నాయకురాలు నాగమ్మ (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాయకురాలు నాగమ్మ
Nayakuralu Nagamma.jpg
నాయకురాలు నాగమ్మ నాటకంలోని దృశ్యం
రచయితవై.హెచ్‌.కే. మోహనరావు
నాటకీకరణఎ.ఎస్. నారాయణబాబు
దర్శకుడుకోట్ల హనుమంతరావు
తారాగణంనాగమ్మ - శ్రీమతి రోహిణి ప్రసాద్,
బ్రహ్మనాయుడు - మేకా రామకృష్ణ
ఒరిజినల్ భాషతెలుగు
విషయంచారిత్రక ప్రయోగాత్మక నాటకం
నిర్వహణసత్కళాభారతి

నాయకురాలు నాగమ్మ నాటకం చారిత్రక ప్రయోగాత్మక నాటకం. గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల కు చెందిన వైహెచ్‌కే.మోహనరావు రచించిన పుస్తకాన్ని ఉత్తమనాటక రచయితగా బహుమతి అందుకున్న ఎ.ఎస్.నారాయణబాబు నాటకీకరించగా, డా. కోట్ల హనుమంతరావు దర్శకత్వం వహించారు.[1][2] [3] [4]

కథాసారాంశం[మార్చు]

800 సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా, పెగడపల్లి మండలం ఆరవెల్లి గ్రామంలో నాగమ్మ జన్మించింది. ఇప్పటికీ నాగమ్మ నివసించిన ఇల్లు ఆ గ్రామంలో ఉంది. ఆ ఇంటిని నాగమ్మ గుడిగా స్థానికులు భావిస్తారు.[5] ఆరవెల్లి గ్రామంలో పుట్టి పల్నాటి సమైక్యత కోసం అహర్నిశలు కృషి చేసిన స్త్రీమూర్తి కథయిది. చరిత్రలోనే నాగమ్మ తొలి దేశీయ మహిళా మంత్రిగా పేరొందింది. 12వ శతాబ్దంలో ఆడది గడపదాటరాదన్న కట్టడిదాటి, సహగమనం తృణీకరించి భర్తను, తండ్రిని, మేనమామను కోల్పోయిన నాగమ్మ ప్రజలకోసం, పల్నాటి శ్రేయస్సు కోసం మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. పురుషాధిక్య సమాజానికి అదినచ్చలేదు. అందుకే ఆమెపై దుర్మార్గపు ప్రచారం జరిపి పగలు, పంతాలతో పల్నాడును విచ్చిన్నంచేసిందని ప్రచారం చేశారు. కానీ నిజంగా నాగమ్మ పల్నాడుకు చేసిన సేవలు, రాజ్యాభివృద్ధి, పొరుగు రాజ్యాలతో మైత్రిని మరిచారు. వందమంది యోధులతో సమానమైన నాగమ్మ మేధస్సు ఆమోఘం. పల్నాడు యుద్ధం వల్ల ఎందరో ఆడకూతుర్లు పసుపు కుంకుమలు కోల్పోతారని తానే తగ్గి బ్రహ్మనాయని షరతులకు తలొగ్గి సంధికై ప్రయత్నించింది. పల్నాడుకు శత్రువుల బెడద వదిలించి నలగాముని అఖండ పల్నాడుకు రాజుని చేసి తన శేషజీవితాన్ని స్వగ్రామమైన ఆరవెల్లి కి వెళ్లి అచ్చట గడుపుతూ ప్రజలకు ఆరాధ్య దైవమై గుడిలో దేవత అయింది.[6][7][8][9]

నటవర్గం[మార్చు]

నాగమ్మ - శ్రీమతి రోహిణి ప్రసాద్, బ్రహ్మనాయుడు - మేకా రామకృష్ణ, అనుగురాజు - జి. సత్యనారాయణ, నలగామరాజు - జితేంద్ర, నరసింగరాజు జంగం - డా. ఆంథోని రాజ్, రామిరెడ్డి - మోహన్ సేనాపతి, గోపన్న గురువు - డా. శ్రీధర్, జగ్గారెడ్డి - డా. హరిశ్చంద్ర రాయల, కోడిపుంజు - అజయ్ మంకెనపల్లి, అలరాజు - సురేష్, చిన్ననాగమ్మ - సన్నిధి, దొడ్డనాయుడు - రవి, బాలచంద్రుడు - వంశీ, కన్నమదాసు - భాస్కర్, వృద్ధురాలు - శాంతాదేవి, కోడలు - జయశ్రీ, రేఖ, కొడుకు - అమర్, పేరిందేల - అనుషా, కొమ్మరాజు - సతీష్, దొంగల నాయకులు - ఎల్. వెంకటేశ్వర్లు, దొంగలు - శివ, శ్రీనివాస్, ప్రభాకర్, పవన్, పర్వతాలు, సాయిరాం, సూత్రధారులు - డా. కోట్ల హనుమంతరావు, ముస్తఫా, భానుప్రకాశ్, వంశీ, మనోహర్, సురేష్, అజయ్ మంకెనపల్లి.

సాంకేతికవర్గం[మార్చు]

నృత్య దర్శకత్వం: డా. అనితారావు కోట్ల, రంగోద్ధీపనం - సురభి సంతోష్, పి. కొండల్ రెడ్డి, ఆహార్యం - డా. హరిశ్చంద్ర రాయల, దుస్తులు - శ్రీమతి రత్నామాధవ్, రంగాలంకరణ - క్రాంతి, మారయ్య మల్లం, సంగీతం - శ్రీనాథ్.

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి. "రాష్ట్ర విభజనతో నాటక రంగంలో సరికొత్త పోకడలు..!". Retrieved 25 April 2017.
  2. www.thehindu.com (February 26, 2016). "Period plays make a mark". Retrieved 25 April 2017.
  3. www.thehindu.com (May 26, 2016). "Nayakuralu Nagamma, a visual delight". Retrieved 25 April 2017.
  4. timesofindia.indiatimes.com (Nov 15, 2016). "Bringing alive Nagamma's life on stage". Retrieved 25 April 2017.
  5. బ్లాగ్ స్పాట్. "'నాయకురాలు నాగమ్మ' యదార్థ వృత్తాంతంపై ' ప్రత్యేక కథనం". palnaducharitra.blogspot.in. Archived from the original on 25 మార్చి 2017. Retrieved 25 April 2017.
  6. తెలంగాణ రాష్ట్రస్థాయి నాటక సప్తాహము-2017, నల్లగొండ. "నాయకురాలు నాగమ్మ": 21. Cite journal requires |journal= (help); |access-date= requires |url= (help)
  7. నమస్తే తెలంగాణ. "నాయకురాలు నాగమ్మ తెలంగాణ ధీర వనిత". Retrieved 25 April 2017.
  8. ఆంధ్రభూమి. "మహిళా రాజకీయాలకు ఆద్యురాలు 'నాగమ్మ'". Retrieved 25 April 2017.
  9. సాక్షి. "సమాజపు దృశ్య కావ్యాలు..'నంది' నాటకాలు". Retrieved 25 April 2017.