పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము
![]() | |
రకం | ప్రభుత్వ |
---|---|
స్థాపితం | 1985 |
ఛాన్సలర్ | తమిళిసై సౌందరరాజన్ (తెలంగాణ గవర్నర్) |
స్థానం | హైదరాబాదు, భారతదేశం |
కాంపస్ | పట్టణ ప్రాంత |
అనుబంధాలు | విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం |
జాలగూడు | www.teluguuniversity.ac.in |
'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము' [1] భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఇది డిసెంబరు 2 1985 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య మరియు లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ మరియు తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం"గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010 లో పరిపాలన పరంగా, సాంస్కృతిక శాఖలో భాగమైంది.
విషయ సూచిక
విభాగాలు, కోర్సులు[మార్చు]
లలితకళా ప్రాంగణం, హైదరాబాదు[మార్చు]
- సామాజిక మరియు ఇతర విజ్ఞానాల పీఠం
ప్రసార మరియు పాత్రికేయ శాఖ, జ్యోతిష మరియు వాస్తు శాఖ
- తులనాత్మక అధ్యయన పీఠం
తులనాత్మక అధ్యయన శాఖ, అనువాదాల శాఖ
- సాహిత్య పీఠం
తెలుగు సాహిత్య అధ్యయన శాఖ
- లలిత కళల పీఠం
సంగీత శాఖ, నాట్య శాఖ, జానపద కళల శాఖ, రంగస్థల కళల శాఖ, శిల్ప మరియు చిత్ర కళల శాఖ, సంస్కృతి మరియ పర్యటన శాఖ
నన్నయ ప్రాంగణం, రాజమండ్రి[మార్చు]
- భాషాభివృద్ధి పీఠం
భాష అధ్యయన శాఖ, నిఘంటు తయారీ శాఖ
పోతన ప్రాంగణం, వరంగల్[మార్చు]
- జానపద మరియు తెగల సాహిత్య పీఠం
జానపద అధ్యయన శాఖ, తెగల అధ్యయన శాఖ
పాల్కురికి సోమనాథ ప్రాంగణం, శ్రీశైలం[మార్చు]
- చరిత్ర, సంస్కృతి మరియు పురాతత్వ పీఠం
తెలుగు మాట్లాడు ప్రజల చరిత్ర మరియు సంస్కృతి శాఖ, ప్రాచీన శాసన మరియు లిఖిత ఆధారాల శాఖ, పురాతత్వ శాఖ
శ్రీ సిద్ధేంద్రయోగి ప్రాంగణం, కూచిపూడి[మార్చు]
- సిద్ధేంద్ర యోగి కళా పీఠం
కేంద్రాలు[మార్చు]
కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు విజ్ఞాన సర్వస్వ కేంద్రము[మార్చు]
తెలుగు భాషా సమితి విషయాల క్రమంలో విజ్ఞాన సర్వస్వం ముద్రించింది. ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయములో విజ్ఞానసర్వస్వ కేంద్రము వాటిని పరిష్కరించి మరల కొత్త వాటిని ముద్రించింది. 1986 అక్టోబరు 15న తెలుగు భాషా సమితి విలీనంతో విజ్ఞాన సర్వస్వ కేంద్రము ప్రారంభించబడింది. దీనిని తరువాత కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు విజ్ఞాన సర్వస్వ కేంద్రముగా పేరు మార్చారు. వివిధ విషయాలలో 38 పైగా సంపుటాలను విడుదలచేయలనే ప్రణాళికలున్నాయి.తెలుగుభాషా సమితి 14 సంపుటాలను ప్రచురించింది. వీటిని ఆధునీకరించేపనిని కొత్త వి తయారుచేసే పనిని ఈ కేంద్రం చేపట్టింది. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, భారత భారతి, దర్శనములు-మతములు[2], విశ్వసాహితి[3], భారతభారతి, జ్యోతిర్విజ్ఞానము, ఆయుర్విజ్ఞానము, తెలుగు సంస్కృతి, నాటక విజ్ఞాన సర్వస్వం (2008) ప్రచురించబడినవి. ఇంగ్లిషులో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రాస్ అన్న సంపుటము ముద్రించబడింది. 11వ పంచవర్షప్రణాళికలో భాగంగా పని జరుగుతున్న సంపుటాలు.
