ఎం. ఎల్. తంగప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. ఎల్. తంగప్ప
ఎం.లెనిన్ తంగప్పా
పుట్టిన తేదీ, స్థలంఎం.లెనిన్ తంగప్పా
(1934-03-08)1934 మార్చి 8
తిరునల్వేలి జిల్లాలో కురుంపలప్పెరి గ్రామం
మరణం2018 మే 31(2018-05-31) (వయసు 84)
వృత్తిరచయిత, అనువాదకుడు
పౌరసత్వంహిందూ
పూర్వవిద్యార్థిసెయింట్ జాన్స్ కళాశాల, పాలయంకొట్టారి
ప్రభావంభారతీయార్, భారతీదాసన్, కన్నదాసన్
సంతానంనలుగురు

ఎం.లెనిన్ తగప్ప తమిళ రచయిత,సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీత.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అతను తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లాలో కురుంపలప్పెరి గ్రామంలో 1934 మార్చి 8 న మదన్‌ పాండియన్‌ రత్నమణి దంపతులకు జన్మించాడు. అతను సెయింట్ జాన్స్ కళాశాల, పాలయంకొట్టారి లో చదివాడు. తన పదిహేనేళ్ల వయస్సులోనే అందరినీ ఆకట్టుకునే రీతిలో కవితలు రచించాడు. తమిళ మేటి కవులు భారతియార్‌, భారతిదాసన్‌, కన్నదాసన్‌లో సన్నిహితంగా మెలిగిన తంగప్పా సాహిత్య అకాడమీకి తమిళ అనువాదకునిగా చివరి దాకా సేవలందించాడు. తంగప్పా రచించిన ‘సోలైకొల్లై బొమ్మై’ అనే రచనకు 2010లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆ తర్వాత బాల సాహిత్యరచనకు గాను మరోమారు ఆయన సాహిత్య అకాడమీ అవార్డును స్వీకరించాడు. తంగప్పా రచించిన ‘ఆందైపాట్టు’ (గుడ్లగూబ పాట) అనే సాహితీ రచన తెలుగులో గుర్రం జాషువా రచించిన ‘గబ్బిలం’ రచనను తలపించే రీతిలో ఉండటం విశేషం. అతను తమిళనాడు రాష్ట్రంలోనే ఆయన పలు కళాశాలల్లో అధ్యాపకుడిగా సేవలందించాడు.[2] అతను టాగూర్ ఆర్ట్స్ కాలేజి, భారతీదాసన్ ప్రభుత్వ మహిళా కశాశాలలో అధ్యాపకునిగా పనిచేసాడు. 50కి పైగా పుస్తకాలను రాసాడు. అతను ప్రముఖ రచయితలైన భారతి, అరవిందర్, భారతి దాసన్ కవితలను ఆంగ్లంలోకి అనువాదం చేసాడు.[3]

అతను పాడిచ్ఛేరి ప్రభుత్వ పరిధిలో అనేక కళాశాలలలో 25 సంవత్సరాల పాటు బోధించాడు. 1994లో పదవీవిరమణ చేసాడు. అతను తమిళ మాసపత్రిక "తెన్మోలి" కి సంపాదకవర్గ సభ్యునిగా 1962 నుండి 1967 వరకు పనిచేసాడు. ప్రసిద్ధ రచయితగా అతను అడిచ్చువడుకల్, ఊయిర్‌ప్పిన్ అతివుక, ఏతు వల్కాయ్, నున్మాయాయ్ నొక్కై వంటి రచనలు చేసాడు. అతను తమిళ భాష నుండి ఆంగ్ల భాషలోనికి అనేక రచనలను అనువాదం చేసాడు.[4]

అతనికి 1991లో తమిళనాడు ప్రభుత్వం భారతీ దాసన్ పురస్కారం యిచ్చి సత్కరించింది. పద్యభాగంలో జీవిత కాల సాఫల్యంపురస్కారంగా 2007లో సిప్రి సాహిత్య పురస్కారం అందుకున్నాడు. తమిళ భాష హక్కుల ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి, పుదుచ్ఛేరి ఎకలాజికల్ సొసైటీకి వ్యవస్థాపక సభ్యునిగా ఉన్నాడు. అతని తమిళ రచనల నుండి ఆంగ్లంలోనికి అనువాద రచనలలో "లవ్ స్టాండ్స్ ఫర్ ఎలోన్: సెలక్షన్స్ ప్రం తమిళ సంగం పోయట్రీ"[5][6] ముఖ్యమైనది. అతను తన కుటుంబంతో పుదుచ్చేరిలో నివాసముంటున్నారు.[7]

వ్యక్తిగత జీవితం[మార్చు]

తమిళభాషపై తీవ్ర మక్కువ కలిగినవారు కావడంతో తన పిల్లలకు ‘సెంకదిర్‌, ‘విన్‌మీన్‌’, ‘ఇలంపిరై’, ‘మిన్నల్‌’ అనే అందమైన తమిళ పేర్లు పెట్టారు.

మరణం[మార్చు]

పుదుచ్చేరి అవ్వైనగర్‌లో నివసిస్తున్న తంగప్ప గత కొంతకాలంగా తీవ్ర అనార్యోగంతో బాధపడుతూ చికిత్సపొందుతూ వచ్చారు. 2018 మే 31న తుదిశ్వాస విడిచాడు.

మూలాలు[మార్చు]

  1. "Renowned Tamil author ML Thangappa passes away". The News Minute. 2018-05-31. Retrieved 2018-06-02.
  2. "రచయిత తంగప్పా కన్నుమూత".[permanent dead link]
  3. "Tamil Writer ML Tangappa passed away".
  4. "M.L. Thangappa - Penguin India". Penguin India. Retrieved 2018-06-02.[permanent dead link]
  5. "M.L.Thangappa". www.goodreads.com. Retrieved 2018-06-02.
  6. Reporter, Staff; Reporter, Staff (2012-12-29). "M. L. Thangappa wins Sahitya Akademi Prize". The Hindu. ISSN 0971-751X. Retrieved 2018-06-02.
  7. Red Lilies and Frightened Birds. Penguin Books India. 2011. ISBN 9780143064855.