సాహిత్య అకాడమీ అనువాద బహుమతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాహిత్య అకాడమీ అనువాద బహుమతి పొందిన మొదటి వ్యక్తి బెజవాడ గోపాల రెడ్డి

సాహిత్య అకాడమీ అనువాద బహుమతిని కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద రచనలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసింది. ఏటా సాహిత్య అకాడమీ గుర్తించిన 24 భాషల్లో అత్యుత్తమ అనువాదాలకు భాషకు ఒకటి చొప్పున ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.

చరిత్ర

[మార్చు]

సాహిత్య అకాడమీ అనువాద బహుమతిని 1989లో కేంద్ర సాహిత్య అకాడమీ ఏర్పాటుచేసింది. ఏర్పాటు చేసినప్పుడు(1989లో) రూ.10 వేలు అనువాద బహుమతిగా అందజేసేవారు. ఈ మొత్తాన్ని రూ.15 వేలకు 2001లో, రూ.20వేలకు 2003లో పెంచారు. ప్రస్తుతం రూ.50వేలను బహుమతి మొత్తంగా అందజేస్తున్నారు(2009 నుంచి).[1]

నిబంధనలు

[మార్చు]

అర్హతలు

[మార్చు]

ఎంపిక పద్ధతులు

[మార్చు]

