నొప్పి డాక్టరు (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నొప్పి డాక్టరు
నొప్పి డాక్టరు పుస్తక ముఖచిత్రం
కృతికర్త: కొర్నేయ్ చుకోవ్ స్కీ (రష్యన్), తెలుగు అనువాదం: ఆర్వియార్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్
విడుదల: జులై 2015
పేజీలు: 180


నొప్పి డాక్టరు పిల్లలను జంతువులలోకంలోకి తీసుకువెళ్లే ఓ రంగుల బొమ్మల కథల పుస్తకం. పిల్లలకు సరదాగా, జాలీగా పుస్తక పఠనంపై ఆసక్తి, నైతిక విలువలు పెంపొందించే ఉద్దేశంతో ఈ పుస్తకం ముద్రింపబడింది.[1] వినోదంతో పాటు జంతువులకు, పక్షులకు సంబంధించిన విజ్ఞానం అందిచడంతోపాటు పుస్తకం పేరు, లోపలి భాష, జంతువుల, పక్షుల చేష్టలు పిల్లలను చాలా బాగా ఆకట్టుకుంటాయి.[2]

రచన[మార్చు]

కొర్నేయ్ చుకోవ్ స్కీ అనే రష్యన్ రచయిత రష్యా భాషలో రాసిన ఈ పుస్తకం 1986లో ప్రథమంగా ముద్రింపబడింది. దీనిని ఆర్వియార్ అనే రచయిత తెలుగులో అనువదించగా, వి. దువిదేవ్ చక్కని బొమ్మలతో అందంగా తయారుచేశారు.

ముద్రణ[మార్చు]

బాలలసాహిత్యంలో అనేక పుస్తకాలు ప్రచురించిన దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ వారు ఈ పుస్తకాన్ని అందమైన బైండింగ్ తో పిల్లలు చదివేందుకు వీలైన అక్షరాలతో 2015 జూలైలో ప్రచురించారు.

మూలాలు[మార్చు]

  1. పుస్తకం.నెట్, తెలుగు అనువాదాలు. "నొప్పి డాక్టరు". pustakam.net. మద్దిరాల శ్రీనివాసులు. Retrieved 6 January 2018.
  2. "పుస్తకం డాట్ నెట్ లో పుస్తక పరిచయం".