కేశవరావు జాదవ్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేశవరావు జాదవ్‌
KeshavaRao Jadhav.jpg
జననంజనవరి 27, 1933 -
హుస్సేనీఆలం, పాతబస్తీ, హైదరాబాదు
మరణంజూన్ 16, 2018
హైదరాబాదు, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాదు
ప్రసిద్ధితెలంగాణ ఉద్యమం తొలితరం నేత
మతంహిందూ
పిల్లలుముగ్గురు కుమారులు, ఓ కుమార్తె

కేశవరావు జాదవ్‌ (జనవరి 27, 1933 - జూన్ 16, 2018) తెలంగాణ ఉద్యమం తొలితరం నేత. తెలంగాణ సాయుధ పోరాటం, ముల్కీ ఉద్యమం, జై తెలంగాణ పోరాటంతోపాటూ తెలంగాణ మలి దశ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్న వ్యక్తి.[1]

జననం - ఉద్యోగం[మార్చు]

శవరావు జాదవ్‌ 1933, జనవరి 27న శంకర్‌రావు, అమృత దంపతులకు హైదరాబాదు పాతబస్తీలోని హుస్సేనీఆలంలో జన్మించాడు.[2] ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆంగ్ల అధ్యాపకునిగా పనిచేశాడు.

తెలంగాణ ఉద్యమం[మార్చు]

1952 నాన్‌ మూల్కీ గో బ్యాక్‌ ఉద్యమాన్ని నిర్వహించిన వారిలో ప్రముఖుడైన కేశవరావు 1956 తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమేకాకుండా, 1975 ఎమర్జెన్సీ సమయంలో 18 నెలలపాటు జైలు జీవితాన్ని అనుభవించాడు. 1969 ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు. మెదక్లో ఇందిరా గాంధీపైనా, కరీంనగర్ ఉప ఎన్నికలో కేసీఆర్‌పైనా పోటీచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టే సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సూచనలు, సలహాలు అందించిన ఈయన 2006లో తెలంగాణ జన ఐక్య కార్యాచరణ సమితి, 2008లో తెలంగాణ జన పరిషత్‌లో కీలకపాత్ర పోషించాడు. టు వర్డ్స్‌ మ్యాన్‌ కైండ్‌ (ఇంగ్లీషు), యువ పోరాటం (హిందీ) పత్రికలను నడిపాడు. భాషా సమస్య (సురమౌళితోకలిసి), మార్క్స్-గాంధీ- సోషలిజం (ఇంగ్లిష్), లోహియా ఇన్ పార్లమెంట్ పుస్తకాలను ఆయన వెలువరించాడు. నక్సల్స్‌ కు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలలో కీలక భూమిక పోషించాడు.

పదవులు[మార్చు]

  1. పీయూసీఎల్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు
  2. తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌
  3. పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు
  4. తెలంగాణ జనపరిషత్‌ కన్వీనర్‌
  5. సోషలిస్టు నాయకుడు లోహియా అనుచరుడిగా గుర్తింపు

మరణం[మార్చు]

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కేశవరావు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2018, జూన్ 16 శనివారంరోజున మరణించాడు.[3][4]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి, తెలంగాణా తాజావార్తలు (16 June 2018). "ప్రొఫెసర్ కేశవరావు జాదవ్‌ కన్నుమూత". మూలం నుండి 21 June 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 21 June 2018. Cite news requires |newspaper= (help)
  2. నవతెలంగాణ (17 June 2018). "ప్రొఫెసర్‌ కేశవరావు కన్నుమూత". మూలం నుండి 21 June 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 21 June 2018. Cite news requires |newspaper= (help)
  3. సాక్షి, తెలంగాణ (16 June 2018). "కేశవరావు జాదవ్‌ కన్నుమూత". మూలం నుండి 21 June 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 21 June 2018. Cite news requires |newspaper= (help)
  4. "జాదవ్‌సాబ్ ఇకలేరు". 17 June 2018. మూలం నుండి 21 June 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 21 June 2018. Cite news requires |newspaper= (help)