యాయవాదిగానూ ఎన్నో వివాదాస్పద విషయాల్లో ప్రమేయం కలిగి ఉండటం కూడా ఒక కారణంగా చెబుతారు. ఆమె విద్యార్థిగా ఉన్నప్పుడే బ్రిటీష్ కామన్ వెల్త్ లీగ్, అంతర్జాతీయ మహిళల కూటమి వంటి వాటిల్లో పాల్గొంది. అంతేకాక, ఎన్నో ర్యాలీలలోనూ, నిరసనల్లోనూ పాల్గొనేది. భారత స్వాతంత్ర్య సమరయోధులైన మహాత్మా గాంధీ, మహ్మద్ అలీ జిన్నా, జవహర్‌లాల్ నెహ్రూ వంటి వారు ఇంగ్లాండు వెళ్ళినప్పుడు, వారిని కలిసేది.[3] ఆమె చేసిన ఈ పనుల కారణంగానే ఆమెను ఎవరూ జూనియర్ లాయర్ గా నియమించుకోలేదు. ఆమె అప్లికేషన్లన్నీ తిరస్కరించబడేవి. రెండేళ్ళు ఖాళీగా ఉన్న ఆమె, 1939లో తిరిగి తన స్వదేశం వెళ్ళిపోయింది. వెళ్ళిన వెంటనే అక్కడి సుప్రీం కోర్టులో పని చేసే ఒక పార్సీ న్యాయవాది వద్ద అసిస్టెంట్ గా పనిచేయడం ప్రారంభించింది. [3] 1939 నుంచి 1941 వరకూ ఆ న్యాయవాది వద్దే పనిచేసిన అవాబాయ్, న్యాయవాదిగా పెద్ద పేరు ప్రతిష్ఠలు సంపాదించలేకపోయింది. దానితో ఆమె కెరీర్ అక్కడితో ముగిసిపోయింది.[6]

లైంగిక, గర్భ వ్యాధుల గురించి అవగాహన, ప్రచార కార్యక్రమాల ప్రారంభం

[మార్చు]

1941లో, అవాబాయ్ తండ్రి పదవీ విరమణ కావడంతో, వారి స్వంత దేశమైన భారత్ కు తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకుని, బొంబాయిలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే అవాబాయ్, ఆమె భర్తను కలుసుకుంది. 1946 ఏప్రిల్ 26లో బొమన్జీ ఖుర్షద్జీ వదియాను వివాహం చేసుకుంది ఆమె.[3][6] కానీ ఆ పెళ్ళి ఎంతో కాలం నిలవలేదు. 1952లో ఆమెకు గర్భస్రావం అయింది. ఆ తరువాత కొన్నాళ్ళకే ఆ దంపతుల మధ్య విభేదాలు వచ్చి, విడిపోయారు. అయితే, వారు ఎప్పుడూ విడాకులు తీసుకోలేదు.

ముంబైలో ఆమె, లా ప్రాక్టీసు పెట్టకూడదని నిర్ణయించుకుంది. దానికి బదులుగా ఆమె అఖిల భారత మహిళల కాన్ఫరెన్స్ లో చేరి, సామాజిక సేవ చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా ఆమె తన దృష్టి అంతా స్త్రీవాదం పైనా, లైంగిక, గర్భ వ్యాధులపై అవగాహన కల్పించడంపై ఉండేది.[3] ఆమె తండ్రి మరణం తరువాత, 1949లో భారత కుటుంబ నియంత్రణ సంస్థను స్థాపించి, అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టింది. ఈ హోదాలో ఆమె దాదాపు 34ఏళ్ళ పాటు కొనసాగింది.[3] ఆమె కృషికి ఫలితంగా, 1951లో భారతదేశ మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో "కుటుంబ నియంత్రణ" పథకానికి చోటు దక్కింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "OCLC Classify". OCLC Classify. 2015. Retrieved 29 May 2015.
  2. "Worldcat profile". Worldcat. 2015. Retrieved 29 May 2015.
  3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 Paul Bell (11 August 2005). "Obituary: Avabai Wadia". Web report. The Guardian. Retrieved 29 May 2015.
  4. "Woman`s Lifelong Cause Is Global Family Planning". Web report. The New York Times. 17 December 1985. Archived from the original on 30 మే 2015. Retrieved 29 May 2015.
  5. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 19 మే 2018.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 "Social services and women's health advocate". Praboqk. 2015. Retrieved 29 May 2015.