ఆర్వీయార్
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఆర్వీయార్గా ప్రసిద్ధుడైన ఇతని పూర్తిపేరు రాళ్లబండి వేంకటేశ్వరరావు. ఇతడు శతాధిక గ్రంథకర్త. అభ్యుదయ సాహిత్య ఉద్యమకారుడు, విమర్శకుడు, ప్రముఖ అనువాదకుడుగా పేరు గడించాడు. మాస్కోలోని రాదుగ ప్రచురణాలయంలో చాలా కాలం పనిచేశాడు. తరువాత విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకమండలిలో సభ్యుడిగా పనిచేశాడు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షవర్గంలో సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు. ఇతని అనువాద రచనలకు కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు లభించింది.
రచనలు[మార్చు]
- ఎగిరే ఓడ (అనువాదం)
- పెంపుడు తండ్రి (అనువాదం)
- గొర్రెల కాపరి (అనువాదం)
- శ్రీమాన్ మార్జాలం (అనువాదం)
- పిల్లలకే నా హృదయం అంకితం (అనువాదం)
- మీరూ బొమ్మలు వేయగలరు (అనువాదం)
- బాలల కోసం బుద్ధ కథ
- భగవద్గీత - మార్క్సిజం
- మతం మంచి చెడు
- పూర్వగాథకల్పతరువు
- అన్నాకరేనినా (అనువాదం)
- సాహిత్య తత్వం
- ఆంధ్ర సాహిత్య చరిత్ర - సంస్కృతి (సాహిత్యవ్యాసాలు)
- అనువాదాలు - ఆవిష్కరణలు - అవస్థలు
- భారత స్వాతంత్ర్య సమర చరిత్ర
- నొప్పి డాక్టరు (పుస్తకం) (అనువాదం)
- తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్ 500 BC-AD 624 (అనువాదం)
పురస్కారాలు[మార్చు]
- 1999: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.[1]
- 2012: తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్ 500 BC-AD 624 గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద బహుమతి
మూలాలు[మార్చు]
- ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.