మట్టి మనిషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మట్టి మనిషి
రచయితవాసిరెడ్డి సీతాదేవి
దేశంభారతదేశం
భాషతెలుగు
శైలిసాంఘిక నవల

మట్టి మనిషి వాసిరెడ్డి సీతాదేవి రాసిన ప్రముఖ తెలుగు సాంఘిక నవల. వంద సంవత్సరాల కాలంలో నాలుగు తరాల నేపథ్యంతో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయ కుటుంబాల్లో వచ్చిన మార్పులను, భూస్వామిక, ధనిక రైతు, దళారీ వ్యవస్థల మధ్యనుండే ఘర్షణని, పరస్పర అనివార్యతను సమగ్రంగా చిత్రించిన నవల.[1] ఈ నవల 1970లో ఆంధ్రప్రభ దినపత్రిక లో రెండేళ్ళు ధారావాహికగా వచ్చింది. దాదాపు 14 భాషల్లోకి అనువాదం అయ్యింది. సుమారు ఆరు వందల పేజీల నవల ఇది.

శైలి[మార్చు]

రచనలో గుంటూరు జిల్లా మాండలికం, ప్రజల నుడికారం విస్తృతంగా కనిపిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. కె. ఎన్, మల్లీశ్వరి (2013). తెలుగు వెలుగు మంచి పుస్తకం. హైదరాబాదు: రామోజీ ఫౌండేషన్. pp. 36, 37.