ఫకీర్లు, సన్యాసుల తిరుగుబాటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జల్పాయిగురి డివిజన్ మ్యాప్

18 వ శతాబ్దంలో ఈస్టు ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా బెంగాల్లోని సన్యాసి తిరుగుబాటు (సన్నీస్ తిరుగుబాటు (బెంగాళీ: সন্ন্যাসী বিদ্রোহ) సన్యాసులు 'తిరుగుబాటు)) జరిగింది. సన్యాసులు, ఫకీర్సు(హిందూ, ముస్లిం సన్యాసులు)తిరుగుబాటు కార్యకలాపాలు. ఇది సన్యాసి తిరుగుబాటు (সন্ন্যাসী বিদ্রোহ) అని కూడా పిలువబడింది. ఇది జల్పాయిగురి లోని ముర్షిదాబాద్, బైకుంఠుపూర్ అడవులలో జరిగింది. చరిత్రకారులు తిరుగుబాటును మాత్రమే చర్చించక భారత చరిత్రలో తిరుగుబాటు ప్రాముఖ్యతల వైవిధ్యాన్ని కూడా చర్చించారు. 1764 లో బుక్సారు యుద్ధం తరువాత బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీకి పన్ను వసూలు చేసే హక్కు ఇవ్వబడింది కనుక కొందరు విదేశీ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం ప్రారంభ యుద్ధంగా దీనిని సూచించారు. 1770 నాటి బెంగాలు రాష్ట్రంలో కరువు మూలంగా సంభవించిన జననష్టం తరువాత హింసాత్మక బందిపోటు చర్యలుగా పరిశీలకులు దీనిని వర్గీకరించారు. [1]

ఆరంభకాల సంఘటనలు[మార్చు]

కనీసం మూడు ప్రత్యేక సంఘటనలను సన్యాసుల తిరుగుబాటు అని పిలుస్తారు. ఉత్తర భారతదేశము నుండి బెంగాలు లోని వేర్వేరు ప్రదేశాలకు వెళ్ళే హిందూ సన్యాసులు అనే ఒక పెద్ద సంస్థ దేవాలయములను సందర్శించటం. పుణ్యక్షేత్రాలకి వెళ్ళే మార్గంలో అనేక జమీందార్లు లేదా ప్రాంతీయ భూస్వాముల నుండి మతపరమైన చందాలు వసూలు చేసే అలవాటు ఉండేది. సుసంపన్నంగా ఉన్న సమయములో భూస్వాములు, జేమిదార్లు సాధారణంగా ఈ విధానాలకు కట్టుబడి ఉండేవారు. అయినప్పటికీ " ఈస్టు ఇండియా కంపెనీ దీవానీ ( పన్ను ) వసూలు చేయటానికి హక్కును పొందింది కనుక అనేక విధాలైన పన్ను అధికరించింది. ప్రాంతీయ భూస్వాములు, జమిందారులు మతపరమైన చందాలు, ఆగ్లేయులు విధించిన పన్నులు రెండింటినీ చెల్లించలేకపోయారు. బెంగాలులో సంభవించిన కరువు కారణంగా మిలియన్ల మంది ప్రజలు మరణించడం, పంటలు నాశనం కావడం సంభవించాయి. బెంగాల్ జనాభాలో మూడింట ఒక వంతు మంది కరువు కారణంగా మరణించారని అంచనా వేశారు. సాగునీటి పొలాలు అధికంగా నిస్సారంగా మారడంతో సమస్యలు తలెత్తాయి.[1]

1772 లో బెంగాల్ గుండా ప్రయాణిస్తున్న ఫకీర్ల సమూహం నాయకుడు మజ్నున్ షా మునుపటి సంవత్సరంలో కారణం లేకుండా 150 మంది మరణించారని పేర్కొన్నాడు.[2] ఈ అణచివేత ముఖ్యంగా ఆధునిక బంగ్లాదేశ్లో రంగ్పూరులోని నాటోరులో హింసాకాండకు దారి తీసిన కారణాలలో ఒకటిగా మారింది. ఉంది. ఆధునిక చరిత్రకారులు కొందరు ఈ ఉద్యమం ప్రజాదరణ పొందలేదు అని వాదించారు.[1]


