Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి

అక్షాంశ రేఖాంశాలు: 17°25′29″N 78°25′39″E / 17.424643°N 78.427513°E / 17.424643; 78.427513
వికీపీడియా నుండి
ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి
పటం
భౌగోళికం
స్థానంఎల్.వి.ప్రసాద్ మార్గ్, బంజారా హిల్స్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
నిర్దేశాంకాలు17°25′29″N 78°25′39″E / 17.424643°N 78.427513°E / 17.424643; 78.427513
వ్యవస్థ
రకాలుస్పెషలిస్టు
Services
చరిత్ర
ప్రారంభమైనది1987
లింకులు
వెబ్‌సైటుhttp://www.lvpei.org

ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి (ఆంగ్లం:The L V Prasad Eye Institute (LVPEI) 1987లో హైదరాబాదులో స్థాపించబడింది.[1] ఇది లాభాపేక్ష లేని, ప్రభుత్వేతర నేత్ర వైద్యశాల. సమాజంలోని అన్ని వర్గాలకు సమానమైన , సమర్థవంతమైన కంటి సంరక్షణ LVPEI సంస్థ యొక్క లక్ష్యం. ఈ సంస్థ గుళ్ళపల్లి నాగేశ్వరరావు ద్వారా స్థాపించబడింది. 30 ఏళ్ల క్రితం చిన్న ఇన్సిస్ట్యూట్‌గా మొదలై అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది.

వ్యవస్థాపన

[మార్చు]

ప్రముఖ భారతీయ చలన చిత్ర నిర్మాత ఎల్. వి. ప్రసాద్ ఈ నేత్ర వైద్యశాల స్థాపన కొరకు బంజారా హిల్స్లో 10 మిలియన్ల రూపాయల ధనం, 5 ఎకరాల స్థలం దానం చేసాడు.[2] ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఆ సంస్థకు ఆయన పేరును ఆ సంస్థ పేరు ముందు ఉంచారు.

ఆపరేషన్ యొక్క క్రియాశీల ప్రాంతాలు

[మార్చు]

వైద్య సేవలు

[మార్చు]

LVPEI సుమారు 23.8 మిలియన్ల ప్రజలకు తన సేవలనందించింది. అందులో 50% ఉచితంగా, సంక్లిష్టతతో సంబంధం లేకుండా అవసరమైన వైద్యాన్ని అందించింది.[3]

పరిశోధనలు

[మార్చు]
2012 జూన్ 1 న, LVPEI పరిశోధన అధిపతి ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యన్ చెప్పిన ప్రకారం జన్యు కణజాల లోపాలను సరిచేయడానికి జన్యు చికిత్స ఉంది, కంటికి జన్యు డెలివరీ 1-2 సంవత్సరాలలో జరుగుతుంది[4]

కేంద్రాలు

[మార్చు]

LVPEI నెట్‌వర్క్:[3]

  • బంజరా హిల్స్ లో ప్రదాన కేంద్రం, డా. రెడ్డి లాబ్స్ వ్యవస్థాపకుడు కల్లం అంజిరెడ్డి తరువాత పేరుపెట్టబడింది.
  • 16 మాధ్యమిక కేంద్రాలు
  • 160 ప్రాథమిక సంరక్షణా కేంద్రాలు
  • జీనోమ్ వ్యాలీలో కూడా తన కార్యకలాపాలును ప్రారంభించింది.

మాధ్యమిక, ప్రాథమిక సంరక్షణ కేంద్రాలు వైద్య సేవలను దేశ వ్యాప్తంగా గ్రామీన ప్రాంతాలకు అందిస్తాయి.

ఐ బ్యాంకులు

[మార్చు]

The RIEB set up the Hyderabad Cornea Preservation Medium Centre which uses a McKarey Kauffman (MK) Medium.[5]

మూలాలు

[మార్చు]
  1. Khan, Arshia (30 December 2011). "Dr Gullapalli N Rao: Unwinding the reserved and rigorous". ModernMedicare.co.in. Archived from the original on 11 జూలై 2012. Retrieved 28 January 2012.
  2. ABN Telugu (2017-10-30), Gullapalli Nageswara Rao About Sr NTR And LV Prasad Eye Institute | Open Heart With RK | ABN, retrieved 2018-01-11
  3. ఇక్కడికి దుముకు: 3.0 3.1 "About L V Prasad Eye Institute - LV Prasad Eye Institute". L V Prasad Eye Institute (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2018-01-12. Retrieved 2018-01-11.
  4. "Research on gene therapy by Prasad Eye". 1 June 2012.
  5. "RIEB of LV Prasad Eye Institute gets award from International Federation of Eye Banks". saffron.pharmabiz.com. Archived from the original on 14 జూలై 2012. Retrieved 28 January 2012.

బాహ్యలింకులు

[మార్చు]