తెలుగు భాషకు చెందిన అనువాద బహుమతి గ్రహీతలు

[మార్చు]
సంవత్సరం అనువాద పుస్తకం పేరు అనువాద రచయిత మూలం పేరు (భాష, సాహితీ విభాగం) మూల రచయిత
2022 ఆకుపచ్చ కవితలు వారాల ఆనంద్ గ్రీన్ పోయెమ్స్ గుల్జార్
2021 అశుద్ధ భారత్‌ కె.సజయ అదృశ్య భారత్‌ (నాన్‌ఫిక్షన్‌) భాషా సింగ్‌
2020 ఓం నమో రంగనాథ రామచంద్రరావు ఓం నమో శాంతినాథ్‌ దేశాయ్‌
2019 ఒక హిజ్రా ఆత్మకథ పి.సత్యవతి ది ట్రూత్ అబౌట్ మి : ఎ హిజ్రా లైఫ్ స్టోరీ (ఇంగ్లీషు, ఆత్మకథ) అజిత్ కౌర్
2018 గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు ఎ.కృష్ణారావు (కృష్ణుడు) ఎ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ సన్ అండ్ అదర్ పొయెమ్స్ (డోగ్రీ, కవిత్వం) పద్మా సచ్‌దేవ్
2017 విరామమెరుగని పయనం వెన్నా వల్లభరావు ఖానా బదోష్ (హిందీ, ఆత్మకథ) అజిత్ కౌర్
2016 వల్లభభాయి పటేల్ టంకశాల అశోక్ పటేల్ - ఎ లైఫ్ (ఇంగ్లీషు, జీవితచరిత్ర) రాజ్ మోహన్ గాంధీ
2015 సూఫీ చెప్పిన కథ ఎల్.ఆర్.స్వామి సూఫీ పరంజ కథ (మలయాళం, నవల) కె.పి.రామనున్ని
2014 ఇంట్లో ప్రేమ్‌చంద్ ఆర్.శాంత సుందరి ఘర్ మే ప్రేమ్‌చంద్ (హిందీ, జీవితచరిత్ర) శివరాణీదేవి ప్రేమ్‌చంద్
2013 స్మారక శిలలు నలిమెల భాస్కర్ స్మారకల శిలకళ్ (మలయాళం, నవల) అజిత్ కౌర్
2012 తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్ 500 BC-AD 624 ఆర్.వెంకటేశ్వరరావు ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 500 BC-AD 624 (ఇంగ్లీషు, చారిత్రక వ్యాసాలు) ఐ.కె.శర్మ (సంపాదకుడు)
2011 ప్రతాప ముదలియార్ చరిత్ర ఎస్.జయప్రకాష్ ప్రతాప ముదలియార్ చరిత్రం (తమిళ్, నవల) వేదనాయగం పిళ్ళై
2010 కళ్యాణి జి. బాలాజీ ఒరు నడిగై నాడగం పార్కిరాల్ (తమిళం, నవల) డి.జయకాంతన్
2009 దళిత ఉద్యమ చరిత్ర మందర ప్రభాకర్ దళిత్స్ స్ట్రగుల్ ఫర్ ఐడెంటిటీ (ఇంగ్లీష్ పరిశోధన) యాగాటి చిన్నారావు
2008 నా దేశ యువజనులారా వాడ్రేవు చినవీరభద్రుడు ఇగ్నైటెడ్ మైండ్స్ (ఇంగ్లీష్, వ్యాసాలు) ఎ.పి.జె.అబ్దుల్ కలామ్
2007 అంతరాలు మంత్రిప్రెగడ శేషాబాయి పాలంగళ్ (తమిళం నవల) శివశంకరి
2006 భావార్థ రామాయణం విమల శర్మ మరాఠీ
2005 మాస్తి చిన్నకథలు జి.ఎస్.మోహన్ సన్న కథెగళు సం. 12-13 (కన్నడ, చిన్న కథలు) మాస్తి వెంకటేశ అయ్యంగార్
2004 పర్వ గంగిశెట్టి లక్ష్మీనారాయణ పర్వ (కన్నడ, నవల) ఎస్.ఎల్.బైరప్ప
2003 శ్రీ దేవీభాగవతము బేతవోలు రామబ్రహ్మం దేవీభాగవతం (సంస్కృతం, పురాణం) వేదవ్యాసుడు
2002 మాటన్నది జ్యోతిర్లింగం దీవి సుబ్బారావు కన్నడ 'వచనాల' సంపుటి (కన్నడ, పద్యాలు) వివిధ రచయితలు
2001 ఆత్మ సాక్షాత్కారము పింగళి సూర్య సుందరం సెల్ఫ్ రియలైజేషన్ (ఇంగ్లీషు, జీవిత చరిత్ర) బి.వి.నరసింహస్వామి
2000 ఛాయారేఖలు ఆర్.ఎ.పద్మనాభరావు షాడో లైన్స్ (ఇంగ్లీషు, నవల) అమితావ్ ఘోష్
1999 సగం వెన్నెల రాత్రి వేమరాజు భానుమూర్తి ఆధ్ చనాణీ రాత్ (పంజాబీ, నవల) గుర్దయాళ్ సింగ్
1998 మెట్టుకు పైమెట్టు ఇలపావులూరి పాండురంగారావు ఎనిప్పాదికళ్ (మలయాళం, నవల) తక్కాళి శివశంకర పిళ్ళై
1997 గడచిన కాలం బి.కె.ఈశ్వర్ కజింజ కాలం(మలయాళం, నవల) కె.పి. కేశవ మీనన్
1996 కావ్య ప్రకాశము పుల్లెల శ్రీరామచంద్రుడు కావ్య ప్రకాశం (సంస్కృతం, వ్యాఖ్యానం) మమ్మట
1995 తలదండం భార్గవి రావు తలెదండ (కన్నడ, నాటకం) గిరీష్ కర్నాడ్
1994 అమృతం విషం పి.ఆదేశ్వరరావు అమృత్ ఔర్ విష్ (హిందీ, నవల) అమృత్లాల్ నాగర్
1993 సమయం కాని సమయం మద్దిపట్ల సూరి అసమయ (బెంగాలీ, నవల) బిమల్ కార్
1992 తమస్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తమస్ (హిందీ, నవల) భీషమ్ సాహనీ
1991 తిరుక్కురళ్ సి.ఆర్.శర్మ తిరుక్కురళ్ (తమిళం, వ్యాఖ్యానం తిరువళ్ళువార్
1990 గణపతి రామాయణ సుధ చర్ల గణపతిశాస్త్రి శ్రీమద్రామాయణం(సంస్కృతం, పురాణం) వాల్మీకి
1989 రవీంద్రుని నాటికలు బెజవాడ గోపాలరెడ్డి బిదాయెర్ అభిశాప్, చిత్రాంగద, మొ.. (బెంగాలీ, నాటికలు) రవీంద్రనాథ్ టాగోర్

మూలాలు

[మార్చు]
  1. "సాహిత్య అకాడమీ అధికారిక వెబ్సైట్లో సాహిత్య అకాడమీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ పేజీ". Archived from the original on 2013-10-19. Retrieved 2014-02-22.