వాడ్రేవు చినవీరభద్రుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాడ్రేవు చినవీరభద్రుడు
వాడ్రేవు చినవీరభద్రుడు
జననంవాడ్రేవు చినవీరభద్రుడు
(1962-03-28) 1962 మార్చి 28 (వయసు 62)
ప్రసిద్ధిరచయిత
తండ్రివాడ్రేవు విశ్వేశ్వర వెంకట చలపతి
తల్లిసత్యవతీ దేవి

వాడ్రేవు చినవీరభద్రుడు కవి, కథారచయిత, విమర్శకుడు, అనువాదకుడు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, 2013 బాచ్ కి చెందిన అధికారి. వీరు 2022 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ, సంచాలకులుగా పదవీవిరమణ చేశారు. హైదరాబాద్ లో నివాసముంటున్నారు.

రచనలు[మార్చు]

కవిత్వ సంపుటాలు

 1. నిర్వికల్ప సంగీతం, 1986
 2. ఒంటరి చేలమధ్య ఒకత్తే మన అమ్మ,1995
 3. పునర్యానం, 2004
 4. కోకిల ప్రవేశించే కాలం, 2009
 5. నీటిరంగుల చిత్రం, 2014
 6. కొండ మీద అతిథి, 2019
 7. కొండ కింద పల్లె, 2021

కథాసంపుటాలు

 1. ప్రశ్నభూమి, 1990

సాహిత్యసమీక్ష

 1. సహృదయునికి ప్రేమలేఖ, 2001
 2. సాహిత్యమంటే ఏమిటి, 2009
 3. సాహిత్యసంస్కారం, 2017
 4. దశార్ణదేశపు హంసలు, 2019

నవల

 1. అరణ్యం, 1987

యాత్రాకథనాలు

 1. నేను తిరిగిన దారులు, 2011

విద్య

 1. కొన్ని కలలు కొన్ని మెలకువలు, 2005

బాల సాహిత్యం

 1. మీరు ఇంటి నుంచి ఏమి నేర్చుకోవాలి?2005
 2. మీరు బడి నుంచి ఏమి నేర్చుకోవాలి?2005
 3. మీరు సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి?2005

ఆధ్యాత్మికం

 1. పరమయోగి శ్రీ వై.హనుమంతరావు, 2006

సంకలనాలు

 1. వందేళ్ళ తెలుగుకథ, ఇరవయ్యవశతాబ్ది ప్రతినిథి కథల సంకలనం, ఎమెస్కో, 2001
 2. మనసున మనసై, భారతీయ కవులూ, వారి హృదయేశ్వరులూ, ఎమెస్కో, 2014

సంకలనాలూ, అనువాదాలూ

 1. ప్రత్యూష పవనాలు, ఎమెస్కో, 1996
 2. సత్యాన్వేషణ, 2500 ఏళ్ళ పాశ్చాత్య తత్త్వశాస్త్రం నుండి ఎంపిక చేసిన రచనలు, ఎనెస్కో, 2003
 3. ఇమాన్యువల్ కాంట్ రచనలు, పీకాక్ క్లాసిక్స్, 2008
 4. హైకూ యాత్ర, మత్సువొ బషొ యాత్రానుభవాలు, ఎమెస్కో,2010
 5. నాది దుఃఖం లేని దేశం, కబీరు కవిత్వం, శ్రీ ప్రచురణ, 2017

అనువాదాలు

 1. ఒక విజేత ఆత్మకథ, డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం 'వింగ్స్ ఆఫ్ ఫైర్ 'కు అనువాదం, ఎమెస్కో, 2002
 2. నా దేశ యువజనులారా, డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం 'ఇగ్నైటెడ్ మైండ్స్ 'కు అనువాదం, ఎమెస్కో, 2002, ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాదెమీ వారినుండి ఉత్తమ అనువాదపురస్కారం లభించింది.
 3. ఈ మొగ్గలు వికసిస్తాయి, డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం, 'యు ఆర్ బార్న్ టు బ్లోసం ' రీమ్ పబ్లికేషన్స్, 2009
 4. ఎవరికీ తలవంచకు, డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం 'ఇండామిటబుల్ స్పిరిట్ 'కు అనువాదం, రీమ్ పబ్లికేషన్స్, 2009
 5. ఉత్తమ కుటుంబం, ఉదాత్త దేశం, డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం, ఆచార్య మహాప్రజ్ఞ 'ద ఫామిలీ అండ్ ద నేషన్ 'కు అనువాదం, రీమ్ పబ్లికేషన్స్, 2015
 6. గాంధీ వెళ్ళిపోయాడు, మనకు దిక్కెవరు, డా.గోపాలకృష్ణ గాంధి, గాంధి ఈజ్ గాన్, హు విల్ గైడ్ అజ్ కు అనువాదం, ఎమెస్కో, 2010
 7. సత్యమొక్కటే,దర్శనాలు వేరు, గాంధీ టాగోర్ లేఖలు, ఎమెస్కో, 2016
 8. మహాత్ముడి పెద్దకొడుకు, హరిలాల్ గాంధి జీవితం, చందుభాయి భాగుభాయి దలాల్ గుజరాతీ రచనకు తృదీప్ సుహృద్ ఇంగ్లిషు అనువాదానికి తెలుగు, ఎమెస్కో, 2016
 9. వేదార్థ మీమాంస, ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి వేదిక్ హెర్మన్యూటిక్స్, ఎమెస్కో, 2011
 10. వారిలా కలగనండి, వారిలా సాధించండి, రశ్మి బన్సాల్, స్టే హంగ్రీ, స్టే ఫూలిష్, రీమ్ పబ్లికేషన్స్, 2010

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]