మా నాన్న నిర్దోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా నాన్న నిర్దోషి
దర్శకత్వంకె. వి. నందనరావు
నిర్మాతఎస్. వి. ఎన్ రావు అండ్ బ్రదర్స్
రచన
  • టి. శారదాంబ (కథ)
  • పాలగుమ్మి పద్మరాజు (మాటలు)
నటులుకృష్ణ ,
విజయనిర్మల
సంగీతంపెండ్యాల నాగేశ్వరరావు
ఛాయాగ్రహణంవి. ఎస్. ఆర్. స్వామి
కూర్పుహనుమంత రావు
నిర్మాణ సంస్థ
విడుదల
జనవరి 30, 1970 (1970-01-30)
భాషతెలుగు

మా నాన్న నిర్దోషి 1970 లో కె. వి. నందనరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో కృష్ణ, విజయ నిర్మల ముఖ్య పాత్రల్లో నటించారు. అన్యాయంగా జైలు పాలైన తండ్రిని చిన్న పిల్లవాడైన అతని కొడుకు ఎలా విడిపించాడన్నది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమా శ్రీదేవికి బాలనటిగా మొదటి సినిమా. ఇందులో శ్రీదేవి కృష్ణ, విజయ నిర్మలకు మేనకోడలు గా నటించింది.

కథ[మార్చు]

డాక్టర్ కృష్ణ రాధ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఇది ఆమె తండ్రికి ఇష్టం లేక ఆమెను దూరం చేసుకుంటాడు. కృష్ణ, రాధలకు ఒక కొడుకు పుడతాడు. ఈ లోపు కృష్ణ తాను చేయని ఓ హత్యా నేరంతో జైలుకు వెళ్ళవలసి వస్తుంది. కృష్ణ కొడుకు తన తండ్రిని జైలు నుంచి విడిపించడానికి ఆ హత్య ఎవరు చేశారో కనుక్కొని అతన్ని చట్టానికి పట్టించడం మిగతా చిత్ర కథ.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వర రావు సంగీత దర్శకత్వం వహించాడు. సి. నారాయణ రెడ్డి పాటలు రాశాడు.[1] ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి, సుశీల పాటలు పాడారు. ఈ సినిమాకు సహాయ దర్శకుడిగా వ్యవహరించిన దాసరి నారాయణ రావు ఓ బాలల నృత్యరూపకం కోసం పిల్లలకు తనే శిక్షణ ఇచ్చాడు.

  • ఏమండీ అబ్బాయి గారు ఎలా ఉన్నారు
  • అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా
  • ఎంతెంత దూరం

మూలాలు[మార్చు]

  1. "మా నాన్న నిర్దోషి". cineradham.com. Retrieved 28 December 2017.