ఇతర రెండు ఉద్యమాలు హిందూ సన్యాసుల విభాగానికి చెందినవి. దస్నామి నాగ సన్యాసిస్, అదేవిధంగా డబ్బు సంపాదించే అవకాశాలు కలిపిన తీర్థయాత్రగా చేసి అందులో పాల్గొన్నారు.[1] బ్రిటీషువారికి ఈ తాంత్రిక దోపిడీదారులు కంపెనీకి సంబంధించిన డబ్బును సేకరించడం నిలపడానికి సన్యాసులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా బహుశా నిలిపివేయడానికి ప్రయత్నించారు. ఉద్యమంలో అత్యధిక సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొంటారని భీతి చెందారు. [3]

ఈస్టు ఇండియా కంపెనీ, సన్యాసుల మద్య సంఘర్షణలు[మార్చు]

18 వ శతాబ్దం చివరి మూడు దశాబ్దాల్లో సంస్థ దళాలు సాన్యాసులు, ఫకీర్లను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా డబ్బును సేకరించకుండా నిరోధించడానికి ప్రయత్నించడంలో కంపెనీ దళాలు విఫలం కావడంతో ఘర్షణలు సంభవించాయి. కరువు తరువాత చాలా సంవత్సరాల్లో ఘర్షణలు నమోదు చేయబడ్డాయి. కాని వారు తక్కువ స్థాయిలో 1802 వరకూ కొనసాగాయి. అత్యుత్తమ శిక్షణ, దళాలతో కూడా అప్పటికి వలసల తారతమ్యాలతో కంపెనీ అరుదైన ఘర్షణలను అణచివేయలేకపోయింది. స్థానిక కార్యక్రమాలలో బీర్భుం, మిడ్నపూర్ వంటి దూర ప్రాంతాలలోని కొండ, అడవి కప్పబడిన జిల్లాల్లో కంపెనీ దళాల నియంత్రణ బలహీనంగా ఉంది.[3]

వారసత్వం[మార్చు]

1799 చువార్ తిరుగుబాటు, 1855-56 సంతల్ తిరుగుబాటుతో సహా ప్రావిన్సు పశ్చిమ జిల్లాలు [3] సన్యాసుల తిరుగుబాటు తరువాత వచ్చిన తిరుగుబాట్లపై చర్చలు జరిగాయి. బహుశా తిరుగుబాటు సాహిత్యంలో ఉత్తమ స్మారకంగా ఉంది. భారతదేశ మొట్టమొదటి ఆధునిక నవలా రచయిత అయిన బంకిమ్ చంద్ర ఛటర్జీ తన బెంగాలీ నవల " అనందమఠ్ " లో వ్రాశారు. 1876 లో రాసిన వెందేమాతరం 1882 లో అనందమఠ్ పుస్తకంలో (బెంగాలీలో అనందొమోత్ అని ఉచ్ఛరిస్తారు), పుస్తకంపై ఆధారమైన 1952 చిత్రంలో ఉపయోగించారు. వందేమాతరం తరువాత భారత జాతీయగీతంగా ప్రకటించబడింది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 Lorenzen, D.N. (1978). "Warrior Ascetics in Indian History". Journal of the American Oriental Society. American Oriental Society. 98 (1): 617–75. doi:10.2307/600151. JSTOR 600151.
  2. Ghosh, Jamini Mohan (1930). Sannyasi and fakir raiders in Bengal. Bengal Secretariat Book Depot. p. 47.
  3. 3.0 3.1 3.2 Marshall, P.J. (1987). Bengal: the British Bridgehead. The New Cambridge History of India. Cambridge, UK: Cambridge University Press. p. 96. ISBN 0-521-25330-6.