హను కోట్ల
డా. హను కోట్ల | |
---|---|
జననం | సెప్టెంబరు 1 మఖ్తల్, నారాయణపేట జిల్లా, తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాద్ |
వృత్తి | రంగస్థల అధ్యాపకులు |
ప్రసిద్ధి | రంగస్థల, టివీ, రేడియో నటులు, రచయిత, దర్శకులు, సినిమా నటులు |
భార్య / భర్త | డా. అనితారావు కోట్ల |
పిల్లలు | ఇద్దరు అమ్మాయిలు |
తండ్రి | నారాయణ |
తల్లి | సత్యవతి |
డా. హను కోట్ల రంగస్థల, టీవీ, రేడియో నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు, రంగస్థల అధ్యాపకుడు. హైదరాబాదు, తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళలశాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.[1]
జననం
[మార్చు]హను కోట్ల సెప్టెంబరు 1న కోట్ల నారాయణ, సత్యవతి దంపతులకు నారాయణపేట జిల్లా (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా), మఖ్తల్ లో జన్మించాడు.
విద్యాభ్యాసం
[మార్చు]7వ తరగతి వరకు లంకలో చదివిన , హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. మలక్‌పేటలోని బసవతారకం నవభారత్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్య పూర్తిచేసి, అనంతరం తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ (1993-1996), ఎం.ఏ. (1996-1998), పిహెచ్.డి (చిందు యక్షగానం - ప్రదర్శన పద్ధతులు - సౌందర్య దర్శనం, 2009) పూర్తిచేశాడు.
ఉద్యోగం
[మార్చు]1998 నుండి తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో బోధించడం ప్రారంభించాడు. 2006లో అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళలశాఖ విద్యార్థులకు, ఆంధ్ర మహిళా సభ విద్యార్థులకు యాంకరింగ్ లో శిక్షణలు ఇస్తున్నాడు. 2024, నవంబరు 25న రిజిస్ట్రార్ గా నియమించబడ్డాడు.
వివాహం
[మార్చు]1998లో నృత్యకారిణి, నాట్యగురువు డా. అనితారావుతో హను కోట్ల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు.[2]
రంగస్థల ప్రస్థానం
[మార్చు]నటించినవి
[మార్చు]- కళ్లు
- జంబూద్వీపం
- సాంబశివ ప్రహసనం
- గోగ్రహణం
- గాలిగోపురం
- గాయత్రి డాటరాఫ్ బషీర్ అహ్మద్
- మహాత్మ జ్యోతిరావు పూలే (నాటకం)
- భరత విలాపం (రాముడిగా)
వంటి 50కి పైగా నాటికనాటకాల్లో నటించారు.
రచించినవి
[మార్చు]- కాశ్మీర్ టూ కన్యాకుమారి
- తిర్గమనం
- తమసోమా జ్యోతిర్గమయ
- ఆశకిరణం
- రెక్కల భూతం
దర్శకత్వం చేసినవి
[మార్చు]సినిమారంగం
[మార్చు]నటించినవి
[మార్చు]- ఎల్లమ్మ
- ఈశ్వర్ [11]
- యువర్స్ అభి
- వీరి వీరి గుమ్మడి పండు
- చిన్నారి పంతులమ్మ
- సుందరానికి తొందరెక్కువ
దర్శకత్వం
[మార్చు]- ది డీల్ (2024)
అవార్డులు - పురస్కారాలు
[మార్చు]- రాజస్థాన్ రాష్ట్రంలోని జైసూర్ లో జరిగిన గుమర్ అంతర్జాతీయ యువజనోత్సవాల్లో మైమ్, ఏకాపాత్రాభినయం, ఏకాంకిక నాటికలో అవార్డులు
- కాశ్మీర్ టూ కన్యాకుమారి నాటికకుగానూ 2001లో ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు
- హిందీ ప్రచార సభ వారిచే తపస్య (హింది నాటిక) కు ఉత్తమ నటుడు, ద్వితీయ ఉత్తమ దర్శకుడిగా అవార్డు
- ఫిల్మ్ కౌన్సిల్ వారిచే ఉత్తమ ఏకాపాత్రాభినయం అవార్డు
- వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శ్రీత్యాగరాయ గానసభలో కెవి.రమణ చేతులమీదుగా కళారత్న పురస్కారం[12]
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రప్రభ, మెయిన్ ఫీచర్ (30 January 2018). "క్రికెటర్ నుండి యాక్టర్‌గా." డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట. Archived from the original on 31 January 2018. Retrieved 23 May 2019.
- ↑ ఆంధ్రభూమి, ఆదివారం సంచిక (30 March 2019). "ఆ ప్రతిభ 'అనిత'రసాధ్యం!". డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట. Archived from the original on 23 May 2019. Retrieved 23 May 2019.
- ↑ తెలుగు వన్ ఇండియా. "నృత్యం అద్భుతం: 'జయ జయహే తెలంగాణ'(పిక్చర్స్)". telugu.oneindia.com. Retrieved 16 November 2016.
- ↑ www.thehindu.com (February 26, 2016). "Period plays make a mark". Retrieved 16 November 2016.
- ↑ www.thehindu.com (May 26, 2016). "Nayakuralu Nagamma, a visual delight". Retrieved 16 November 2016.
- ↑ timesofindia.indiatimes.com (Nov 15, 2016). "Bringing alive Nagamma's life on stage". Retrieved 16 November 2016.
- ↑ ప్రజాశక్తి. "గ్రామ ప్రాంతాలకు నాటకం చేరాలి". Retrieved 28 March 2017.
- ↑ సాక్షి. "అలరించెన్". Archived from the original on 22 జనవరి 2021. Retrieved 28 March 2017.
- ↑ ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (27 December 2019). "ఆకట్టుకున్న ప్రతాపరుద్రమ నాటకం". www.andhrajyothy.com. Archived from the original on 31 December 2020. Retrieved 31 December 2020.
- ↑ ఈనాడు, హైదరాబాదు (31 December 2020). "'ప్రతాప రుద్రమ' అరుదైన ఘనత". www.eenadu.net. Archived from the original on 31 December 2020. Retrieved 31 December 2020.
- ↑ యూట్యూబ్. "Eeshwar Full Movie - Part 01/14". www.youtube.com. Retrieved 16 November 2016.
- ↑ navatelangana.com (14 September 2016). "కళాకారులే దేశానికి రత్నాలు". Retrieved 16 November 2016.