ప్రబంధ కల్పవల్లి
స్వరూపం
ప్రబంధ కల్పవల్లి 1870 - 1882 మధ్యకాలంలో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి ప్రకటింపబడిన మాస పత్రిక.[1]
వీరేశలింగంగారికన్నా ముందుగా గురుజాడ శ్రీరామమూర్తి గారు, ఆంధ్రకవుల జీవితాల్ని రచించి 1876 వ సంవత్సరంలోనే ప్రచురించారు. పెద్దాపురంనుండి ప్రకటింపబడే " శ్రీ ప్రబంధ కల్పవల్లి " అనే పత్రికలో ప్రచురిస్తూ ఉండేవారు. వారికవుల జీవితరచనలో కాలక్రమాన్ని పాటించలేదు. భారతాంధ్ర కవులు-రామాయణాంధ్రకవులు-ఆంధ్రపంచకావ్యకవులు- ఇత్యాదిగా విభాగించి రచించారు. ఆ కవుల జీవితరచన సమగ్రంగా లేక జనశ్రుతిలోని కధలతో గాథలతో నిండి ఉంది, అయినా గురజాడ శ్రీరామమూర్తిగారి కవి జీవితాలు శ్రీవీరేశలింగంగారి కవులచరిత్ర రచనకు ప్రేరకమని చెప్పవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ Mitchell, Lisa (2009). Language, Emotion, and Politics in South India: The Making of a Mother Tongue. Indiana University Press. ISBN 0253353017.