జి. డి. అగర్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి. డి. అగర్వాల్
2011 అక్టోబరు లో వారణాసి వద్ద సర్వసేవా సంఘ్ వద్ద జరిగిన సమావేశంలో
జననం
జి. డి. అగర్వాల్

జూలై 20
కంధ్లా, ముఝఫర్‌నగర్ జిల్లా ,
ఉత్తర ప్రదేశ్,
బ్రిటిష్ రాజ్యం
మరణం2018 అక్టోబరు 11
(వయసు 86)
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రిషికేశ్,,
ఉత్తరాఖండ్ ,
భారతదేశం
మరణ కారణంకార్డియాటిక్ అరెస్టు
సమాధి స్థలంచిత్రకూట్, మధ్యప్రదేశ్
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుస్వామీ సనంద్
స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్
పౌరసత్వంభారతీయుడు
విద్యసివిల్ ఇంజనీరింగు, పర్యావరణ ఇంజనీరింగు
విద్యాసంస్థఐ.ఐ.టి రూర్కీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బెర్కిలీ)
వృత్తిపర్యావరణ ఇంజనీర్
క్రియాశీల సంవత్సరాలు1952-2018
ఉద్యోగంసెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ (ఐ.ఐ.టి కాన్పూర్)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
2009 లో బాగీరధి నదిపై ఆనకట్టలనిర్మాణాన్ని వ్యతిరేకించిన వ్యక్తి
బిరుదుFirst Member-Secretary (CPCB), former Head of the Department (IIT)
పదవీ కాలం17 సంవత్సరాలు ఐ.ఐ.టి కాన్పూర్

జి. డి. అగర్వాల్ (1932 జూలై 20 - 2018 అక్టోబరు 11) స్వామి సనంద్, స్వామి జ్ఞాన స్వరూప్ సదానంద్ గా సుపరిచితుడు. అతను భారతదేశ పర్యావరణ సాంకేతిక నిపుణుడు, ఆధ్యాత్మికవేత్త, ప్రొఫెసర్, యోగి, పర్యావరణ ఉద్యమకారుడు. కాన్పూర్‌ ఐఐటీ మాజీ ప్రొఫెసర్‌. అతను 1905లో మదన్ మోహన్ మాలవ్యా స్థాపించిన ప్రభుత్వేతర సంస్థ శ్రీ గంగా మహాసభకు పోషకునిగా ఉన్నాడు.

అతను గంగా నది ప్రక్షాళనకు తన జీవితాన్ని అంకితం చేశాడు. గంగా నదిపై అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా అనేక నిరాహార దీక్షలు చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 2009 లో అతను చేసిన నిరాహారదీక్ష భాగీరధి నదిపై ఆనకట్ట నిర్మాణ నిలుపుదలకు దారితీసింది. [1]

గంగా నదిని కాలుష్యరహితం చేయాలని, దాని ప్రవాహాన్ని నిరోధించరాదని కోరుతూ అగర్వాల్‌ 2018 జూన్‌ 22 నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు. 109 రోజుల పాటు కేవలం తేనె కలిపిన నీరు మాత్రమే తీసుకున్నాడు. కేంద్రం స్పందించకపోవడంతో ఇకపై నీరు కూడా తాగనంటూ 2018 అక్టోబరు 9న ప్రకటించాడు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు అక్టోబరు 10న రిషీకేశ్‌లోని  ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచాడు. [2]

ప్రారంభ జీవితం

[మార్చు]

అతను 1932లో ఉత్తరప్రదేశ్ జిల్లాకు చెందిన కంధ్లా గ్రామం (ముఘపుర్‌నగర్ జిల్లా) లోని రైతు కుటుంబంలో జన్మించాడు. అతను ప్రాథమిక, ఉత్తన విద్యను స్థానిక పాఠశాలలో చదివాడు. రూర్కీ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం ఐఐటి రూర్కీ) నుండి సివిల్ ఇంజనీరింగు లో పట్టాను పొందాడు. అతను 1979-80 మధ్యకాలంలో జాతీయ కాలుష్య నివారన బోర్డు సభ్యునిగా ఉన్నప్పుడు రూర్కీ విశ్వవిద్యాలయంలో పర్యావరణ ఇంజనీరింగు విభాగంలో విజిటింగ్ ప్రొఫెసరుగా కూడా పనిచేసాడు.

అతను తన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నీటిపారుదల విభాగంలో డిజైన్ ఇంజనీరుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. తరువాత బెర్కెలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి ఎన్విరాన్‌మెంటు ఇంజనీరింగులో పి.హెచ్.డి ని పొందాడు. అతను అనేక పుస్తకాలను రచించాడు. అతను మతపరంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందడం శాస్త్రీయంగా ఆలోచించేవాడు. [3] జూలై 2011లో అతను హిందూ సన్యసిగా మారి తన పేరును "స్వామి జ్ఞానస్వరూప్ సనంద్" గా మార్చుకున్నాడు.[4]

వృత్తి జీవితం

[మార్చు]

అతను భారత ప్రభుత్వంలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు మొదటి మెంబరు-సెక్రటరీగా భాద్యతలు నిర్వర్తించాడు. అతను అంతకు పూర్వం ఐ.ఐ.టి కాన్పూర్ లోని సివిల్, పర్యావరణ ఇంజనీరింగ్ విభాగానికి అధిపతిగా ఉన్నాడు. అతని వద్ద తన సహ ఇంజనీర్లు అనేక క్లిష్టమైన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను పొందేవారు. అందువల్ల ఇంజనీర్లకు ఇంజనీరుగా గుర్తింపబడ్డాడు. భారతదేశ పర్యావరణ నాణ్యతను మెరుగుపరిచేందుకు అతను వివిధ ప్రభుత్వ సంస్థలలో సభ్యుడిగా వ్యవహరించారు. అతను కేంద్ర, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల గంగానది వ్యతిరేక విధానాలకు నిరసనగా నిరాహారదీక్ష చేసాడు. [3]

మూలాలు

[మార్చు]
  1. Desh (21 May 2008). "Professor GD Agrawal's Fast unto death over Dam on Bhagirathi". Drishtikone. Retrieved 2 March 2010.
  2. "'Ganga Activist' GD Agarwal, On Fast From About 4 Months For Clean Ganga, Dies At 87 - HeadLines Today". headlinestoday.org. Headlines Today. 11 October 2018. Archived from the original on 11 అక్టోబరు 2018. Retrieved 11 October 2018.
  3. 3.0 3.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Desh2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. Noted environmentalist embraces sanyas Times of India – 4 July 2011

బయటి వనరులు

[మార్చు]