ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్

వికీపీడియా నుండి
(అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. (ఎ.ఎం.ఆర్.సి)
రకంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పరిశ్రమప్రజా రవాణా
పూర్వీకులు29-10-2015
స్థాపన29 అక్టోబరు 2015; 9 సంవత్సరాల క్రితం (2015-10-29)
విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ప్రధాన కార్యాలయం
విజయవాడ, అమరావతి
,
భారతదేశం
కీలక వ్యక్తులు
ఆర్. కరికాల్ వలవెన్ (చైర్మాన్)
ఎన్.పి. రామకృష్నా రెడ్డి (మ్యానేజింగ్ డైరెక్టరు)
సేవలువిజయవాడ మెట్రో, విశాఖపట్నం మెట్రో
యజమానిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎ.ఎం.ఆర్.సి) , విజయవాడ మెట్రో, విశాఖపట్నం మెట్రో నిర్వహణకు ఉద్దేశించి ప్రారంభించిన ప్రభుత్వ-పబ్లిక్ సెక్టార్ సంస్థ.[1] విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు అమలు కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్.పి.వి) గా మొదట దానిని ఎ.ఎం.ఆర్.సిలో చేర్చారు, తర్వాత విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టును కూడా ఈ జాబితాలో చేర్చారు.[2]  ఇది మొదట వి.జి.టి.యం ఉడాలో ఒక మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం వలె ప్రతిపాదించబడింది, తర్వాత దీనిని ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ లోకి మార్చారు.[3]

చరిత్ర

[మార్చు]

2015 అక్టోబరు 29 న అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ను మొదటి మేనేజింగ్ డైరెక్టరుగా ఎన్.పి. రామకృష్ణ రెడ్డితో ప్రారంభించారు . మొదటి ఈ ప్రాజెక్టును డి.ఎం.ఆర్.సి ఒక మీడియం మెట్రో రైలు ప్రాజెక్టుగా రూపకల్పన చేసింది, కాని కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ఇది భారత ప్రభుత్వంచే తిరస్కరించబడింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లైట్ మెట్రో రైలును ఎంపిక చేసింది, [4] దీనిని మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తున్న ఇ.శ్రీధరన్ తీవ్రంగా వ్యతిరేకించారు. రాజధాని నగరమైన అమరావతి యొక్క అవసరాలను ఇది తీర్చలేదని ఆయన అన్నరు. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయం లేక ప్రతిపాదనను మార్చలేదు. ఈ కారణంగా ఆయన విధుల నుండి తప్పుకున్నారు, అంతేకాక ఎ.ఎం.ఆర్.సి, డి.ఎం.ఆర్.సి మధ్య ఒప్పందం రద్దయింది.[5]  కొందరు కొరియా, మలేషియా కంపెనీల ఆర్థిక సహాయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎ.ఎం.ఆర్.సి ను ఆదేశించింది.[6]

ప్రాజెక్టులు

[మార్చు]

విజయవాడ మెట్రో

[మార్చు]

విజయవాడ మెట్రో రెండు కారిడార్లుగా ప్రతిపాదించారు, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి నిడమానూరు వరకు 13.3 కిమీ, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి పెనమలూరు వరకు 12.8 కిమీ పొడవు. ఈ కారిడార్లలో 25 స్టేషన్లు ఉన్నాయి[7] బస్టాండ్, పెనమలూరు మధ్య కారిడార్ కోసం ₹ 831 కోట్ల (US $ 120 మిలియన్), బస్టాండ్ నుండి నిడమానూరు  కారిడార్ కోసం ₹ 969 కోట్ల (US $ 130 మిలియన్) వెచ్చించారు.[8]

విశాఖపట్నం మెట్రో

[మార్చు]
దస్త్రం:Visakhapatnam Metro Map.jpg
విశాఖపట్నం మెట్రో కోసం ప్రతిపాదించిన మ్యాప్

దీనిని 42 కిలోమీటర్ల పొడవైన కారిడార్లతో ప్రతిపాదించారు, 31 కిలోమీటర్ల పొడవుతో గాజువాక నుండి కొమ్మాడి వరకు మొదటిది, గురుద్వార్ నుండి 5 కిలోమీటర్ల ఓల్డ్ పోస్ట్ ఆఫీసు వరకు రెండవది, మూడవది తడిచెట్లపాలెంనుండి చిన్న వాల్తేరు వరకు 7 కిమీ.[9] ఈ ప్రాజక్టు వ్యయం 8,000 crore8,000 crore (US$1.0 billion)[10]గా అంచనా.

మూలాలు

[మార్చు]
  1. "G.O.MS.No. 141" (PDF). MUNICIPAL ADMINISTRATION & URBAN DEVELOPMENT (H2) DEPARTMENT. 13 August 2014. Archived from the original (PDF) on 13 జూలై 2019. Retrieved 12 నవంబరు 2018.
  2. "AMRC issues RfP to 5 bidders for Vizag metro rail project - Times of India". The Times of India. Retrieved 11 November 2018.
  3. "Andhra Pradesh to replace VGTM-UDA with CRDA - Times of India". The Times of India. Retrieved 11 November 2018.
  4. "Vijayawada Metro: Andhra picks Light Metro Rail for Amaravati, puts project on fast track - The Financial Express". www.financialexpress.com. Retrieved 2018-11-11.
  5. "Fresh plea made to Centre for Vizag, Vijayawada metro rail". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-01-14. Retrieved 2018-11-11.
  6. "Where do Vizag and Vijayawada metro projects stand? AMRC MD tells TNM". The News Minute. 2017-11-26. Retrieved 2018-11-11.
  7. "Project Profile - Amaravati Metro". Amaravati Metro (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-11-11. Retrieved 2018-11-11.
  8. "Vijayawada Metro Rail to cost Rs. 288 crore per km". Vijayawada. 17 March 2015. Retrieved 11 November 2018.
  9. "DMRC prepares report on Vizag Metro rail". Deccan Chronicle. Retrieved 11 November 2018.
  10. "Rs 8,000 crore light metro rail project in Visakhapatnam". The New Indian Express. Retrieved 2018-11-11.