Jump to content

శీలా సుభద్రాదేవి

వికీపీడియా నుండి
శీలా సుభద్రాదేవి

శీలా సుభద్రాదేవి ప్రముఖ కవయిత్రి, కథారచయిత్రి. ఈమె చిత్రకారిణి కూడా. ఈమె 1949లో విజయనగరంలో జన్మించింది. ఈమె ప్రముఖ రచయిత, చిత్రకారుడు శీలా వీర్రాజు భార్య. ఈమె తొలిరచన 1975లో వెలువడింది. స్త్రీవాద కవిత్వోద్యమం ప్రారంభమవటానికి ముందుగానే, 1980ల నాటికే ఈమె పురుషాహంకారాన్ని సవాల్ చేస్తూ కవిత్వం వ్రాసింది. 1997లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఈమెకు ఉత్తమ కవయిత్రి పురస్కారం లభించింది[1].

రచనలు

[మార్చు]

కవితాసంపుటాలు

[మార్చు]
  1. ఆకలినృత్యం
  2. మోళి
  3. తెగినపేగు
  4. ఆవిష్కారం
  5. ఒప్పులకుప్ప
  6. యుద్ధం ఒక గుండెకోత
  7. ఏకాంత సమూహాలు
  8. బతుకుబాటలో అస్తిత్వరాగం
  9. నా ఆకాశం నాదే
  10. శీలా సుభద్రాదేవి కవిత్వం (1975-2009)
  11. ముద్ర (వనితల కవితల సంకలనం సంపాదకత్వం భార్గవీరావుతో కలిసి)

కథా సంపుటాలు

[మార్చు]
  1. దేవుడుబండ
  2. రెక్కలచూపు
  3. ఇస్కూలుకతలు
  1. నీడలచెట్టు

మోనోగ్రాఫ్

[మార్చు]
  1. డా.పి.శ్రీదేవి
  2. నిడదవోలుమాలతి రచనాసౌరభాలు

వ్యాససంపుటి

[మార్చు]
  1. గీటురాయి పై అక్షరదర్శనం
  2. కథారామంలో పూలతావులు

రచనల నుండి ఉదాహరణ

[మార్చు]

ఈమె కవిత్వ స్వభావాన్ని తెలుసుకునేందుకు మచ్చుకు ఒక కవితలోని కొన్ని పంక్తులు[2]:

నా ఆకాశం నాదే
నా మానాన నన్ను నడవనివ్వకుండా
దుర్భిణీ చేత సారించి
వెంట వెంటే తిరుగుతున్నావెందుకూ?
నడకలో ఏ తప్పటడుగు పట్టించాలని
ఆలోచనల్లో ఏ దృష్టికోణాన్ని ఫోకస్ చేయాలని
మాటల్లో ఏ ప్రాంతీయతని ఎత్తి చూపాలని
అక్షరాల్లో ఏ వర్ణపు పోగుల్ని సాగదీయాలని
జీవితాన్ని ఏ చట్రం లో బంధించాలని
ఇలా భూతద్దం తో నావెంట పడ్డావ్?

చల్లని వెన్నెల్లో చంద్రికల్ని అద్దుకొని
మిలమిల మెరిసే మంచుబిందువుల్ని
ఆత్మీయంగా సేకరించే చంద్రచకోరాన్నై
రాత్రిపొడవునా సాహితీపచ్చికబయ్యళ్ళలో
స్వేచ్చావిహారం చేయాలనుకుంటే
నీడలా నీ చూపుల్ని నావెనకెనకే పరిగెట్టిస్తావెందుకు?
నా చేతనైనట్లు నాకోసం నేను
అచ్చం గా నాదనుకొనే స్వంత గడ్డపై కూడా
స్వతంత్రం గా తిరగలేని బతుకైపోయిన
అక్షరాల్ని ఏరుకొనే పిట్టని- అర్భకపు పక్షిని

..........................
.........................
..........................
..........................


ఏ సాహిత్యరాజకీయాల్తోనో
ఎక్కడికక్కడ ముఠాలు కట్టి
స్వార్ధప్రయోజనాల్ని మడిగానో దడిగానో
పరిధులు చుట్టుకుని
కూర్చున్నప్పుడుమాత్రమే
అక్షరాలు కూడా మసిబారి రంగు తేలిపోతాయ్
అలా కానప్పుడు
ఏ అక్షరాలైనా పదాలపక్షులై
ఆకాశకాగితం నిండా పంక్తులుపంక్తులుగా
విహంగయానం చేస్తూనే వుంటాయ్
అదే కదా నేను చేస్తున్నది
గూటిపక్క ఆకుపచ్చని కొమ్మపై కూర్చుని
ఆలోచనల్ని ఆలపిస్తున్న నన్ను
ఏ పంజరం లోనో బంధించి
ఏ చూరుకో వేలాడదీయాలని చూస్తావెందుకు?

నా స్వేచ్ఛకు హద్దులు పెట్టకు.

మూలాలు

[మార్చు]