వాసిరెడ్డి సీతాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాసిరెడ్డి సీతాదేవి
వాసిరెడ్డి సీతాదేవి
జననం
వాసిరెడ్డి సీతాదేవి

1933
మరణం2007
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ప్రసిద్ధ రచయిత్రి

వాసిరెడ్డి సీతాదేవి (ఆంగ్లం: Vasireddy Seethadevi) (డిసెంబర్ 15, 1933 - ఏప్రిల్ 13, 2007) ప్రసిద్ధ తెలుగు నవలా, కథా రచయిత్రి..

జీవిత సంగ్రహం

[మార్చు]

ఈమె గుంటూరు జిల్లా చేబ్రోలులో ఆమె జన్మించింది. ఈమె తల్లిదండ్రులు వాసిరెడ్డి రాఘవయ్య, రంగనాయకమ్మ. చిన్నతనంలోనే చెన్నై చేరుకున్నారు. ఈమె చదివింది ఐదవ తరగతి వరకే అయినా ప్రైవేట్ గా హిందీ ప్రచారక్, ప్రవీణ, సాహిత్య రత్నలో ఉత్తీర్ణులయ్యారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., ఎమ్.ఎ. పూర్తిచేశారు. ఈమె రచించిన మొదటి నవల జీవితం అంటే (1950), తొలి కథ సాంబయ్య పెళ్ళి (1952). అప్పటినుండి ఈమె సుమారు 39 పైగా నవలలు, 100 పైగా కథలు రచించారు.

ఈమె నక్సలిజం గురించి 1982 సంవత్సరంలో రచించిన మరీచిక నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత ఆరుద్ర వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై హైకోర్టు కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది. ఈమె రచించిన మట్టి మనిషి (2000) నవల 14 భాషలలోకి అనువదించబడింది.

ఈమె నవలల్లో కొన్ని తెలుగు సినిమాలుగా మరికొన్ని దూరదర్శన్ సీరియల్లుగాను నిర్మించబడ్డాయి. సమత నవల ఆధారంగా ప్రజా నాయకుడు, ప్రతీకారం నవలను మనస్సాక్షి సినిమాగా, మానినీ మనసును ఆమె కథ సినిమాలుగా వచ్చాయి. మృగతృష్ణ నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు.

ఈమె జవహర్ బాలభవన్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈమె 1985 - 1991 మధ్యకాలంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సేవలందించారు.

ఈమె సాహిత్య స్వర్ణోత్సవ వేడుకలు 1998 సంవత్సరంలో ఘనంగా నిర్వహించారు.

అవార్డులు

[మార్చు]

బిరుదము

[మార్చు]

ఆంధ్రపెర్ల్‌బక్

రచనలు

[మార్చు]
  • జీవితం అంటే (1950)
  • మరీచిక (1982)
  • విషకన్య
  • తిరస్కృతి
  • రాక్షస నీడ
  • వైతరణి
  • మరో సావిత్రి కథ (యథార్థగాథలు) (1983)
  • సమత (1997)
  • మట్టి మనిషి (2000)
  • అడవి మల్లె (2003)
  • ఉరి త్రాడు (2003)
  • వెన్నెల మండుతోంది (2003)
  • మరో దయ్యం కథ (2003)
  • కోతి కొబ్బరికాయ (2003)
  • రాబందులు రామచిలకలు (2003)
  • మృగతృష్ణ (2003)
  • సావేరి (2003)
  • ఊర్మిళ (2004)
  • తొణికిన స్వప్నం (2004)
  • మళ్ళీ తెల్లవారింది (2004)
  • బొమ్మరిల్లు (2004)
  • నింగి నుండి నేలకు (2006)
  • హసీనా (2006)
  • బంధితుడు (2006)
  • ప్రతీకారం (2006)

అనువాదాలు

[మార్చు]
  • మృత్యుంజయుడు (1988) శివసాగర్ మిశ్ర రచించిన "అక్షత్" హిందీ నవలకు తెలుగు అనువాదం.[1]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]