భార్గవి రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భార్గవీ ప్రభంజన రావు
పుట్టిన తేదీ, స్థలం14 ఆగస్టు 1944
బళ్లారి, కర్ణాటక
మరణం23 మే, 2008
హైదరాబాదు
వృత్తిరచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు, ప్రొఫెసర్
జాతీయతభారతీయురాలు
రచనా రంగంకాల్పనిక సాహిత్యం
గుర్తింపునిచ్చిన రచనలునూరేళ్ల పంట
ప్రభావంKamala Das, Sylvia Plath

భార్గవి రావు(Bhargavi P Rao) రచయిత్రిగా, అనువాదకురాలిగా ప్రసిద్ధి చెందినవారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె బళ్లారిలో 1944, ఆగస్టు 14 న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్లభాషలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా సంపాదించుకున్నారు. తరువాత హైదరాబాదులో కోఠీ మహిళా కళాశాలలోను, నిజాం కళాశాలలోను ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేశారు. పదవీ విరమణ తరువాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఈమె తిరుపతికి చెందిన ప్రభంజనరావును వివాహం చేసికొన్నారు. ఈమె మే 23, 2008వ తేదీన గుండెనొప్పితో మరణించారు.

సాహిత్య రంగం

[మార్చు]

ఈమె పలు రచనలను తెలుగు నుండి కన్నడకు, కన్నడ నుండి తెలుగులోనికి, తెలుగు నుండి ఇంగ్లీషులోనికి అనువాదం చేశారు. స్వంతంగా తెలుగు, ఇంగ్లీషు భాషలలో కథలు, కవిత్వం వ్రాశారు. పలు పురస్కారాలను పొందారు. Muse India అనే పత్రికకు వ్యవస్థాపక సంపాదకురాలిగా ఉన్నారు.[1]

రచనలు

[మార్చు]
 1. ఆల్బం (కవిత్వం)
 2. నీడల గోడలు (కవిత్వం)
 3. గుండెలో తడి
 4. చుక్క నవ్వింది
 5. నా పేరు
 6. అభిసారిక (నవల)
 7. తూర్పుగాలి (నవల)
 8. పుత్రకామేష్టి (నవల)
 9. ప్రణవ గంగ (నృత్య రూపకం)
 10. సౌగంధిక
 11. ఊర్వశి (వారణాశి నాగలక్ష్మితో కలిసి)
 12. నాగమండల (అనువాదం మూలం: గిరిష్ కర్నాడ్)
 13. హయవదన (అనువాదం మూలం: గిరిష్ కర్నాడ్)
 14. తలాదండం (అనువాదం మూలం: గిరిష్ కర్నాడ్)
 15. తుగ్లక్ (అనువాదం మూలం: గిరిష్ కర్నాడ్)
 16. అగ్నివర్షం (అనువాదం మూలం: గిరిష్ కర్నాడ్)
 17. సిరి సంపెంగ (అనువాదం)
 18. కథగా మారిన అమ్మాయి (అనువాదం)
 19. నూరేళ్ల పంట (కథా సంకలనం)
 20. ముద్ర (కవయిత్రుల కవితా సంకలనం)
 21. నూరు వరహాలు (కథా సంకలనం)
 22. ఇంకానా! ఇకపై సాగదు (దళిత కథల సంకలనం)
 23. ఆహా! ఓహో! (హాస్య కథల సంకలనం)
 24. War a Heart's Ravage (శీలా సుభద్రాదేవి దీర్ఘకవిత యుద్ధం ఒక గుండెకోతకు ఆంగ్లానువాదం)
 25. Pebbles on the Sea Shore (కథలు)
 26. Hiccups (కవిత్వం)
 27. Meru Kanchana (నవల)
 28. Colours and Cadences: Poems from the Romantic Age (టి.విజయ కుమార్‌తో కలిసి)

పురస్కారాలు

[మార్చు]

భార్గవి రావు, కన్నడంలో గిరీష్ కర్నాడ్ రచించిన తలాదండె అనే నాటకాన్ని తెలుగులోకి తలాదండం అనే పేరుతో అనువదించారు. 1995 లో దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనువాద పురస్కారం లభించింది.[2]

మూలాలు

[మార్చు]
 1. "Muse India". Muse India. Archived from the original on 9 October 2007. Retrieved 25 May 2008.
 2. "అకాడమీ ట్రాన్స్‌లేషన్ ప్రైజెస్ (1989-2018)". Archived from the original on 28 Jun 2019. Retrieved 28 Jun 2019.

ఇతర లింకులు

[మార్చు]