ప్రజా నాయకుడు
స్వరూపం
| ప్రజా నాయకుడు (1972 తెలుగు సినిమా) | |
సినిమాపోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | వి.మధుసూదనరావు |
| తారాగణం | కృష్ణ, జానకి |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | పద్మశ్రీ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
ప్రజా నాయకుడు 1972 నవంబర్ 10 న విడుదలైన తెలుగు చలన చిత్రం. నటుడు నాగభూషణం సమర్పించిన ఈ చిత్రానికి వీరమాచినేని మధుసూదనరావు దర్శకత్వం వహించాడు. శశి థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సి హెచ్ రాఘవరావు నిర్మించిన ఈ చిత్రం లో నాగభూషణం , షావుకారు జానకి ,ఘట్టమనేని కృష్ణ కొంగర జగ్గయ్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.[1]

1972 వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తృతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి కాంస్య నంది అవార్డు ప్రకటించింది.
తారాగణం
[మార్చు]- నాగభూషణం,
- కాంతారావు
- ,మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి,
- సాక్షి రంగారావు,
- రాజబాబు ,
- పొట్టి ప్రసాద్,
- గోకిన రామారావు,
- కృష్ణ,
- జగ్గయ్య
- చంద్ర మోహన్,
- కాకరాల,
- షావుకారు జానకి,
- రమాప్రభ,
- నిర్మల.
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీరమాచనేని మధుసూదనరావు
- సంగీతం: కె వి మహదేవన్
- గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ, కొసరాజు రాఘవయ్య చౌదరి
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి
- నిర్మాణ సంస్థ: శశి థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్
- నిర్మాత: సి హెచ్.రాఘవరావు
- ఉతకాలిరా బాబు ఉతకాలి బండమీద వేసి బాగా, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి .
- ఏమిటో చెబుతున్నావు ఎందో ఉందని అనుకున్నావు, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
- ఏరువాకమ్మా మా కెదురురావమ్మ ఎదురొచ్చి, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం
- ఓ దొరా లే దొరా రాదొరా ఊరకే చూస్తుంటే రాదురా పడుచు, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
- ఓలమ్మి అమ్మీ అమ్మి అమ్మీ పండగొచ్చింది, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి బృందం
- నువ్వే.ఏదోలా ఉన్నావు నువ్వే ఏదోలా చూస్తున్నావు, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
మూలాలు
[మార్చు]- ↑ "Praja Nayakudu (1972)". Indiancine.ma. Retrieved 2025-06-09.
- ↑ .ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.