- దేశము-చరిత్ర
- సిరిసంపదలు
- తెలుగు జానపద విజ్ఞాన సర్వస్వము
- సాహిత్య దర్శనము
అంతర్జాతీయ తెలుగు కేంద్రము[మార్చు]
ఇతర రాష్ట్రాలు, లేక దేశాలలోని తెలుగువారికోసం ఈ కేంద్రం పనిచేస్తుంది.తెలుగు పాఠ్యపుస్తకాలు, పాఠశాలలకు సహాయం, ఉపాధ్యాయ శిక్షణ మరియు ఆధునిక తెలుగు, కూచిపూడి నాట్యం మొదలైన వాటిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
దూర విద్యాకేంద్రము[మార్చు]
వివిధ అంశాలలో (తెలుగు, సంస్కృతంభాషలు, జ్యోతిషం, వార్తలు, సంగీతం, సినిమా సంభాషణ...) సర్టిఫికేట్, బిఎ, పిజిడిప్లొమా, ఎమ్ఎ, సర్టిఫికేట్ కోర్సులు
ప్రచురణలు[మార్చు]
చూడండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము ప్రచురణలు
అవార్డులు - పురస్కారాలు[మార్చు]
కీర్తి పురస్కారాలు[మార్చు]
తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కీర్తి పురస్కారాలు అందజేస్తారు.[4]
- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2012)[5]
- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2014)
- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2015)[6]
- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2017)
ప్రతిభా పురస్కారాలు[మార్చు]
తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తారు.[7]
- తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2013)[8]
- తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2017)
సాహితీ పురస్కారాలు[మార్చు]
తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు అందజేస్తుంది.[9]
ఇతర పురస్కారాలు[మార్చు]
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా[మార్చు]
క్రమసంఖ్య | పనిచేసిన కాలం | పేరు | ఇతర వివరాలు |
---|---|---|---|
1 | |||
2 | |||
3 | |||
4 | |||
5 | |||
6 | |||
7 | ఆవుల మంజులత | ||
8 | అనుమాండ్ల భూమయ్య | ||
9 | ఎల్లూరి శివారెడ్డి | ||
10 | జూలై 26, 2016 - ఆగస్టు, 2019 | ఆచార్య ఎస్వీ సత్యనారాయణ[14] | |
11 |
ఇప్పటివరకు పనిచేసిన రిజిస్ట్రార్ ల జాబితా[మార్చు]
క్రమసంఖ్య | పనిచేసిన కాలం | పేరు | ఇతర వివరాలు |
---|---|---|---|
ఆశీర్వాదం | |||
2017, నవంబరు - 2019, నవంబరు | ఆచార్య అలేఖ్య పుంజాల[15] | ||
నవంబరు 19, 2019 - ప్రస్తుతం | ప్రొ. భట్టు రమేష్[16] |
చిత్రమాలిక[మార్చు]
ఇవి కూడా చూడండి[మార్చు]
బయటి లింకులు[మార్చు]
వనరులు[మార్చు]
- ↑ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము వెబ్సైట్
- ↑ విజ్ఞాన సర్వస్వము సంపుటి 4 దర్శనములు-మతములు
- ↑ విజ్ఞాన సర్వస్వము సంపుటి 5విశ్వసాహితి
- ↑ నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". Retrieved 4 May 2018. Cite news requires
|newspaper=
(help) - ↑ సాక్షి, ఆంధ్రప్రదేశ్ (21 November 2013). "32 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". మూలం నుండి 27 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 27 May 2019. Cite news requires
|newspaper=
(help) - ↑ https://www.ntnews.com/news/article.aspx?category=1&subCategory=2&ContentId=538540
- ↑ ఆంధ్రజ్యోతి (15 November 2018). "12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు". మూలం నుండి 15 November 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 15 November 2018. Cite news requires
|newspaper=
(help) - ↑ https://www.jagranjosh.com/current-affairs/telugu-potti-sreeramulu-telugu-university-prathibha-awards-announced-1387626261-3
- ↑ ఈనాడు, హైదరాబాదు (18 June 2019). "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". మూలం నుండి 18 June 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 16 July 2019. Cite news requires
|newspaper=
(help) - ↑ http://www.navatelangana.com/article/state/823965
- ↑ https://www.andhrajyothy.com/artical?SID=832214
- ↑ http://www.navatelangana.com/article/state/829835
- ↑ https://google.eenadu.net/districts/news/118681/Hyderabad/1900/529
- ↑ నమస్తే తెలంగాణ, తెలుగుయూనివర్సిటీ. "తెలుగువర్సిటీ వీసీగా ఎస్వీ సత్యనారాయణ". Retrieved 27 July 2016. Cite news requires
|newspaper=
(help) - ↑ వార్త, తెలంగాణ (26 November 2017). "తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌గా తొలి మహిళ అలేఖ్య". మూలం నుండి 14 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 2 December 2019. Cite news requires
|newspaper=
(help) - ↑ ఈనాడు, హైదరాబాదు (1 December 2019). "తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా రమేష్". www.eenadu.net (ఆంగ్లం లో). మూలం నుండి 2 December 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 2 December 2019.
![]() |
Wikimedia Commons has media related to Potti Sreeramulu Telugu University. |